నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిజామాబాద్ లో రికార్డ్ స్థాయిలో నామినేషన్లు...ఇది ప్రభుత్వంతో రైతన్నల వార్

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి రికార్డు స్థాయిలో నామినేషన్స్ దాఖలయ్యాయి. చివరి రోజు అయిన నిన్న ఒక్క రోజే 182 మంది నామినేషన్ పత్రాలు దాఖలు చేసారు. మొత్తంగా 245 నామినేషన్లు దాఖలయ్యాయి. రైతులు అధిక సంఖ్యలో నామినేషన్లు సమర్పించారు. నేటి నుండి నామినేషన్ ల పరిశీలన, 28న ఉప సంహరణ అనంతరం ఎంత మంది బరిలో ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది ..

రాష్ట్రంలోనే నామినేషన్లలో టాప్ ... పోటాపోటీగా రైతుల నామినేషన్లు

రాష్ట్రంలోనే నామినేషన్లలో టాప్ ... పోటాపోటీగా రైతుల నామినేషన్లు

నిజామాబాద్ పార్లమెంటూ స్థానికి గతంలో ఎన్నాడు లేని విధంగా అత్యధికంగా నామినేషన్లు వేసారు. నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంటు పరిదిలోని రైతులు ఉదయం నుండే నిజామాబాద్ కలెక్టారేట్ కి తరలివచ్చారు. వందల సంఖ్యలో వచ్చిన రైతులు పోటాపోటీగా నామినేషన్లు వేసారు. 3 గంటల వరకే సమయం ఉండటంతో 3 గంటల లోపే వారంతా టొకెన్లూ తీసుకుని లోపలికి వెళ్ళారు. ఒక్క రోజే 182 మంది తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేసారు.

మొత్తం నిజామా బాద్ లోక్ సభ నామినేషన్లు 245

మొత్తం నిజామా బాద్ లోక్ సభ నామినేషన్లు 245

కాంగ్రేస్ , బిజేపి అభ్యర్థులు మధుయాష్కి, అరవింద్ లు తమ తమ పార్టి నేతలతో కలిసి నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా, తెరాస అభ్యర్థి కవిత తరపున ఆ పార్టి నేతలు నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఇవి కాక మిగితావన్నీ రైతుల నామినేషన్లు కావటం గమనార్హం. శనివారం వరకు 63 నామినేషన్లు రాగా, చివరి రోజు 182 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో సెగ్మెంట్ పరిదిలో మొత్తం 245 నామినేషన్లు దాఖలయ్యాయి.

బ్యాలెట్ వార్ కు బారులు తీరిన రైతులు ... నిజామాబాద్ లో ఉత్కంఠ పోరుబ్యాలెట్ వార్ కు బారులు తీరిన రైతులు ... నిజామాబాద్ లో ఉత్కంఠ పోరు

రైతులు నామినేషన్లు వెయ్యటంతో అధికార పార్టీలో గుబులు

రైతులు నామినేషన్లు వెయ్యటంతో అధికార పార్టీలో గుబులు

నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిదిలోని జగిత్యాల, కోరుట్ల, బాల్కొండ, ఆర్మూర్ నియోజక వర్గాల రైతులు ఎక్కువ మొత్తంలో నామినేషన్లు దాఖలు చేసారు. వీరికి సంఘీభావంగా ఆయా ప్రాంతాల నాయకులు కూడా తరలివచ్చారు. మాజి ఎంపి కవిత గత 5 ఏళ్ళుగా రైతుల సమస్యలు పరిష్కరించటంలో విఫలమయ్యారని, పసుపు బోర్డు ఏర్పాటులో నిర్లక్ష్యం వహించారని రైతులు ఆరోపించారు. ఈ ఎన్నికల్లో తెరాసకి ప్రజలు గట్టీ గుణ పాఠం చెప్పనున్నారని బిజేపి అభ్యర్థి అరవింద్ అన్నారు. గత 5 ఏళ్ళలో ఎంపిగా కవిత జిల్లాకి చేసిందేమి లేదన్నారు కాంగ్రేస్ అభ్యర్థి మధుయాష్కి. మొత్తం మీద భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావటాంతో అధికార పార్టిలో గుబులు మొదలైంది.

బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహిస్తే గుర్తులు వెతుక్కోవటం కష్టం

బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహిస్తే గుర్తులు వెతుక్కోవటం కష్టం

రైతులు నామినేషన్లు ఉపసంహరించుకోకుంటే బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు జరుగుతాయి. ఇదే జరిగితే ప్రధాన పార్టీల అభ్యర్థుల గుర్తులు వెతుక్కోవాల్సి వస్తుందనే టెన్షన్ మొదలైనది.ఏది ఏమైనా నిజామాబాద్ రైతులు అనుకున్న పని చేశారు . వందల సంఖ్యలో తమ నామినేషన్లు వేసి తమ డిమాండ్ల సాధనకై నడుం బిగించారు.దీంతో కవిత కు నిజామాబాద్ వార్ అంతా ఈజీ కాదని తేలిపోయింది.

English summary
Ruling TRS nominee and Chief Minister K Chandrasekhar Rao's daughter K Kavitha is among the contestants in the Nizamabad constituency where the farmers have entered the poll fray in large numbers to highlight their plight.Nearly 750 nominations have been filed for the April 11 Lok Sabha elections in Telangana with Nizambad constituency alone accounting for around one-third of them as the process for filing of papers came to a close Monday.Over 200 tumeric and 'jowar' (sorghum) farmers filed their nominations in Nizamabad protesting the "failure" of the Centre and the state government to ensure remunerative prices for their produce, taking the total number of candidates in the constituency to 245.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X