• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఘనంగా జరిగిన హైదరాబాద్ పబ్లిక్ స్కూలు బేగంపేట్ బోర్డింగ్ విద్యార్థుల రీయూనియన్

|

ఆనాటి జ్ఞాపకాలు.. విద్యార్ది దశలో చేసిన అల్లరి.. గురువులను ఆట పట్టించిన తీరు.. ఆ పూర్వ విద్యార్థులు నెమరువేసుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా రోజంతా గడిపారు. పదిహేడేళ్ళ వయసులో విడిపోయి కొన్ని దశాబ్దాల తర్వాత మళ్లీ కలుసుకున్న మిత్రులు, ఉపాధ్యాయులు పరస్పరం పలకరింపులతో అనందోత్సాహాలలో మునిగి పోయారు. ఒకరి యోగక్షేమాలు మరొకరు తెలుసుకొని సంబరపడ్డారు. తమ తోటి మిత్రుల ఉన్నతికి పులకించిపోయారు. ఇంతకీ ఈ విద్యార్థులు ఏ పాఠశాలకు చెందినవారనుకుంటున్నారా... నాటి నిజాం నవాబులు హైదరాబాద్‌ నడిబొడ్డున నిర్మించిన చారిత్రాత్మక పాఠశాల హైదరాబాద్ పబ్లిక్ స్కూలు బేగంపేట్‌ గూటి పక్షులు.

ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే...

ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే...

ప్రముఖ విద్యాసంస్థ హైదరాబాద్ పబ్లిక్ స్కూలు బేగంపేట్‌కు చెందిన పూర్వ హాస్టల్ విద్యార్థుల సమ్మేళనం హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేశ నలుమూలలనుంచే కాక ప్రపంచనలుమూలల నుంచి కూడా విద్యార్థులు తరలి వచ్చి ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఉన్నత స్థాయిలో నిలిపిన పాఠశాలను తలచుకుని పులకించిపోయారు. ప్రస్తుతం వీరంతా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వివిధ హోదాల్లో ఉన్నారు. బోర్డర్స్ రీయూనియన్‌కు రావడం చాలా సంతోషంగా ఉందంటూనే చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ఒకరినొకరు పలకరించుకుంటూ సీనియర్ జూనియర్లు ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ఆలింగనాలు, భావోద్వేగాలు, చదువులు, చదువుల తర్వాత ఉద్యోగం పొందేందుకు పడిన కష్టాలు, పెళ్లి, స్కూళ్లో చేసిన అల్లర్లు ఇలా జీవితంలోని ఎన్నో మధుర జ్ఞాపకాలకు నిలయంగా మారింది హైదరాబాద్ పబ్లిక్ స్కూలు బేగంపేట్ బోర్డర్స్ రీయూనియన్ 2018.

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశారు చదువులమ్మ చెట్టు నీడలో...

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశారు చదువులమ్మ చెట్టు నీడలో...

ఒకరినొకరు పలకరించుకుంటూ గతంలో వారు చేసిన చిలిపి చేష్టలను, అల్లర్లను గుర్తుకు తెచ్చుకుంటూ మధురానుభూతిని పొందారు. కొంతమంది విద్యార్థులు వారి ఎదుగుదలకు కాణమైన గురువులను గుర్తు చేసుకున్నారు. పంచుతూ పోతే తరిగేది ధనం పంచుతూ పోతే పెరిగేదే విద్య అని అలాంటి విద్యను ఎంతమందికి పంచితే అంత గొప్ప అని గురువులు చెప్పిన మాటలను గుర్తుచేశారు. కొంత మంది విద్యార్థులు ఒకరిని ఒకరు గుర్తు పట్టుకోలేక అలాగే ఉండిపోయి కొన్ని క్షణాల అనంతరం గుర్తుకు వచ్చిన తరువాత ఆలింగనం చేసుకొని సంతోషాన్ని పంచుకున్నారు. కుటుంబాల గురించి కష్ట నష్టాలు, సుఖ సంతోషాలు చర్చిచుకున్నారు. ప్రతి పూర్వ విద్యార్థి సమ్మేళనంలో తమ భావాలను వ్యక్తీకరించారు. అనంతరం విద్యను బోధించిన ఆనాటి గురువు జయానంద్‌ను ఘనంగా సన్మానించారు. ఒక స్కూలుకు సంబంధించి ఇంత పెద్ద స్థాయిలో హాస్టల్ విద్యార్థులు ఒకే తాటిపైకి రావడం రికార్డు అని కార్యనిర్వాహకులు తెలిపారు. ఇది ఎక్కడా జరిగి ఉండదని చెప్పారు. మొత్తం మూడు తరాలకు చెందిన పూర్వవిద్యార్థులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు.

