• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆదిలోనే హంసపాదు..! స్టాలిన్ తో కేసీఆర్ భేటీ ఉండదు..!!

|

చెన్నై/హైదరాబాద్ : ఈనెల 13న సీఎం చంద్రశేఖర్ రావు, డీఎంకే అధినేత స్టాలిన్‌ భేటీ జరగడం లేదు. నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఈనెల 19న ఉప ఎన్నికలు జరగనున్నాయని, వాటి ప్రచారంలో స్టాలిన్‌ బిజీ గా ఉన్నారని డీఎంకే వర్గాలు తెలిపాయి. అందుకే, చంద్రశేఖర్ రావు ను స్టాలిన్‌ కలవడం లేదని స్పష్టం చేసారు. ప్రస్తుతం డీఎంకే, కాంగ్రెస్‌ కూటమి కొనసాగుతున్న నేపథ్యంలో, ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరిట మూడో కూటమి అవసరం లేదని స్టాలిన్‌ భావిస్తున్నారని తెలిపాయి. నిజానికి, బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు చంద్రశేఖర్ రావు పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గత ఏప్రిల్‌లో ఆయన చెన్నై వెళ్లి స్టాలిన్‌తో చర్చలు జరిపారు కూడా. అనంతరం, ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో స్టాలిన్‌ కాంగ్రె్‌సతో పొత్తు పెట్టుకున్నారు. కూటమి తరఫున కాబోయే ప్రధాన మంత్రి రాహుల్‌ గాంధీయేనని బహిరంగ సభలో ప్రకటించారు.

 సమావేశానికి డీఎంకే అధినేత విముఖత..! కాంగ్రె్‌సతో డీఎంకే సంత్సంబంధాలే కారణమా..!!

సమావేశానికి డీఎంకే అధినేత విముఖత..! కాంగ్రె్‌సతో డీఎంకే సంత్సంబంధాలే కారణమా..!!

ఇదిలా ఉండగా రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా తొలుత ప్రకటించింది కూడా స్టాలినే. ఫలితాల తర్వాత బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని, కాంగ్రె్‌సతో కూటమి కొనసాగుతుందని గతంలోనే తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే, కాంగ్రెస్‌ రహిత కూటమికి కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ప్రకటించడం సమంజసంగా ఉండదని స్టాలిన్‌ భావిస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అందుకే, కేసీఆర్‌తో భేటీకి నిరాకరించారని వివరించాయి. లోక్‌సభ ఫలితాల తర్వాత కూడా తాము కాంగ్రె్‌సతోనే కలిసి నడుస్తామని ఆయన సంకేతాలు ఇచ్చారని వివరించాయి.

 భిన్న స్వరాలు..! ఈసారి యునైటెడ్‌ ఫ్రంట్‌ తరహా ప్రభుత్వమంటున్న గులాబీ ఎంపి..!!

భిన్న స్వరాలు..! ఈసారి యునైటెడ్‌ ఫ్రంట్‌ తరహా ప్రభుత్వమంటున్న గులాబీ ఎంపి..!!

కాంగ్రెస్‌, బీజేపీయేతర పార్టీలతో ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం చంద్రశేఖర్ రావు చెబుతున్నారు. కానీ, ఈసారి ‘యునైటెడ్‌ ఫ్రంట్‌' తరహా ప్రభుత్వం ఏర్పడుతుందని కేసీఆర్‌ సన్నిహితుడు, టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ బయటి నుంచి మద్దతు ఇస్తే.. ప్రాంతీయ పార్టీలన్నీ కలిపి గతంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అటువంటి సంకీర్ణమే ఏర్పడుతుంది. ఇందులో సందేహం అక్కర్లేదు అని మంగళవారం పీటీఐతో మాట్లాడుతూ వినోద్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు.

 కేసీఆర్‌తో భేటీకి స్టాలిన్‌ నిరాకరణ..! ప్రాధాన్యత సంతరించుకున్న వినోద్ వ్యాఖ్యలు..!!

కేసీఆర్‌తో భేటీకి స్టాలిన్‌ నిరాకరణ..! ప్రాధాన్యత సంతరించుకున్న వినోద్ వ్యాఖ్యలు..!!

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ వంద మార్కు దాటుతుందని, 120-130 సీట్లు సాధించడం ఆ పార్టీకి కష్టమేనని అభిప్రాయపడ్డారు. ఇక, బీజేపీ 170 సీట్లను దాటదని విశ్లేషించారు. ఈ నేపథ్యంలోనే, 1996లో ఎన్నికల తర్వాత యునైటెడ్‌ ఫ్రంట్‌ భావన వచ్చిందని, ఈసారి ఫలితాలకు ముందే దానిపై చర్చ జరుగుతోందని తెలిపారు. కాంగ్రెస్‌ బయటి నుంచి మద్దతు ఇస్తే యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఒక్కటే తనకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌తో భేటీకి స్టాలిన్‌ నిరాకరించిన తర్వాత వినోద్‌ కుమార్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

 స్టాలిన్‌, కేసీఆర్‌ భేటీ ఖరారు కాలేదు..! మరో స్వరం వినిపిస్తున్న కవిత..!!

స్టాలిన్‌, కేసీఆర్‌ భేటీ ఖరారు కాలేదు..! మరో స్వరం వినిపిస్తున్న కవిత..!!

డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ ఖరారు కాలేదని నిజామాబాద్‌ ఎంపీ కవిత స్పష్టం చేశారు. వారి భేటీకి సంబంధించిన అపాయింట్‌మెంట్‌ ఖరారు కాలేదని ఏఎన్‌ఐ వార్తా సంస్థకు మంగళవారం తెలిపారు. ఈ విషయాన్ని ఏఎన్‌ఐ తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పేర్కొంది. కాగా, ఈనెల 12నే వారిద్దరూ భేటీ అయ్యే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
CM Chandrashekhar Rao on the 13th of this month, DMK chief Stalin will be not meeting. DMK sources said the four assembly seats are likely to be held on 19th of this month and Stalin is busy in their campaign. That is why Chandrashekhar Rao is not clear that Stalin does not meet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more