వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫోర్బ్స్ జాబితాలో హైదరాబాదీ: అందుకే గుర్తింపు

తెలుగు యువకుడి సత్తా అంతర్జాతీయంగా మరోసారి వెలుగు చూసింది. ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 ఆసియా జాబితాలో హైదరాబాద్‌కు చెందిన రోహిత్‌ పోతుకూచి చోటు దక్కించుకున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు యువకుడి సత్తా అంతర్జాతీయంగా మరోసారి వెలుగు చూసింది. ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 ఆసియా జాబితాలో హైదరాబాద్‌కు చెందిన రోహిత్‌ పోతుకూచి చోటు దక్కించుకున్నారు.

ప్రస్తుత ప్రపంచాన్ని ప్రభావితం చేసే యువ పారిశ్రామికవేత్తలు, సృజనశీలురు, నాయకులను ఫోర్బ్స్‌ ఈ జాబితాలో ఎంపిక చేస్తుంది. స్టాండర్డ్‌ ఇండియన్‌ లీగల్‌ సైటేషన్‌ (ఎస్‌ఐఎల్‌సీ)ను రోహిత్‌ స్థాపించారు.

Rohit Pothukuchi

న్యాయ విద్యకు సంబంధించి ఆయన రాసిన డాక్యుమెంటేషన్‌, రీసెర్చ్‌ను హార్వ్‌ర్డ్‌ లా స్కూల్‌ గుర్తించింది. అంతేకాదు దానిని దేశ వ్యాప్తంగా 300కు పైగా లా స్కూళ్లలో ఉపయోగిస్తుండటం గమనార్హం. రోహిత్‌ 2013లో హైదరాబాద్‌ నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించారు.

తెలుగువాడైన రోహిత్‌తో పాటు మరో యువకుడు భారత యువకుడు కూడా ఇందులో చోటు దక్కించుకున్నాడు. అతని పేరు హృషికేష్ దాతర్. ఇతను వకీల్ సెర్చ్ డాట్ కామ్ స్థాపించారు.

హృషికేష్ ఎన్ఎల్ఎస్ఐయూ బెంగళూరు గ్రాడ్యుయేట్. ఇతను వకీల్ సెర్చ్‌ను 2011లో స్థాపించారు. లీగల్ సర్వీస్ కామన్ మ్యాన్‌కు కూడా తక్కువ ఖర్చుతో అందాలని దీనిని స్థాపించారు.

English summary
Two Indians with a legal background have made it to the Forbes 30 under 30 Asia list for 2017. The list features Hrishikesh Datar, founder of vakilsearch.com, and Rohit Pothukuchi, founder of Standard Indian Legal Citation (SILC).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X