వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలోనే తక్కువ టెస్ట్‌లు ఎందుకు..? వివరాలు అందజేయండి, టీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కరోనా టెస్ట్‌లను సామర్థ్యం మేరకు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాల వాదనలకు బలం చేకూర్చేలా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సూర్యాపేటలో టెస్ట్‌లు చేయడం లేదని ధర్మాసనం దృష్టికి పిటిషనర్ తీసుకొచ్చారు. పిటిషినర్ వాదనలు విన్న ధర్మాసనం... ఇప్పటివరకు చేసిన పరీక్షల వివరాలను అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణకు ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.

500 బస్సులు: వలసకూలీల కోసం పంపిన ప్రియాంక గాంధీ, పర్మిషన్ ఇవ్వని యోగి ఆదిత్యనాథ్..500 బస్సులు: వలసకూలీల కోసం పంపిన ప్రియాంక గాంధీ, పర్మిషన్ ఇవ్వని యోగి ఆదిత్యనాథ్..

సూర్యాపేటలో కరోనా వైరస్ పరీక్షలు ఎందుకు చేయడం లేదు అని హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్, జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి‌తో కూడిన ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పరీక్షలు చేయకుంటే ఎలా.. ప్రజలు భయాందోళనకు గురికారా అని అడిగింది. హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న సూర్యాపేటలో పరీక్షలు చేయడానికి ఉన్న ఇబ్బందులు ఏమిటని ప్రశ్నించింది. పరీక్షలు చేయకుంటే వైరస్ వ్యాపించి.. మరింత ప్రమాదం కాదా అని అడిగింది.

how many coronavirus tests conduct in state: highcourt

సూర్యాపేటతోపాటు రాష్ట్రంలో గతనెల 24వ తేదీ నుంచి ఇప్పటివరకు ఎన్ని పరీక్షలు చేశారని అడిగింది. వలసకూలీల వస్తున్నందన కేసులు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ప్రభుత్వ ల్యాబులతోపాటు ప్రైవేట్ ల్యాబ్‌లకు అనుమతిస్తే బాగుంటుందని సూచించింది. కేరళలో మాదిరిగా మొబలై టెస్ట్ చేసే చర్లు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. దేశంలో కన్నా తెలంగాణలో తక్కువ టెస్ట్‌లు చేశారని.. ధర్మాసనం ఒకింత ఆగ్రహాం వ్యక్తం చేసింది.

English summary
how many coronavirus tests conduct in state between april 24 to till the date highcourt ask telangana government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X