హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అభయ్‌ కిడ్నాప్, హత్య మిస్టరీ ఎలా వీడింది: ఎందుకలా...?

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

అభయ్‌ కిడ్నాప్, హత్య మిస్టరీ

హైదరాబాద్: పదో తరగతి విద్యార్థి అభయ్ కిడ్నాప్, హత్య కేసులో ముగ్గురు దోషులకు జీవిత ఖైదు విధిస్తూ హైదరాబాదులోని నాంపల్లి కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. 2016లో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు నిందితులను ఎలా పట్టుకున్నారనేది ఆసక్తికరమైన విషయమే.

అభయ్‌ను స్కూటీపై తీసుకెళ్లిన కుర్రాడిని చిన్నసాయిగా గుర్తించి అతడ్ని విశాఖలో అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ రైల్వేస్టేషన్‌లో దొరికిన హంతకుల ఫోన్‌లో నెంబర్లపై నిఘా ఉంచిన పోలీసులు కేసు దర్యాప్తును వేగిరం చేసి నిందితులను పట్టుకోగలిగారు.

 హవాలా వ్యాపారం చేస్తున్నాడని..

హవాలా వ్యాపారం చేస్తున్నాడని..

అభయ్‌ తండ్రి రాజ్‌కుమార్‌ హవాలా వ్యాపారం నిర్వహిస్తున్నాడని, అతడి వద్ద రూ.కోట్లు ఉన్నాయన్న సమాచారంతో నిందితులు తొలుత అభయ్‌ను అపహరించి భారీగా డబ్బు డిమాండ్‌ చేయాలని అనుకున్నారు. చిన్న సాయికి డబ్బు ఆశ చూపించి అభయ్‌ను తీసుకురావాల్సిందిగా పురమాయించారు. అభయ్‌ అపహరణ కోసం నిందితులు ఆరు నెలలుగా పథకం రచిస్తున్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి.

 అతన్ని స్కూటీపై తీసికెళ్లాడు

అతన్ని స్కూటీపై తీసికెళ్లాడు

అభయ్‌ను స్కూటీపై తీసుకెళ్లిన చిన్నసాయి గోషామహల్‌లోని హరిఓంకాలనీలో ప్రదీప్‌ ధారక్‌ అనే ప్లాస్టిక్‌ వ్యాపారి ఇంట్లో పని చేస్తున్నాడని అభయ్‌ కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. రాజమండ్రికి చెందిన చిన్నసాయి(21) ఆరు నెలల క్రితం ప్రదీప్‌ ఇంట్లో పనికి కుదిరాడు. తరచూ అభయ్‌ ఇంటికి వస్తుండేవాడు.

 చిన్నసాయి గురించి ఇలా తెలిసింది..

చిన్నసాయి గురించి ఇలా తెలిసింది..

అభయ్‌ని అపహరించింది ఎవరనేది పోలీసులు పరిశోధిస్తుండగా చిన్నసాయికి సంబంధించిన ఆధారాలు లభించాయి.పదిరోజుల క్రితమే ఇంటికి వెళ్తానంటూ రాజమండ్రి వెళ్లాడని యజమాని ప్రదీప్‌ పోలీసులకు చెప్పారు. రాజమండ్రిలోని చిన్నసాయి కుటుంబ సభ్యులను పోలీసులు సంప్రదించగా వారు తమకేం తెలీదని చెప్పారు.

 పది కోట్ల నుంచి ఐదు కోట్లకు..

పది కోట్ల నుంచి ఐదు కోట్లకు..

రూ.10కోట్లు డిమాండ్‌ చేసి, రూ.5కోట్లు కచ్చితంగా కావాలంటూ ఫోన్‌లో బెదిరించిన వ్యక్తి విజయవాడ రైల్వేస్టేషన్‌లో ఫోన్‌ పారేసి పరారయ్యాడు. ఆ ఫోన్‌లోని నంబర్లపై నిఘా వేసిన పోలీసులు చిన్నసాయిని పట్టుకోగలిగారు. చిన్నసాయి అందించిన సమాచారం ప్రకారం ఇద్దరు నిందితులనూ అదుపులోకి తీసుకున్నారు. సాయి రాజమండ్రికి వెళ్తానని పది రోజుల క్రితం చెప్పింది అబద్ధమని సీసీటీవీలోని దృశ్యాల ద్వారా తేలింది.

 నిందితులు ఇలా ఫోన్ చేశారు..

నిందితులు ఇలా ఫోన్ చేశారు..

