వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వం ఇచ్చిన 1500 నగదు కోసం బ్యాంకుల వద్ద భారీ క్యూ .. కామారెడ్డిలో మహిళ మృతి

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రబలుతున్న సమయంలో ఆర్ధిక భరోసా ఇస్తూ తెలంగాణా సర్కార్ తీసుకున్న నిర్ణయం మేరకు డబ్బు ఖాతాలో వెయ్యటంతో నిరుపేద లబ్దిదారులు బ్యాంకుల ముందు క్యూ కట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యంలో నిరుపేదలైన వారి కోసం తెలంగాణా ప్రభుత్వం ఉచిత రేషన్ ఇస్తామని, అలాగే 1500 రూపాయలు నగదు ఇస్తామని చేసిన ప్రకటన మేరకు ఆ నగదును బ్యాంకుల్లో జమ చేసింది.దీంతో బ్యాంకుల వద్ద ఆ నగదు కోసం జనాలు భారీగా క్యూ కట్టారు. ఇదే సమయంలో ఒక మహిళ మృతి చెందటం విషాదంగా మారింది.

వారికి సాయం చెయ్యండి.. మాజీమంత్రి కొల్లు రవీంద్ర, అనకాపల్లి ఎమ్మెల్సీ ఒకరోజు దీక్ష వారికి సాయం చెయ్యండి.. మాజీమంత్రి కొల్లు రవీంద్ర, అనకాపల్లి ఎమ్మెల్సీ ఒకరోజు దీక్ష

తక్కువ ఆదాయం గల తెల్ల రేషన్ కార్డు ఉన్నవారి బ్యాంకు ఖాతాల్లో రూ.1500 జమ చేసిన నేపధ్యంలో ఆ నగదు తీసుకోవటం కోసం ప్రజలు బ్యాంకులకు వెళ్తున్నారు. లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బంది పడకుండా ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసిన ప్రభుత్వం దానితో పాటు రేషన్ కార్డుపై రూ.1500 చొప్పున బ్యాంకుల్లో జమ చేసింది. ఆ డబ్బుల కోసం బ్యాంకు దగ్గరకు వెళ్లి క్యూ లైన్ లో నిలబడిన ఓ మహిళ ప్రాణం కోల్పోవటం విషాదంగా మారింది. కామారెడ్డి జిల్లా రామరెడ్డి మండల కేంద్రంలో జరిగిన ఈ సంఘటన స్థానిక ప్రజలకు ఆవేదన కలిగిస్తుంది .

Huge queue at banks for 1500 cash withdrawl .. Woman died in Kamareddy

ఇక అసలేం జరిగిందంటే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వద్ద ప్రభుత్వం అందిస్తున్న రూ. 15 వందలు తీసుకోవడానికి చాలా మంది లబ్దిదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో బ్యాంక్ దగ్గర భారీ క్యూ లైన్ పెరిగింది. అయితే కన్నపూర్ తండాకు చెందిన నేనావత్ కమల(45) అనే మహిళ కూడా క్యూలైన్‌లో నగదు విత్ డ్రా కోసం నిలబడింది . ఉదయం నుంచి డబ్బులు తీసుకోవడానికి క్యూలో నిలబడిన కమల హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందింది . ఒక్కసారిగా ఆమెకు గుండె పోటు రావటంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. కమల గుండెపోటు రావడంతో మృతిచెందినట్టు చెబుతున్నారు వైద్యులు. ఇక ఈ సంఘటనతో బ్యాంకు అధికారులు కూడా విచారం వ్యక్తం చేశారు . మరోవైపు, బ్యాంకు వద్ద ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. కమల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Recommended Video

RBI Governor Press Meet Highlights, RBI Cuts Reverse Repo Rate By 25 Bps to 3.75%

English summary
People are going to the banks for cash withdrawals of government financial support of Rs 1500. It was a tragedy for a woman who went to the bank for the money and stood in the queue. in Kamareddy district a women died due to heart stroke who is waiting to withdraw money from the bank .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X