హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెస్ట్‌జోన్ పరిధిలో ఆ బడా వ్యాపారి ఎవరు..? రూ.5 కోట్ల నగదు స్వాధీనం కేసులో పోలీసుల ఎంక్వైరీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : భాగ్యనగరంలో హవాలా మనీ బుసలు కొడుతుంది. గుజరాత్‌కు చెందిన ముఠా హవాలా మనీని అందజేస్తోంది. తమ కమీషన్ తీసుకొని రూ.కోట్ల నగదు బదిలీ చేస్తోంది. తాజాగా రూ.5 కోట్లతో గుజరాత్‌కు చెందిన ముఠా పట్టుబడింది. భారీ నగదు పట్టుబడటంతో .. హవాలా నగదు ఎక్కడిదనే ప్రశ్న తలెత్తింది. ఇప్పటికే బడా వ్యాపారికి నగదు అందజేశారని .. మిగతా నగదు మరికొందరికీ ఇవ్వబోతుండగా పోలీసులు పట్టుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఎవరా బడా వ్యాపారి ? ఆయనకు గుజరాత్ కంపెనీతో ఉన్న సంబంధం ఏంటీ అనే అంశం చర్చానీయాంశమైంది.

రూ.5 కోట్ల హవాలా మనీ..

రూ.5 కోట్ల హవాలా మనీ..

హైదరాబాద్‌లో భారీగా హవాలా నగదు పట్టుబడింది. రూ. 5 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద కాపుకాసి గుజరాత్‌కు చెందిన ముఠా నుంచి నగదు రెండు కార్లు, హోండా యాక్టివాను స్వాధీనం చేసుకున్నారు. నగదుకు తీసుకెళ్లున్న గుజరాత్‌కు చెందిన
కమీషన్ తీసుకొని నగదును బదిలీ ప్రక్రియ కొనసాగించిన రితేశ్, అర్జున్, రాజేశ్, ఉపేందర్, శైలేష్, మితన్, చేతన్ అనే ఏడుగురిని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఉమేశ్ చంద్ర కంపెనీ..

ఉమేశ్ చంద్ర కంపెనీ..

గుజరాత్‌కు చెందిన ఉమేశ్ చంద్ర కంపెనీకి హవాలా నగదుతో సంబంధం ఉందని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మీడియాకు తెలిపారు. కంపెనీకి అహ్మదాబాద్, సూరత్, ముంబైకి బ్రాంచీలు ఉన్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో హవాలా నగదుకు సంబంధించి పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధకిషన్ రావు నేతృత్వంలో తమ టీం పట్టుకుందని వివరించారు. పట్టుబడిన రూ.5 కోట్ల నగదును ఆదాయపు పన్ను శాఖ విభాగానికి బదిలీ చేస్తామని పేర్కొన్నారు. పట్టుబడిన ఏడుగురిది గుజరాత్ స్వస్థలమని .. ఉమేశ్ చంద్ర కంపెనీతో సంబంధాలు ఉన్నాయని వివరించారు. హైదర్‌గూడలో స్థిర నివాసం ఏర్పారచుకొని ఉంటున్నారని పేర్కొన్నారు.

ఎవరా బడా వ్యాపారి

ఎవరా బడా వ్యాపారి

రూ.5 కోట్ల హవాలా నగదు వెస్ట్ జోన్ పరిధికి చెందిన ఓ బడా వ్యాపారిదని పోలీసులు చెప్తున్నారు. వీరు కమీషన్ తీసుకొని .. మిగతా వారికి అందజేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని తెలిపారు. ఆ వ్యాపారికి సంబంధించి విచారణ జరుగుతుందని .. ఎంక్వైరీ పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఆ వ్యాపారి సూచనలతోనే మిగతా వారికి డబ్బులు అందజేసేందుకు హవాలా ముఠా బయల్దేరిందని వివరించారు. తమకు అందిన సమాచారంతోనే వారిని పట్టుకున్నామని పేర్కొన్నారు.

English summary
Huge cash has been seized in Hyderabad. Rs.5 crore in cash was seized by the police. At the Jubilee Hills check post, recovered two cars and a Honda Activa from the Gujarat gang.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X