వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌న సంద్రంగా మారిన కొడంగ‌ల్..! టీఆర్ఎస్ గెలుపుకోసం కేసీఆర్ 100కోట్లు..! రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : ఎన్నిక‌ల కురుక్షేత్రంలో కొడంగల్ ర‌ణ రంగాన్ని త‌ల‌పిస్తోంది. కేసీఆర్ చెబుతున్న వంద సంఖ్య కౌరవులకు సంకేతమని కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఘాటుగా విమ‌ర్శిస్తున్నారు. కొడంగల్, ఐదు మండలాలు పంచపాండవులకు గుర్తు అని ఆయ‌న గుర్తు చేసారు. కొడంగ‌ల్ లో అశేష అభిమానుల మ‌ద్య రేవంత్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈ సంద‌ర్బంగా రేవంత్ రెడ్డి భావోద్యేగ ప్ర‌సంగం చేసారు. త‌న తుది స్వాస వరకు కొడంగల్ ప్రజలకు సేవచేస్తాన్నానరు. నామినేషన్ దాఖలు సందర్భంగా రేంత్ రెడ్డి కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి స్పూర్తి దాయ‌క ఉపన్యాసం చేసారు.

కొడంగల్ ఐదు మండలాలు పాండవులతో సమానం.! 100కోట్లతో కేసీఆర్ ప్ర‌యోగం అంటున్న రేవంత్..!!

కొడంగల్ ఐదు మండలాలు పాండవులతో సమానం.! 100కోట్లతో కేసీఆర్ ప్ర‌యోగం అంటున్న రేవంత్..!!

కేటీఆర్ ను సీఎం చేయడానికి కేసీఆర్ ఈ ఎన్నికలు తెచ్చార‌ని, కేసీఆర్ కేటీఆర్ ను సీఎం ను చేసేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసార‌ని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో మన కాంగ్రెస్.. మన సర్కార్ రాబోతుందని జోస్యం చేప్పారు. వచ్చే కాంగ్రెస్ సర్కార్ లో కొడంగల్ కీలక భూమిక ఉంటుందని స్పష్టం చేశారు. కేసీఆర్ ముఠాలతో కొడంగల్ లో విధ్వంసం చేయాలని చూస్తున్నారని, తాను హైటెన్షన్ వైర్ లాగా రక్షణ గా ఉంటాన్న‌న్నారు. అంతే కాకుండా మంత్రి హ‌రీష్ రావుకు ఘాటైన కౌంట‌ర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. హరీష్ త‌న‌ను ముట్టుకుంటే మాడి మసైపోతాడ‌ని హెచ్చరించారు.

కొడుకుని సీఎం చేసి కేసీఆర్ తుది శ్వాస విడుస్తారు..! కేసీఆర్ భ‌విష్య‌త్తు చెప్పిన రేవంత్..!!

కొడుకుని సీఎం చేసి కేసీఆర్ తుది శ్వాస విడుస్తారు..! కేసీఆర్ భ‌విష్య‌త్తు చెప్పిన రేవంత్..!!

ఎన్నిక‌లు ఎపుడూ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ఫ‌లితాల‌ను వెల్ల‌డిస్తుంటాయి. అయితే, ఆ ఫ‌లితాల‌ను శాసించే నేత‌లు అరుదుగా ఉంటారు. అలాంటి వ్య‌క్తి రేవంత్‌రెడ్డి. కేసీఆర్‌కు ఉద్య‌మం అండ ఉంది. తెలంగాణ సెంటిమెంట్ ఉంది. ఆరు వేల కోట్ల రూపాయ‌ల‌ను గ‌జ్వేల్‌కు త‌ర‌లించిన‌ట్టు తెలుస్తోంది. అయినా గెలుస్తాడో లేదో లేదో అనే అనుమానంతో అల్లుడు హ‌రీష్ తో రాత్రీప‌గ‌లు గ‌జ్వేల్ లో ప్ర‌చారం చేయిస్తున్నారు. ఇదంతా ఒకెత్తైతే కొడంగ‌ల్ లో మ‌రో ప్ర‌హ‌స‌నం మొద‌లైంది. రేవంత్ కు ఓట్లేసిన ప్ర‌జ‌ల‌ను అదికార పార్టీ టార్గెట్ చేసింది. ఎన్నిక‌ల ముందు వ‌చ్చి టీఆర్ఎస్ మ‌హామ‌హులు కొడంగ‌ల్ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేశారు. వంద కోట్లు అయినా ఖ‌ర్చుపెట్టి రేవంత్‌ను ఓడించేందుకు పావులు ర‌దుపుతున్నారు. .

