వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గర్ల్స్‌కి రిప్లై ఇవ్వట్లేదు.. నాకు అంత ధైర్యమా?: సౌమ్యకు కేటీఆర్, 'మోడీ కాదు.. కేసీఆర్'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

ఫాన్స్ ని సోషల్ మీడియా లో అలరించిన కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆదివారం ట్విట్టర్ ద్వారా నెటిజన్లు వేసిన ప్రశ్నలకు దాదాపు రెండు గంటల పాటు సమాధానాలు ఇచ్చారు. ఆయన సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఆదివారం ట్విట్టర్ చాట్‌లో పాల్గొని, నెటిజన్ల పలు ప్రశ్నలకు స్పందించారు.

రోడ్డు సైడ్ ఫుడ్ ఇష్టం

తనకు ఇష్టమైన రోడ్డు సైడ్ ఫుడ్ బండి మీది ఫుడ్ అని కేటీఆర్ చెప్పారు. చైనీస్ ఫుడ్ కూడా ఇష్టమే అన్నారు. ప్రజల కోసమైనా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంతర్గత కుమ్ములాటలు మానుకోవాలని, లేదంటే శాశ్వతంగా ప్రతిపక్షంలో మిగిలిపోతారని, మీరేమంటారని కేటీఆర్‌ను రఫి అనే నెటిజన్ ప్రశ్నించగా.. వారు అలాగే ఉండాలని కోరుకుంటున్నానని సరదాగా అన్నారు.

నాకు అంత ధైర్యం ఉందా?

సర్.. మీరు అమ్మాయిలకు రిప్లై ఇవ్వట్లేదు అని సౌమ్య అనే నెటిజన్ ప్రశ్నించగా.. నాకు అంత ధైర్యం ఉందా అన్నారు. మీకు ఇష్టమైన బీర్ ఏది అని ఓ నెటిజన్అడగగా... దానికి సమాధానం చెప్పలేమన్నారు. మోడీ లేదా రాహుల్ గాంధీ? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. అది సరే ప్రశ్న ఏది అని సరదాగా వ్యాఖ్యానించారు. ఎప్పుడైనా కలిసి లంచ్ చేద్దామా అని ఓ నెటిజన్ అడిగితే.. సాధారణంగా నేను లంచ్ తినను అని సరదాగా సమాధానం ఇచ్చారు.

తెలివిగా ఆలోచించి కేసీఆర్‌కు ఓటు వేయి

ఏపీలో మీలాంటి నాయకుడు కావాలని డీఆర్కే అనే నెటిజన్ చెప్పారు. రానున్న అయిదు, పదేళ్లలో ఏం ప్లాన్ చేసుకున్నారని అడగ్గా.. అలాంటిదేమీ లేదని కేటీఆర్ చెప్పారు. రాంబాబు అనే నెటిజన్ ప్రశ్నిస్తూ.. నేను కేసీఆర్ -మోడీ అభిమానిని అని, స్నేహితుల మధ్య చర్చ జరిగినప్పుడు ఎలా బ్యాలెన్స్ చేయాలని అడిగారు. దానికి కేటీఆర్ స్పందిస్తూ.. సమానం ఉందని ఎవరు చెప్పారు, తెలివిగా ఆలోచించి కేసీఆర్‌కు ఓటు వేయి అన్నారు.

బెంగాళీ ఫుడ్ కూడా ఇష్టం

సర్, మీరు దీనికి స్పందించాలి, లేదంటే నేను నా స్నేహితుడికి కొత్త రూ.2000 నోటును కోల్పోతాను అని అమరేశ్ రెడ్డి అనే నెటిజన్ పేర్కొనగా.. నమస్కారం సింబల్‌తో కేటీఆర్ స్పందించారు. కోల్‌కతాలో ఉన్నప్పుడు తాను బెంగాళీ ఫుడ్ తిన్నానని, దానిని కూడా తాను ఇష్టపడతానని చెప్పారు.

English summary
Telangana IT Minister Kalvakuntla Taraka Rama Rao responded for woman netizen that 'How dare I'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X