వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రగ్ కేసుపై దిగ్విజయ్ సంచలన ట్వీట్, వయసుకు తగ్గట్లు చేయాలని.. కేటీఆర్

డ్రగ్ ఇష్యూపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ గురువారం సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో సంచలన ఆరోపణ చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రగ్ ఇష్యూపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ గురువారం సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో సంచలన ఆరోపణ చేశారు.

డిగ్గీ షాకింగ్ కామెంట్లు

డిగ్గీ షాకింగ్ కామెంట్లు

డ్రగ్ కుంభకోణంలో టిఆర్ఎస్ వారసుల హస్తం ఉందని డిగ్గీ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో భారీ డ్రగ్ స్కాం జరిగిందని, అధికార పార్టీ వారసుల హస్తం ఉందని ట్వీట్ చేశారు. వారందరినీ విచారిస్తారో లేక రక్షిస్తారో చూడాలన్నారు.

కేటీఆర్ ఘాటు స్పందన

కేటీఆర్ ఘాటు స్పందన

దిగ్విజయ్ సింగ్ ట్వీట్ పైన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఘాటుగా స్పందించారు. డిగ్గీ పూర్తిగా గతి తప్పారన్నారు. ఆయన గౌరవప్రదంగా రిటైర్మెంట్ తీసుకుంటే మంచిదన్నారు.

Recommended Video

CM KCR Review Meeting On Tollywood Drug Scandal - Oneindia Telugu
వయసుకు తగ్గ పనులు చేయాలని..

వయసుకు తగ్గ పనులు చేయాలని..

దిగ్విజయ్ వయసుకు తగిన పనులు చేసుకుంటే మంచిదని కేటీఆర్ ట్విట్టర్లో సూచించారు. ఎట్టకేలకు 'తెలంగాణ' స్పెల్లింగ్ నేర్చుకున్నందుకు సంతోషమని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

డ్రగ్స్.. పొలిటికల్ టర్న్, ఇందులోను కేసీఆర్ టార్గెట్

డ్రగ్స్.. పొలిటికల్ టర్న్, ఇందులోను కేసీఆర్ టార్గెట్

ఇప్పటి వరకు డ్రగ్ రాకెట్ రాజకీయ మలుపు తీసుకోలేదు. కానీ డిగ్గీ ట్వీట్‌తో ఇది రాజకీయంగా కూడా దుమారం రేపేలా కనిపిస్తోంది. డ్రగ్ రాకెట్‌లో కేవలం సినిమా పరిశ్రమ వారినే టార్గెట్ చేస్తున్నారని, అధికార పార్టీ వారి హస్తం కూడా ఉందని, కానీ వారిని మాత్రం పక్కకు తప్పించారని డిగ్గీ ట్వీట్‌లోని అభిప్రాయంగా చెబుతున్నారు.

గతంలోను టార్గెట్...

గతంలోను టార్గెట్...

దిగ్విజయ్ సింగ్ గతంలోను తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై కూడా అప్పుడు కేటీఆర్ ధీటుగా స్పందించారు.

English summary
'Huge Drug Scam in Telangana. Influential friends of TRS heir apparent involved. Let's see if they would be saved or prosecuted. Let's see' Congress leader Digvijay Singh tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X