• search

వివాహేతర సంబంధం: జాతీయ క్రీడాకారిణి రుచికాకు భర్త వేధింపులు, మీడియా ముందు ఆవేదన

By Garrapalli Rajashekhar
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
      రుచికా జైన్‌ కు భర్త వేదింపులు ..పోలీసులకు ఫిర్యాదు

      హైదరాబాద్: సామాన్య మహిళలకే కాదు, ప్రముఖులైన మహిళలకు కూడా వేధింపులు తప్పడం లేదు. జాతీయస్థాయి క్రీడాకారిణి రుచికా జైన్‌ తన భర్త వేధింపులు భరించలేక మీడియా ముందుకు వచ్చారు.

      పెళ్లికి ముందే మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను మానసిక వేధింపులకు గురిచేస్తున్న భర్త అక్షయ్‌ కఠారియాను కఠినంగా శిక్షించాలని వెస్ట్‌మారేడుపల్లికి చెందిన జాతీయస్థాయి రోలర్‌ స్కేటింగ్‌ క్రీడాకారిణి రుచికా జైన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి ఆమె మీడియాతో మాట్లాడారు.

      మంచివాడని పెళ్లి చేసుకుంటే..

      మంచివాడని పెళ్లి చేసుకుంటే..

      పెద్దలు కుదిర్చిన సంబంధం, మంచి అబ్బాయి అని చెప్పడంతో అక్షయ్‌ కఠారియా(24)తో 2017 డిసెంబర్‌ 11న వివాహం జరిగిందని వివరించారు. ఇష్టానుసారంగా ఇంటికి వస్తుండటంతో అదేమని అడిగితే తన స్నేహితుల ఇళ్లకు వెళ్తున్నట్లు బుకాయించేవాడని తెలిపారు. అంతేగాక, తన పేరుతో సెల్‌ఫోన్‌లో ఓ అమ్మాయితో ఛాటింగ్‌ చేయడంతో వివాహేతర సంబంధం బయటపడిందని తెలిపారు.

       మోసం చేశాడు

      మోసం చేశాడు

      కుటుంబ సభ్యుల వత్తిడితో తనను వివాహం చేసుకొని మోసం చేశాడని, జూన్ 20న బేగంపేట మహిళా పీఎస్‌లో అక్షయ్‌కఠారియా, అతడి కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయగా కేసు నమోదైనట్లు తెలిపారు.

       కూతురిలా చూసుకున్నామంటూ రుచిక మామ

      కూతురిలా చూసుకున్నామంటూ రుచిక మామ

      కాగా, రుచికా జైన్‌ చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని, ఆమెను కూతురిలా చూసుకున్నామని ఆమె మామ సంజయ్‌ కఠారియా తెలిపారు. శుక్రవారం పీజీరోడ్డులో ఓ హోటల్‌లో మీడియాతో మాట్లాడారు.

       భర్త కూడా అదేమాట

      భర్త కూడా అదేమాట

      ఈ విషయాన్ని జైన్‌సమాజ్‌కు తీసుకెళ్లామని వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. భర్త అక్షయ్‌కఠారియా మాట్లాడుతూ.. తనకు ఇతరులతో సంబంధం ఉంటే రుచికను వివాహం చేసుకునేవాడినే కాదన్నారు. రుచిక ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు.

      English summary
      National skating champion Ruchika Jain on Friday approached the Begumpet women police and lodged a complaint of harassment and threats against her husband, Akshey Kataria.

      Oneindia బ్రేకింగ్ న్యూస్
      రోజంతా తాజా వార్తలను పొందండి

      X
      We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more