అదికార పార్టీకి చుక్క‌లు చూపించిన రేవంత్..! పోటెత్తిన జ‌నం..!!

అదికార పార్టీకి చుక్క‌లు చూపించిన రేవంత్..! పోటెత్తిన జ‌నం..!!

తీరా చూస్తే కొడంగ‌ల్‌లో రేవంత్ నామినేష‌న్ వేసే సీన్‌ బాహుబ‌లి సినిమాను మ‌రిపించింది. 50 వేల పై చిలికు మంది హాజ‌రుగా కాగా కొడంగ‌ల్ ప‌ట్ట‌ణం స్తంభించి పోయింది. రేవంత్ కు మ‌ద్ద‌తు తెలిపే క్ర‌మంలో అబిమానులు రేవంత్ సీఎం సీఎం అంటూ చేసిన నినాదాల‌తో దిక్కులు పిక్క‌టిల్లాయి. నామినేష‌న్ వేయ‌డానికి యాభై వేల మంది రావ‌డంతో, అస‌లు రేవంత్ మెజారిటీ ఏ స్థాయిలో ఉంటుందో అనే ఊహే టీఆర్ఎస్ నేత‌ల‌కు నిద్ర ప‌ట్ట‌నివ్వ‌డం లేదనే చ‌ర్చ జ‌రుగుతోంది.

 నామినేష‌న్ లో స‌త్తా చాటిన రేవంత్ ఫౌజ్ స‌భ్యులు..! రేవంత్ కు అండ‌గా ఉంటామ‌న్న నిర్వ‌హకులు..!!

నామినేష‌న్ లో స‌త్తా చాటిన రేవంత్ ఫౌజ్ స‌భ్యులు..! రేవంత్ కు అండ‌గా ఉంటామ‌న్న నిర్వ‌హకులు..!!

రేవంత్ రెడ్డి నామినేష‌న్ సంద‌ర్బంగా రేవంత్ ఫౌజ్ స‌భ్యులు త‌మ మార్క్ చూపించారు. సుమారు వెయ్యి కి పైగా సభ్యులు రేవంత్ ఫౌజ్ పేరుతో ముద్రించిన టీష‌ర్ట్ ల‌ను ధ‌రించి. పొడ‌వైన కాంగ్రెస్ జెండాల‌ను ప‌ట్టుకుని రేవంత్ కాన్వాయ్ ముందు న‌డుస్తూ అంద‌రిని ఆక‌ర్షించారు. అంత‌కు ముందు రేవంత్ ఫౌజ్ కార్య‌క‌ర్త‌లు రేవంత్ పేరుమీద విడుదైల ఆడియో సీడి పాట‌ల‌ను కొడంగ‌ల్ లో రేవంత్ రెడ్డి అభిమానుల‌కు వినిపించారు. రేవంత్ రెడ్డి పాట‌ల ప‌టలు విన్న అభిమానులు ఉర్రూత‌లూగిపోయారు. రేవంత్ ఆశ‌యాల‌ను ముందుకు తీసుకువెళ్ల‌డ‌మే ల‌క్ష్యంగా రేవంత్ ఫౌజ్ ప‌ని చేస్తుంద‌ని ఫౌజ్ వ్య‌వ‌స్థాప‌క అద్య‌క్షుడు కౌష‌ల్ స‌మీర్, కార్య‌నిర్వ‌హ‌క అద్య‌క్షుడు ర‌వికుమార్ యాద‌వ్ తెల‌ప‌డం విశేషం..!

English summary
In Kodungal, Ravant Reddy nominated among huge number of fans. Revant Reddy made an emotional speech on this occasion. Kondangal would serve the people till his final breath. During the filing of nomination,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X