India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్ఎస్ నేతలు దోచుకున్నదంతా కక్కిస్తాం.!మోదీపై అనుచిత వ్యాఖ్యలు సహించమన్న డీకే అరుణ.!

|
Google Oneindia TeluguNews

పాలమూరు/హైదరాబాద్ : బీజేపి తెలంగాణ అద్యక్షుడు బండి సంజయ్ పాద యాత్ర సందర్బంగా అధికార టీఆర్ఎస్ నేతలు, కమలం నాయకులు మద్య మాటల తూటాలు పేలుతున్నాయి. పాదయాత్ర పట్ల గులాబీ నేతల విమర్శలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఘాటుగా సమాధానం ఇచ్చారు. పాలమూరులో బీజేపీకి వస్తున్న విశేష స్పందన, సభలకు వస్తున్న ప్రజలను చూశాక టీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకుందని, నోటికి దురద పెట్టినట్లు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని డికే అరుణ మండిపడ్డారు.

 తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రకు తాకట్టు పెట్టారు.. సీఎం మండిపడ్డ డీకే అరుణ

తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రకు తాకట్టు పెట్టారు.. సీఎం మండిపడ్డ డీకే అరుణ


టీఆర్ఎస్ సన్యాసులారా... 8 ఏళ్ల పాలనలో పాలమూరు ప్రజలకు చేసిందేమిటి? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు కట్టలేదు? ఆంధ్రా పాలకులకు అమ్ముడు పోయిన సన్యాసులు టీఆర్ఎస్ నేతలని డీకే అరుణ ధ్వజమెత్తారు. ఆంధ్రకు అమ్ముడుపోయి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని, ఈ సన్యాసులు తన గురించి, బండి సంజయ్ గురించి మాట్లాడే అర్హత ఉందా? అని సూటిగా ప్రశ్నించారు. గులాబీ నేతల అవినీతి, అక్రమాలను చూసి దేశం నేర్చుకోవాలా? సిగ్గుండాలని డీకె అరుణ మందలించారు.

 గులాబీ నేతలు దోచుకున్నదంతా కక్కిస్తాం.. టీఆర్ఎస్ నేతలు అవినీతి సామ్రాట్లన్న డీకే అరుణ

గులాబీ నేతలు దోచుకున్నదంతా కక్కిస్తాం.. టీఆర్ఎస్ నేతలు అవినీతి సామ్రాట్లన్న డీకే అరుణ


టీఆర్ఎస్ నాయకులు దోచుకున్న డబ్బునంతా బీజేపీ కక్కించి తీరుతదని, ఇసుక, మట్టి గుట్టలు, భూములన్నీ మాయం చేస్తున్న ఈ సన్యాసులా మాకు చెప్పేది? అని నిలదీసారు. జడ్చర్లలోని వెంకటేశ్వర స్వామికి చెందిన 120 ఎకరాల దేవాలయ భూములను కూడా కబ్జా చేసిన దుర్మార్గులు టీఆర్ఎస్ నేతలని, లంచం లేనిదే జడ్చర్లలో అనుమతులు ఇవ్వని దుర్మార్గులకు బీజేపీని విమర్శించే అర్హత లేదన్నారు డీకే అరుణ. ప్రధానమంత్రిపై అగౌరవంగా మాట్లాడే సన్యాసి చంద్రశేఖర్ రావు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నడని, చంద్రవేఖర్ రావు, టీఆర్ఎస్ అవినీతి సామ్రాట్లని ఆగ్రహం వ్యక్తం చేసారు డీకే అరుణ.

 మోదీ పాలనను జనం కీర్తిస్తున్నారు.. కళ్లుండి కూడా టీఆర్ఎస్ నేతలు చూడలేకపోతున్నారన్న ఫైర్ బ్రాండ్

మోదీ పాలనను జనం కీర్తిస్తున్నారు.. కళ్లుండి కూడా టీఆర్ఎస్ నేతలు చూడలేకపోతున్నారన్న ఫైర్ బ్రాండ్

దేశ రక్షణ కోసం, దేశ అభివ్రుద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్న మహనీయుడు మోదీ అని, బీజేపి పాలనను జనం కీర్తిస్తుంటే టీఆర్ఎస్ సన్యాసుల కడుపు మండి నోటికొచ్చిన కూతలు కూస్తున్నరని, టీఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ది ఉంటే, నిరుద్యోగ భ్రుతి ఇవ్వాలని, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని డీకే అరుణ డిమాండ్ చేసారు. అప్పటిదాకా మీకు ఓట్లడిగే అర్హత లేదని, ఎర్రటి ఎండలో బండి సంజయ్ పాదయాత్ర చేస్తుంటే జనం తరలివస్తూ తమ బాధలు చెప్పుకుంటుంటే, టీఆర్ఎస్ నేతలకు కడుపు మంట పుడుతోందని ధ్వజమెత్తారు డికే అరుణ.

 సంక్షేమ పథకాల అమలుకు మద్యం డబ్బులు.. మద్యాన్ని కేసీఆర్ ఏరులై పారిస్తున్నాడన్న డీకే అరుణ

సంక్షేమ పథకాల అమలుకు మద్యం డబ్బులు.. మద్యాన్ని కేసీఆర్ ఏరులై పారిస్తున్నాడన్న డీకే అరుణ


ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నచంద్రశేఖర్ రావు తాగుబోతుగా ఉంటూ అడ్డగోలుగా మద్యం షాపులు పెంచి 40 వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నడని, తెలంగాణలో ఇస్తున్న పెన్షన్లు, కళ్యాణలక్ష్మీ డబ్బు మద్యం ద్వారా వచ్చిన ఆదాయం నుండి ఖర్చు పెడుతున్నదే తప్ప చంద్రశేఖర్ రావు ఇంట్ల నుండి ఇస్తున్న సొమ్ము కాదని డీకే అరుణ ఆరోపించారు. బీజేపీ ఎక్కడుందని అడుగుతున్న టీఆర్ఎస్ నేతలకు ఇక్కడికొచ్చిన జనమే వచ్చే ఎన్నికల్లో సమధానం చెప్తారని డీకే అరుణ వ్యాఖ్యానించారు.

English summary
Official TRS leaders and Kamal leaders are exploding bullets of liquor during BJP Telangana president Bandi Sanjay Pada Yatra. BJP national vice-president DK Aruna responded sharply to the Rose leaders' criticism of the padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X