ఆ రోజు సాయంత్రం సుమారు ఐదు గంటల పాటు సాయితో కలిసున్నాక అభయ్‌ హత్యకు గురయ్యాడు. పదికోట్లు డిమాండ్ చేసిన నిందితులు అభయ్‌ను కిడ్నాప్ చేసిన వ్యక్తులు బుధవారం రాత్రి 10.05 గంటల సమయంలో 7842276480 నంబర్ నుంచి తండ్రి రాజ్‌కుమార్‌కు ఫోన్ చేశారు. పది నిమిషాల్లో పది కోట్ల రూపాయలు తెచ్చి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనీసం ఐదు కోట్లు ఇస్తే మీ అబ్బాయి గురువారం ఉదయం ఆరు గంటలకు ఇంటికి తిరిగి వస్తాడు అని ఓ కిడ్నాపర్ బేరానికి దిగాడు.

 సెల్‌ఫోన్ సంకేతాల ద్వారా...

సెల్‌ఫోన్ సంకేతాల ద్వారా...

చివరకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు రావాలని ఫోన్ పెట్టేశాడు. ఈ క్రమంలో డబ్బులు డిమాండ్ చేశారన్న విషయాన్ని, సెల్‌ఫోన్ నంబర్‌ను రాజ్‌కుమార్ పోలీసులకు అందించారు. ఆ ఫోన్‌కాల్ సికింద్రాబాద్ ప్రాంతం నుంచి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత రాత్రి 11గంటల ప్రాంతంలో కిడ్నాపర్ మరోసారి ఫోన్ చేసి డబ్బు ఏమైందని ప్రశ్నించాడు. అయితే ఈసారి టవర్ లొకేషన్ నల్గొండ జిల్లా భువనగిరి ప్రాంతంలో చూపించిందని పోలీసులు తెలిపారు.

 ఇలా అంచనా వేశారు...

ఇలా అంచనా వేశారు...

ఇద్దరు వ్యక్తులు వాహనంపై వచ్చి అట్టపెట్టెను సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంతంలో ఆల్ఫా హోటల్ ప్రాంతంలో వదిలివెళ్లినట్టు సీసీ టీవీ ఫుటేజ్‌లో స్పష్టమైంది. మహాలక్ష్మి టిఫిన్ సెంటర్ నుంచి హోండా యాక్టివాపై బయలుదేరి దారుస్సలాం ప్రాంతంలో కిడ్నాపర్లు దానిని వదిలేసి కారులో అభయ్‌ను తీసుకువెళ్లినట్లు పోలీసులు అంచనా వేశారు.

ఆచూకీకి బహుమతి ప్రకటించారు...

ఆచూకీకి బహుమతి ప్రకటించారు...

హైదరాబాద్ సీపీ అభయ్ కిడ్నాప్, హత్యకేసులో నిందితుల ఆచూకీకి సంబంధించిన సమాచారం అందిస్తే లక్ష రూపాయల బహుమతి ఇస్తామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి ప్రకటించారు. అభయ్‌ను ద్విచక్రవాహనం మీద తీసుకువెళ్తున్న యువకుడిని ఎవరైనా గుర్తుపట్టినా, అతని గురించి తెలిసినా వెంటనే వెస్ట్‌జోన్ డీసీపీ (9490616552)కు లేదా హైదరాబాద్ వాట్సప్(9490616555) సమాచారం అందించాలని సీపీ తెలిపారు. సమాచారం అందించిన వ్యక్తి వివరాలు రహస్యంగా ఉంచుతామని చెప్పారు.

 ఇంటి పక్కనే ఉంటూ..

ఇంటి పక్కనే ఉంటూ..

కిడ్నాప్ చేసిన వ్యక్తిని ఇంటి పక్కన ఉండే సాయిగా పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి చెందిన ముఠా సాయంతో అభయ్‌ని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కొంతకాలంగా అభయ్‌తో స్నేహంగా మెలుగుతున్నాడు. స్నేహం పేరుతో అభయ్‌ని నమ్మించి మోసం చేశాడు. అభయ్ హత్య అనంతరం వారు విజయవాడ పారిపోయారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కొందరు ఏపీకి వెళ్లారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడు ఎక్కడ ఉన్నాడో పోలీసులు గుర్తించారు.

 అభయ్ టిఫిన్ కోసం..

అభయ్ టిఫిన్ కోసం..

ఎప్పటిలానే అభయ్ బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో టిఫిన్ తెచ్చుకునేందుకు హోండా యాక్టివాపై ఆగాపురాలోని మహాలక్ష్మి టిఫిన్ సెంటర్‌కు వెళ్లాడు. అభయ్ ఎంతకు రాకపోవడంతో తల్లి అనురాధ తన తోడు కోడలు కవిత సెల్‌ఫోన్ ద్వారా అభయ్‌కి ఫోన్ చేసి ఇంకా రాలేదేమని అడుగగా మరో ఐదు నిమిషాలలో ఇంటికి చేరుకుంటానని సమాధానం ఇచ్చాడు.

