హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిల్‌సుఖ్ నగర్ పేలుళ్లు: పాక్‌లో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్న రియాజ్, ఐఎస్ఐ నుంచి డబ్బు

ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ పాకిస్తాన్‌లో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ పాకిస్తాన్‌లో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు. సమాచారం మేరకు.. రియాజ్ బత్కల్ కరాచీలోని ఓ గుర్తు తెలియని ప్రదేశంలోని భవనంలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ నీడన రాజభోగాలు అనుభవిస్తున్నాడు.

దిల్‌సుఖ్ నగర్ పేలుళ్లు చేసినందుకు కాను ఐఎస్ఐ అతనికి పెద్ద ఎత్తున డబ్బును ముట్టచెప్పినట్లుగా ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు.

సేల్స్‌బాయ్ నుంచి బాంబు మేకర్: పాక్‌కు వెళ్తూ భార్యకు కాల్.. ఇదీ యాసిన్ భత్కల్..సేల్స్‌బాయ్ నుంచి బాంబు మేకర్: పాక్‌కు వెళ్తూ భార్యకు కాల్.. ఇదీ యాసిన్ భత్కల్..

దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల ఛార్జీషీటులో రియాజ్ భత్కల్, అతని సోదరుడు ఇక్బాల్ భత్కల్‌లకు ఐఎస్ఐ ఆశ్రయం ఇస్తోందని తెలుస్తోంది. ఐఎస్ఐకి సహకరించేందుకు రియాజ్ ఒప్పుకోవడంతో ఇండియన్ ముజహిదీన్‌లో చీలిక వచ్చిందని అంటున్నారు.

riyaz bhatkal

దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కోసం హవాలా మార్గం ద్వారా ఒకేసారి రూ.1.25 లక్షలు, మరోసారి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వెస్ట్ టర్న్ యూనియన్ మనీ ట్రాన్సుఫర్ ద్వారా రూ.75వేలు యాసిన్ భత్కల్‌కు రియాజ్ పంపించాడు.

దిల్ సుఖ్ నగర్ పేలుళ్లకు ఒకరోజు ముందు వ్యూహం సఫలీకృతం కావాలని దేవుడిని ప్రార్థించాలని రియాజ్ భత్కల్.. యాసిన్‌ను కోరినట్లుగా తెలుస్తోంది. పేలుళ్లకు తొలుత పిక్రిక్ యాసిడ్‌ను ఉపయోగించాలని యాసిన్ భావించాడు. కానీ ఆ తర్వాత విరమించుకున్నాడు. పేలుళ్లలో 50 ఇంప్రోవైజ్‌డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజెస్‌లను ఉపయోగించాడు.

English summary
For long Indian agencies believed that the founder of the Indian Mujahideen, Riyaz Bhatkal lived in Sharjah. One evening when a group of officials from the Intelligence Bureau were working on some leads relating to the IM, an ID called menothing1 popped up. This was an ID that was created on the Nimbuzz messaging platform.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X