హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హెచ్చార్సీ అసంతృప్తి: గాంధీలో రోగుల పరిస్థితి ఇదీ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రిలో పరిస్థితులపై మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సి) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రోగులకు సరైన వసతులను కల్పించడం లోదని, వారికి అందించే వైద్యం, మందుల విషయంలో శ్రద్ధ చూపడం లేదని హెచార్సీ విమర్శించింది.

హెచ్‌ఆర్‌సీ కార్యదర్శి డి.సుబ్రమణ్యం నేతృత్వంలో ఓ బృందం శుక్రవారం గాంధీ ఆస్పత్రిని సందర్శించింది. ముందుగా ఓపీ విభాగానికి వెళ్లిన బృందం అక్కడ రోగులకు మందులను అందించే ఫార్మసీకి వెళ్లి ఏమి మందులు అందుబాటులో ఉన్నాయో పరీక్షించింది.

వివిధ వైద్య పరీక్షలకు సంబంధించి ఇచ్చే రిపోర్టుల కేంద్రాలను తనిఖీ చేసింది. అక్కడ బోడుప్పల్‌కు చెందిన సబిత చెవిపోటుకు సంబంధించిన రక్త పరీక్ష కోసం 11 తేదీన రక్తం ఇవ్వగా ఇప్పటికీ ఆమెకు సంబంధించిన రిపోర్టు ఇవ్వకపోవడంపై కమిషన్ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడి నుంచి ఏఎంసీ వార్డుకు వెళ్లి అక్కడి స్థితిగతులను పరిశీలించారు.

ప్రైవేట్ మందుల షాపు

ప్రైవేట్ మందుల షాపు

గాంధీ ఆస్పత్రిలోని అత్యవసర విభాగం ఎదురుగా ఉన్న ప్రైవేట్ మందుల షాపును హెచ్చార్సీ సభ్యులు పరిశీలించారు. పక్కనే ఉన్న రోగుల షెడ్డులో అనాథరోగుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

రోగులను పలకరించిన కక్రూ

రోగులను పలకరించిన కక్రూ

హెచ్‌ఆర్సీ చైర్మన్ నిస్సార్ అహ్మద్ కక్రూ సైతం ఆస్పత్రికి వచ్చారు. ఆయనతో కలిసిన బృందం మళ్లీ అనాథ రోగుల వద్దకు వెళ్లి పలకరించారు.

ఎమర్జెన్సీ విభాగం

ఎమర్జెన్సీ విభాగం

అనాథ రోగుల వద్ద నుండి ఎమర్జెన్సీ విభాగాన్ని సందర్శించి, సూపరింటెండెంట్ కార్యాలయంలో వైద్యశాల అధికారులతో చర్చించారు.

మీడియా సమావేశంలో

మీడియా సమావేశంలో

గాంధీ ఆస్పత్రిలోని పరిస్థితులను చూసిన తర్వాత మీడియా సమావేశంలో చైర్మన్ కక్రూ మాట్లాడారు. వైద్యశాలలో మందుల సరఫరా, వార్డుల్లోని పరిస్థితుల తీరుపై హెచ్‌ఆర్సీ ద్వారా ఒక నివేదికను, ఉత్తర మండలం డీసీపీ ద్వారా మరో నివేదికను తెప్పించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పా రు.

సుబ్రహ్మణ్యం ఇలా..

సుబ్రహ్మణ్యం ఇలా..

అంతకు ముందు హెచ్‌ఆర్సీ కార్యదర్శి సబ్రమణ్యం మాట్లాడుతూ దవాఖానలో మందులు ఇవ్వడం లేదని, వార్డులు, బాత్‌రూమ్‌లలో పరిస్థితి దా రుణంగా ఉందన్నారు.

తోడుంటేనే..

తోడుంటేనే..

అనాథ రోగులను తోడుంటేనే చేర్చుకుంటామనడం సరికాదని, మానవత దృక్పథంతో ఉండాలని వైద్యులకు సుబ్రహ్మణ్యం సూచించారు.

English summary
Along with a team Human rights commission chairman Kakroo visited Gandhu General hospital in Secunderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X