రాజ్‌కుమార్‌కు ఇద్దరు పిల్లలు

రాజ్‌కుమార్‌కు ఇద్దరు పిల్లలు

షాహినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓం కాలనీలో నివాసముంటున్న రాజ్‌కుమార్ మోదానీ, అనురాధ దంపతులకు అభయ్(16), అభిషేక్(16) కవలలున్నారు. ఇద్దరు కూడా ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. హైదరాబాద్ నగర శివారులోని కాటేదాన్‌లో రాజ్‌కుమార్ ప్లాస్టిక్ పరిశ్రమను నిర్వహిస్తున్నాడు.

 మళ్లీ ఫోన్ ఇలా..

మళ్లీ ఫోన్ ఇలా..

అరగంట గడిచినా అభయ్ ఇంటికి చేరుకోకపోవడంతో తల్లి తిరిగి ఫోన్ చేయగా స్విచ్‌ఆఫ్ అని వచ్చింది. దాంతో ఆందోళనకు గురైన ఆమె.. భర్త రాజ్‌కుమార్‌కు సమాచారం అందించారు. ఇంటికి చేరుకొన్న రాజ్‌కుమార్.. బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో రాత్రి ఏడున్నరకు షాహినాయత్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి అభయ్ కోసం ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు.

 ఆ తర్వాత విజయవాడకు పరారీ

ఆ తర్వాత విజయవాడకు పరారీ

అభయ్‌ని కిడ్నాప్ చేసిన వ్యక్తులు సికింద్రాబాద్ ప్రాంతంలోనే ఉండి, హత్యానంతరం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి గౌతమీ ఎక్స్‌ప్రెస్‌లో కాకినాడ లేదా విజయవాడ పారిపోయి ఉంటారని పోలీసులు అనుమానించారు.

 ఇలా అట్టపెట్టెలో శవం

ఇలా అట్టపెట్టెలో శవం

కిడ్నాపైన అభయ్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో అల్ఫా హోటల్ వద్ద రాత్రి ఓ అట్టపెట్టలో శవమై కనిపించాడు. నోటికి, ముక్కుకు ప్లాస్టర్ వేయడంతో అభయ్ చనిపోయాడని, కిడ్నాప్ చేసిన అరగంటకే చంపేశారని అప్పటి హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు.

 అభయ్ కిడ్నాప్ జరిగిన రోజు

అభయ్ కిడ్నాప్ జరిగిన రోజు

అభయ్‌ను ఓ హోటల్ వద్ద నుంచి తీసుకు వెళ్లాడని తెలిపారు. మూడున్నర గంటల ప్రాంతంలో దారుసలేంలోని తన గదికి తీసుకు వెళ్లిన నిందితుడు, నిన్ను కిడ్నాప్ చేశామని అభయ్‌కు చెప్పాడు. దీంతో అతను అరిచాడు. వెంటనే వారు నోటికి, మూతికి ప్లాస్టర్ వేశారు. దీంతో, అభయ్ మృతి చెందాడని తెలిపారు. అభయ్ చనిపోవడంతో ఏం చేయాలో నిందితులకు పాలుపోలేదన్నారు. దీంతో ఇంటి యజమాని వద్ద ఉన్న ఓ బాక్సులో అభయ్ మృతదేహాన్ని పెట్టారు. అక్కడి నుంటి ఓ ట్రాలీ ఆటోలో ఆబిడ్స్ వచ్చారు.

 అక్కడ సెల్‌ఫోన్ కొని..

అక్కడ సెల్‌ఫోన్ కొని..

జగదీశ్ మార్కెట్లో ఓ సెల్ ఫోన్ కొని, దానితో అభయ్ తండ్రిని డబ్బుల కోసం బెదిరించాలని నిందితులు భావించారు. ట్రాలీని ఆబిడ్స్ వద్ద ఆపారు. అక్కడ ట్రాలీ ఆటో డ్రైవర్ ఆగకపోవడంతో మరో ఆటోలో అభయ్ మృతదేహాన్ని సికింద్రాబాద్ వద్దకు తీసుకు వెచ్చి, వదిలి పెట్టి వెళ్లిపోయారు. రాత్రి గం.7.32 నిమిషాలకు అభయ్‌ ఉన్న బాక్సును సికింద్రాబాద్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత రాత్రి తొమ్మిది గంటలకు అభయ్ తండ్రికి ఫోన్ చేసి డబ్బుల కోసం బెదిరించారు. ఆ తర్వాత మీడియాలో కథనాలు చూసి వారు పరారయ్యారని తెలిపారు.

English summary
Abhay kidnap and murder case has been solved by the Hyderabad police with cell phone locations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X