వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషాదం: రోడ్డు ప్రమాదంలో భర్త, శిశువుకు జన్మనిచ్చి ప్రాణాలొదిలిన భార్య

భర్త ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో అతని మృతదేహాన్ని చూసిన నిండు గర్భిణి అయిన అతని భార్య తట్టుకోలేకపోయింది. కన్నీరుమున్నీరుగా విలపించి అక్కడే కుప్పకూలిపోయింది.

|
Google Oneindia TeluguNews

నల్గొండ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. భర్త ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో అతని మృతదేహాన్ని చూసిన నిండు గర్భిణి అయిన అతని భార్య తట్టుకోలేకపోయింది. కన్నీరుమున్నీరుగా విలపించి అక్కడే కుప్పకూలిపోయింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. మంగ బిడ్డకు జన్మనిచ్చి ఆమె ప్రాణాలు వదిలింది.

48గంటల్లోనే భార్యాభర్తలు మృతిచెందడంతో వారి కుటుంబాల్లో పెను విషాదం నెలకొంది. ఈ హృదయవిదారక ఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం మొగులాయికోట గ్రామంలో చోటు చేసుకుంది.

dead

ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన సోమ సురేశ్‌(28) 2011లో పోలీసు కానిస్టేబుల్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టాడు. విజయవాడకు చెందిన హేమలతతో అతనికి 2014లో వివాహం జరిగింది. వీరికి తపస్విని అనే కూతురు ఉంది. హేమలత మళ్లీ గర్భం దాల్చడంతో ప్రసవం కోసం నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది.

<strong>కల్వర్టులో పడిపోయిన దివాకర్ ట్రావెల్స్ బస్సు: 11మంది మృతి, 20మందికి గాయాలు</strong>కల్వర్టులో పడిపోయిన దివాకర్ ట్రావెల్స్ బస్సు: 11మంది మృతి, 20మందికి గాయాలు

ఈ క్రమంలో నల్లగొండలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హేమలత భర్త సురేశ్‌ మృతిచెందాడు. హేమలత నిండు గర్భిణి కావడంతో భర్త మరణవార్తను ఆమెకు చెప్పకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్తపడ్డారు.

చివరి నిమిషంలో అతని అంత్యక్రియల కోసం తీసుకరావడంతో ఆమె భర్త మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయింది. విజయవాడలోని ఆస్పత్రికి తరలించగా మంగళవారం ఉదయం మగ బిడ్డకు జన్మనిచ్చి మృతి చెందింది. భార్యాభర్తల మృతితో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు.

English summary
Husband killed in a road accident in Suryapet, after that his wife died in hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X