అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మధ్యంతర బెయిల్: ఆ 12 గంటలు ఎమ్మెల్యే రేవంత్ ఏం చేశారు?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కుమార్తె నిశ్చితార్ధం కోసం మధ్యంతర బెయిల్‌ కోసం తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కోర్టు అనుమతి కోరుతూ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

రేవంత్ పిటిషన్‌పై విచారించిన ఏసీబీ కోర్టు రూ. 50 వేల పూచీకత్తుతో గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

How revanth reddy spend his 12 hours bail

మధ్యంతర బెయిల్‌పై విడుదలై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఈ 12 గంటలను ఎలా గడిపారో ఒక్కసారి చూద్దాం.

* గురువారం ఉదయం 6 గంటలకు చర్లపల్లి జైలు నుంచి రేవంత్ రెడ్డి విడుదలయ్యారు.

* ఉదయం 6.40 గంటలకు జూబ్లీహిల్స్‌లో ఉన్న తన నివాసానికి చేరుకున్నారు.

* 8 గంటలకు భార్య గీత, కుమార్తె నైమిశతో కలిసి ఇంటి నుంచి బయలుదేరి, నిశ్చితార్థ వేదికైన ఎన్ కన్వేన్ష్‌న్‌కు చేరుకున్నారు.

* 10 గంటలక వరకు ఎన్ కన్వేన్ష్‌న్‌ వద్ద నిశ్చితార్ధ ఏర్పాట్లను పర్యవేక్షంచారు.

* నిశ్చితార్ధం కార్యక్రమం 10.15 గంటలకు ప్రారంభమైంది.

* మధ్యాహనం 2.30 గంటలకు కార్యక్రమం ముగిసింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు.

* 3 గంటల ప్రాంతంలో తిరిగి తన నివాసానికి చేరుకున్నారు.

* 3 గంటల నుంచి 4 గంటల వరకు కుటుంబ సభ్యులతో గడిపారు.

* కుటుంబ సభ్యులతో గంట సేపు గడిపిన రేవంత్ రెడ్డి 4 గంటలకు ఇంటి నుంచి చర్లపల్లి జైలుకు బయలుదేరారు.

గంట ముందుగానే జైలుకు చేరుకున్న రేవంత్ రెడ్డి:

ఎస్కార్ట్ సిబ్బంది ఆయనతో పాటు జైలుకు బయలుదేరి వెళ్లారు. రెండు గంటల సమయం ఉన్నప్పటికీ, సాయంత్రం 6 గంటల్లోగానే జైలుకు తిరిగి వెళ్లాలన్న నిబంధన ఉండటంతో ముందే బయల్దేరినట్లు తెలుస్తోంది.

సాయంత్రం 5 గంటలకే ఆయన చర్లపల్లి జైలుకు చేరుకున్నారు. చాలామంది ఆయనను కలిసేందుకు జైలు వద్దకు వచ్చినా, ఆయన మాత్రం ముందుగానే జైలు లోపలకు వెళ్లిపోయారు.

English summary
How revanth reddy spend his 12 hours bail for his daughter engagement function.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X