• search
  • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ప్రైవేట్ ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో లీక్ చేస్తా... భార్యకు భర్త బెదిరింపులు...

|

ప్రేమ వివాహం చేసుకున్న ఓ మహిళకు పెళ్లయిన కొన్నాళ్లకే అత్తమామల నుంచి అదనపు కట్నం వేధింపులు మొదలయ్యాయి. దానికి తోడు పిల్లలు కావట్లేదని భర్త నిత్యం వేధించడం మొదలుపెట్టాడు. ఆమె ప్రైవేట్ ఫోటోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తానని బెదిరింపులకు దిగాడు. అటు అత్తమామలు,ఇటు భర్త వేధింపులు రోజురోజుకు ఎక్కువవుతుండటంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.

Rashmi gautham: మోడరన్ డ్రెస్ లోనే కాదు, చీరలో కూడా అందాలు ఆరబోస్తున్న జబర్దస్త్ బ్యూటీ (ఫొటోస్)

వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్‌కి చెందిన ఓ మహిళ(24)కు 2016లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తున్నప్పుడు మహమ్మద్ ఫర్హాన్(26) అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా మారింది. కోర్సు పూర్తయ్యాక ప్రేమ విషయాన్ని ఇద్దరు తమ పెద్దవాళ్లకు చెప్పారు. ఇరువురు అంగీకరించడంతో 2017లో వీరి వివాహం జరిగింది. పెళ్లి సమయంలో మహిళ తండ్రి దాదాపు రూ.1కోటిన్నర విలువైన బంగారు,వజ్రాభరణాలు కట్నంగా ఇచ్చారు.మరో రూ.1కోటిన్నర ఖర్చు చేసి పెళ్లి ఘనంగా నిర్వహించాడు.

husband harassing and threatening to leak wife private photos and videos on social media

పెళ్లి తర్వాత ఆ నగలన్నింటినీ భద్రతా పరుస్తానని చెప్పి ఆమె అత్త అయేషా ఒస్మాన్ తీసుకున్నారు. కానీ ఆ తర్వాత ఎప్పుడు అడిగినా నగలు ఇచ్చేవారు కాదు. శుభకార్యాలకు వెళ్లేటప్పుడు పెట్టుకుంటానని చెప్పినా ఎప్పుడూ ఇవ్వలేదు. ఇదే క్రమంలో అదనపు కట్నం కోసం ఆమెను వేధించడం మొదలుపెట్టారు. మరోవైపు పెళ్లయినా నాలుగేళ్లయినా పిల్లలు లేరంటూ భర్త వేధింపులు ఎక్కువయ్యాయి. ఆమె ప్రైవేట్ ఫోటోలు,వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తానని అతను బెదిరించడం మొదలుపెట్టాడు.దీంతో వేధింపులు తట్టుకోలేకపోయిన మహిళ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మెట్‌పల్లిలో వివాహిత ఆత్మహత్య :

అత్తింటి వేధింపులకు తాళలేక మెట్‌పల్లిలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మెట్‌పల్లి సాయిరాం కాలనీకి చెందిన రమ్య(20)కు అదే కాలనీకి చెందిన దొమ్మాటి నరేందర్‌తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. కొంతకాలం కాపురం సాఫీగానే సాగినప్పటికీ... ఆ తర్వాత నరేందర్, అతని తల్లి జమునలు ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించారు.
దీంతో జీవితంపై విరక్తి చెందిన రమ్య... గత నెల 31న ఇంట్లో ఎలుకల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబసభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గురువారం నిజామాబాద్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

English summary
Additional dowry harassment from in-laws started shortly after marriage to a woman, in addition, the husband began to harass her for not having children. He threatened to leak her private photos on social media. The woman approached the police as the harassment of her in-laws and husband was increasing day by day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X