అనుమానంతో భార్యను చంపి, కత్తితో పొడుచుకున్న భర్త

భార్యను చంపి, కత్తితో పొడుచుకున్న భర్త బాబోయ్ వీడియో ఘోరం | Oneindia Telugu
కరీంనగర్: చిన్న వివాదం పచ్చని కుటుంబం లో మంటలు రేపింది. అనుమానం పెను భూతంగా మారి దారుణ హత్య లకు దారి తీసింది.

జగిత్యాల జిల్లా నర్సింగపూర్ గ్రామానికి చెందిన పోచంపల్లి రవి, భార్య అంజలి, తన ఇద్దరు కుమారులు, కూతురును తీసుకొని అత్తగారింటికి వేములవాడకు ఆటోలో బయలుదేరారు.

మార్గమధ్యంలో గొడవ ముదరడంతో భార్యను కత్తితో గొంతు కోసి వేయడంతో అక్కడికక్కడే భార్య వసంత (35) మృతి చెందింది.

తాను కూడా కత్తితో పొడుచుకుని పడిపోవడంతో హాస్పిటల్ కు తరలిస్తుండగా చనిపోయాడు.సిరిసిల్లా రాజన్న జిల్లా లో మంగళవారం జరిగిన ఈ సంఘటన సంచలనం రేకెత్తించింది.