హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మేయర్ పీఠం టీఆర్ఎస్‌దే: ట్విట్టర్‌లో చేతులు జోడించి కేటీఆర్ ధన్యవాదాలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్‌ ప్రభంజనం సృష్టించడంతో రాష్ట్ర ఐటీ, పంచాయితీ రాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందించారు. బల్దియా ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక మెజార్టీని కట్టబెట్టిన ఓటర్లకు సవినయంగా శిరస్సు వంచి నమస్కారిస్తున్నానని మంత్రి కేటీఆర్ తెలిపారు.

తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. దీంతో హైదరాబాద్ మహా నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్‌ను పచ్చదనం, పరిశుభ్రతతో పాటు సేఫ్, స్మార్ట్ సిటీగా చేద్దామన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పక నేరవేస్తున్నామని అన్నారు. ఈ విజయంతో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఒక తిరుగులేని శక్తిగా నిలబడిందన్నారు.

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ అత్యధిక సీట్లు సాధించి కొత్త చరిత్ర సృష్టించిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం హైదరాబాద్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి శ్రమించిన నేతలు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఈ గెలుపు మాపై మరింత బాధ్యత పెంచిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచార సారధిగా మంత్రి కేటీఆర్ అన్ని తానై నడిపించారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడంతో పార్టీ శ్రేణులు సంబరాలను చేసుకుంటున్నారు.

మరోవైపు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ తరపున అన్నీ తానై మంత్రులను, నేతలను, కార్యకర్తలను ఏకతాటిపై నడిపించి టీఆర్ఎస్ పార్టీకి విజయం సాధించిపెట్టిన మంత్రి కేటీఆర్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం దిశగా దూసుకుపోతుంది.

దీంతో మంత్రి కేటీఆర్‌కు పలువురు మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సందర్భంగా తెలంగాణభవన్‌కు వచ్చిన కేటీఆర్‌కు టీఆర్‌ఎస్ శ్రేణులు, వేల సంఖ్యలోకార్యకర్తలు చుట్టుముట్టి అభినందనలు తెలుపుతూ కనిపించారు. జైతెలంగాణ, జై కేటీఆర్ నినాదాలతో తెలంగాణభవన్ మార్మోగిపోయింది.

English summary
Humbled &deeply grateful for your tremendous vote of confidence says KTR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X