ఆటల పోటీల్లో సత్తా చాటిన ఐదు పదుల వయసున్న సీనియర్లు

ఆటల పోటీల్లో సత్తా చాటిన ఐదు పదుల వయసున్న సీనియర్లు

ఇక ఈ రీయూనియన్‌కు 1985 పాస్ అవుట్ అయిన విద్యార్థుల నుంచి 2018 పాస్ అవుట్ అయిన విద్యార్థులంతా హాజరయ్యారు. ఇక 1985 పాస్ అవుట్ విద్యార్థులు ఇప్పటి 2018 పాస్ అవుట్ అయిన విద్యార్థులకు తండ్రులతో సమానంగా కనిపించారు. కానీ వారు మాత్రం వయస్సు మరిచి 2018 పాస్‌ ఔట్ బ్యాచ్ కుర్రాళ్లతో కలిసి మేమేమి తక్కువకాదంటూ వీరితో పోటీగా చిందేశారు. పండగ చేసుకున్నారు. ఇక రిసార్ట్‌కు శనివారం ఉదయమే ప్రపంచం దేశం నలుమూలల నుంచి విద్యార్థులు చేరుకున్నారు. ఉదయమంతా క్రీడాపోటీలు జరిగాయి. ఫుట్‌బాల్, వాలీబాల్, టగ్‌ఆఫ్ వార్ లాంటి క్రీడలు జరిగాయి. స్కూలు సమయంలో నాడు ఛాంపియన్లుగా నిలిచిన వారు మళ్లీ నేడు ఛాంపియన్లుగా అవతరించారు. వయస్సు మాత్రమే పెరిగింది...ఇంకా ఆనాటి రక్తంలో వేడి ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు.

హాస్టల్‌ను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

హాస్టల్‌ను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

ఇక ప్రపంచం దేశ వ్యాప్తంగా సెటిల్ అయిన విద్యార్థులను ఒక్క ప్రయత్నం ఒకే తాటిపైకి చేర్చింది. ఈ బృహత్తర కార్యక్రమానికి 1992 బ్యాచ్‌కు చెందిన రాజు దాట్ల అనే పూర్వ విద్యార్థి వాట్సాప్ ద్వారా పురుడు పోయగా... ఆ తర్వాత 1991 బ్యాచ్‌కు చెందిన వరప్రసాద్ అందరిని ఒకే వేదికపైకి తీసుకురావడంలో ముఖ్య భూమిక పోషించారు. ఆయనకు భగవంత్, శ్యామ్ అనే మరో ఇద్దరు పూర్వ విద్యార్థులు సహకరించారు. ఇక ఈ సమ్మేళనానికి హారజైన పూర్వ విద్యార్థుల్లో కేంద్ర రాష్ట్ర సర్వీసుల్లో పనిచేసే అధికారులు , ప్రముఖ వైద్యులు, రాజకీయ నాయకులు ఇలా అన్ని రంగాల నుంచి హాజరయ్యారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూలు బేగంపేట్‌లో హాస్టల్ ప్రస్తుతం తొలగించే ప్రయత్నం జరుగుతోందని... పన్నెండవ తరగతి వరకు హాస్టల్ వసతి పునరుద్ధరించేందుకు తామంతా కృషిచేస్తామని ఈ సందర్భంగా వారు ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వం కూడా ఇందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. చివరిగా మొమెంటోలు, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్‌ ప్రేమ విందుతో శనివారం కార్యక్రమం ముగిసింది.

English summary
The Hyderabad public school Begumpet boarders reunion took off in a grand way on saturday in a private resort. Aluminis from 1985 to 2018 batches were present for the event. Students wished each other and had a good time talking of their school days. Many prominent personalities from all fields attended the reunion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X