హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హత్య కేసును ఛేదించిన రాచకొండ పోలీసులు, వివాహేతర సంబంధమే కారణం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గత నెల 29వ తేదీన హత్య కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు అయిదుగురు నిందితులను అరెస్టు చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉర్వకొండ మండలం రచలాపల్లికి చెందిన శ్రీధర్ రెడ్డి తన కుటుంబంతో కలిసి 2014లో కల్వకుర్తికి వచ్చాడు. తిమ్మరాసిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్‌కు శ్రీధర్ రెడ్డి భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది.

శ్రీధర్ రెడ్డికి భార్య పైన అనుమానం వచ్చింది. దీంతో అక్కడి నుంచి సొంతూరుకు వెళ్లాడు. శ్రీనివాస్ గౌడ్ ఆమె కోసం అక్కడకు కూడా వెళ్లేవాడు. ఆమెతో దిగిన ఫోటోలను అతను శ్రీధర్ రెడ్డికి వేర్వేరు ఫోన్ నెంబర్ల ద్వారా పంపించేవాడు. దీనిపై శ్రీధర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు చేశారు. భార్య నుంచి విడాకులు కూడా కోరాడు శ్రీధర్ రెడ్డి. కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

శ్రీధర్ రెడ్డి మానసిక వేధన

శ్రీధర్ రెడ్డి మానసిక వేధన

ఇదిలా ఉండగా శ్రీనివాస్ గౌడ్ తన కుటుంబానికి నష్టం చేశాడని భావించిన శ్రీధర్ రెడ్డి తీవ్రమానసిక వేధనకు లోనయ్యాడు. అతనిని ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాచు. తన పొలంలోపని చేస్తున్న నల్లంగి శ్రీనివాస్, లాలూ నాయక్, రచనాపల్లికి చెందిన లక్ష్మణ్, వెంకటాపురానికి చెందిన శ్రీనివాస్ రెడ్డితో కలిసి హత్యకు ప్లాన్ చేశాడు.

బెయిల్ పైన విడుదలయ్యాక బడంగ్‌పేటలో

బెయిల్ పైన విడుదలయ్యాక బడంగ్‌పేటలో

శ్రీనివాస్ గౌడ్ బెయిల్ పైన విడుదలైన తర్వాత బడంగ్‌పేటలోని తన అన్న కొడుకు వద్ద ఉంటున్నాడు. ఈ విషయం శ్రీధర్ రెడ్డికి తెలిసింది. అదే భవనంలో శ్రీధర్ రెడ్డి ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. పెంట్ హౌస్‌లో ఉంటున్నాడు. తన వారిని ఇద్దరిని అందులో ఉంచాడు. శ్రీనివాస్ గౌడ్ కదలికలను ఎప్పటికి అప్పుడు వారు శ్రీధర్ రెడ్డికి అందించారు.

భార్య వస్తే ఇద్దరి హత్యకు ప్లాన్

భార్య వస్తే ఇద్దరి హత్యకు ప్లాన్

శ్రీనివాస్ గౌడ్ వద్దకు శ్రీధర్ రెడ్డి భార్య వస్తే ఒకేసారి ఇద్దరిని హత్య చేయాలని ప్లాన్ చేశారు. కానీ అది కుదరలేదు. గత నెల 29న ద్విచక్ర వాహనం పైన శ్రీనివాస్ గౌడ్ వెళ్తున్నాడు. అతని బైక్‌ను కారుతో ఢీకొట్టారు. కొడవళ్లతో అతనిని హత్య చేశారు.

 నిందితుల అరెస్ట్

నిందితుల అరెస్ట్

హత్య అనంతరం నిందితులు కలిసి చంపాపేటలో ఉన్న శ్రీధర్ రెడ్డిని కలిసి సెల్‌ఫోన్లను అక్కడ పడేసి పరారయ్యారు. ఈ హత్య కేసును పోలీసులు తాజాగా ఛేదించారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎస్‌ఓటీ పోలీసులు సోమవారం మీర్‌పేట పోలీసుల సహకారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

English summary
Husband kills wife lover in Mahaboonagar district. Police arrested five people in this case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X