వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర, రాష్ట్రాల్లో అధికారం లేని కాంగ్రెస్, విజయం ఎలా సాధిస్తుంది...? కేటీఆర్

|
Google Oneindia TeluguNews

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ ఎలా విజయం సాధిస్తుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక మునిగిపోయో నావ అంటూ అభివర్ణించారు. అలాంటీ కాంగ్రెస్‌కు ప్రజులు ఎవరు ఒటు వేయరని అన్నారు. ప్రచారంలో భాగంగా కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన బీజేపీ, టీడీపీలను ప్రజలు పెద్దగా ఆదరించరని ఈ సంధర్భంగా చెప్పారు. హుజుర్‌నగర్‌లో టీఆర్ఎస్ గెలుపుపై ఆయన దీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తొలిసారి గులాబి జెండా ఎగరడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కేటీఆర్ బచ్చానా అయితే రాహుల్ ఏంటీ: ఉత్తమ్‌కు కర్నె, జీవన్‌రెడ్డి కౌంటర్కేటీఆర్ బచ్చానా అయితే రాహుల్ ఏంటీ: ఉత్తమ్‌కు కర్నె, జీవన్‌రెడ్డి కౌంటర్

మరోవైపు హుజుర్‌నగర్ అభివృద్దిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న వాదనను ఆయన కొట్టిపారేశారు. ఆయన అబద్దాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్ల లాంటి అన్ని ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రజలకు జరుగుతున్న సంక్షేమాన్ని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చూడడం లేదని విమర్శించారు.. ఈ నేపథ్యంలోనే గత అయిదు సంవత్సరాలుగా టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్దే టీఆర్ఎస్‌ను గెలిపిస్తుందని కేటీఆర్ అన్నారు.

How the Congress party win in Huzurnagar elections

ఉత్తమ్ తన నియోజకవర్గ అభివృద్దిపై ఏనాడు పట్టించుకోలేదని విమర్శించిన ఆయన కనీసం ఒక లేఖ కూడ రాయలేదని దుయ్యబట్టారు. దీంతో ఆయన చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోరని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కార్యకర్తలు రానున్న పదిహేను రోజుల పాటు విస్తృతంగా ప్రచారం చేయాలని కేటీఆర్ సూచించారు. దసరా పండగా తర్వాత రెండు రోజుల పాటు నియోజకవర్గంలో కేటీఆర్ ప్రచారం చేయనున్నట్టు తెలిపారు.

English summary
how the Congress party win in Huzurnagar elections without power in central and state governments, trs
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X