ప్రియుడితో భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్న భర్త, రెచ్చిన ప్రియుడు, భార్య ఇలా....

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్యను ప్రియుడితో కలిసి ఉన్న సమయంలో భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నాడు.అయితే భార్య ప్రియుడు భర్తపై దాడి చేసి పారిపోయాడు. ఇంట్లోని సామాగ్రిని ధ్వంసం చేశారు. ఈ ఘటన హైద్రాబాద్ లోని ఎల్ బి నగర్ లో చోటుచేసుకొంది.

ఎల్ బి నగర్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఉద్యోగి భార్య, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు.అయితే వారింటికి సమీపంలోనే ఉంటున్న వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకొంది. విషయం తెలుసుకొన్న భర్త వారిద్దరిని మందలించాడు.

Husband attacked by wife's lover in Hyderabad

అయినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు.అంతేకాదు తన భర్త తనను అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నాడని భార్య సరూర్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.అయితే దీనికి ప్రియుడే కారణమని భర్త ఆరోపించాడు. ఈ విషయమై భార్య, భర్తలకు మహిళా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.

దీంతో ఎల్ బి నగర్ నుండి వారు ఇల్లును మార్చారు.అయినా వారిద్దరి ప్రవర్తనలో మార్పురాలేదు. ప్రియుడు ఆమె వద్దకు వెళ్తూనే ఉన్నాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన భర్త సోమవారం నాడు పథకం ప్రకారం వ్యవహరించాడు. ప్రియుడితో భార్య కలిసి ఉండగా వారిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నాడు.

ఈ విషయాన్ని భర్త ...ఆమె సోదరుడికి సమాచారం ఇచ్చాడు. అయితే అతను తన ఇద్దరు స్నేహితులతో అక్కడికి వచ్చాడు. మరో వైపు ప్రియుడు కూడ తన స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. ఈ సమాచారం అందుకొన్న ప్రియుడి స్నేహితులు కూడ అక్కడికి చేరుకొన్నారు.

ప్రియుడు స్నేహితులు ఇంట్లోకి చొరబడి సామాగ్రిని ధ్వంసం చేశారు. ప్రియుడు ప్రియురాలి భర్తను రోకలిబండతో తలపై కొట్టాడు. ప్రియురాలి సోదరుడు ఆయన స్నేహితులపై కూడ ప్రియురాలి స్నేహితులు దాడి చేసి పారిపోయారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలోనే ప్రియురాలు అక్కడి నుండి పారిపోయింది.

బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Husband attacked by wife's lover in Hyderabad. A lady extra marital affair with another man. Husband caught when his wife with lover on Monday.Husband attacked by wife's lover
Please Wait while comments are loading...