వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్ లో భార్యను ఇంట్లో పెట్టి ఎనిమిది నెలల క్రితం బయటకు వెళ్లాడో భర్త.

|
Google Oneindia TeluguNews

ఏమయ్యాడో తెలియక అందరికీ అయోమయం. అంతలోపే ఇంట్లో ఉన్న భార్యకు కిటికీల ద్వారా బయటివారు భోజనం అందిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం ఆనోటా, ఈ నోటా పొక్కడంతో అధికారులు అక్కడికి చేరుకుని భార్యను వృద్ధాశ్రమానికి తరలించారు. భర్త కోసం వెతకడం ప్రారంభించారు. చివరికి ఏపీలోని కృష్ణాజిల్లాలో అతని ఆచూకీ కోసం వెతికారు. చివరికి
కృష్ణా జిల్లాలోని స్వగ్రామం వెళ్లినట్లు గుర్తించారు. హైదరాబాద్ తీసుకొచ్చి విచారిస్తే అసలు విషయం బయటపడింది...

ఏపీలో రిటైర్.. హైదరాబాద్ లో సెటిల్

ఏపీలో రిటైర్.. హైదరాబాద్ లో సెటిల్

ఏపీలోని కృష్ణాజిల్లాలో గతంలో వీఆర్వోగా పనిచేసిన గంగాధర్ కొన్నేళ్లక్రితం రిటైర్ అయ్యారు. ఆ తర్వాత భార్యతో కలిసి హైదరాబాద్ కు వలస వచ్చారు. భార్య బేబీతో కలిసి ముషీరాబాద్ అడిక్ మెట్ డివిజన్ గణేష్ నగర్లో నివాసం ఉంటున్నారు. రిటైర్డ్ ఉద్యోగి కావడంతో కొన్నేళ్లుగా ఇంట్లోనే ఉన్న గంగాధర్.. ఆ తర్వాత పెండింగ్ పనుల కోసం కృష్ణాజిల్లాలోని స్వస్ధలానికి వెళ్లాలని భావించారు. అయితే భార్యను తీసుకుని ఊరూరా తిరగడం సాధ్యం కాదు. దీంతో ఏం చేయాలని ఆలోచించారు.

ఎనిమిది నెలల క్రితం మిస్సింగ్

ఎనిమిది నెలల క్రితం మిస్సింగ్

ఓ రోజు గంగాధర్ కు ఓ ఆలోచన వచ్చింది. స్వస్ధలం కృష్ణా జిల్లా నాగాయలంక గ్రామంలో ఉన్న ఇల్లు, స్థలాలను ఓసారి వెళ్లి చూసుకోవాలని భావించారు. అనుకున్నదే తడవుగా బయలుదేరి వెళ్లారు. అయితే భార్యను మాత్రం ఇంట్లోనే ఉంచి బయటి నుంచి తాళం వేశారు. కృష్ణాజిల్లాలో తన ఆస్తులు అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఉండడంతో తరచూ అక్కడికి వెళ్లి వస్తున్నారు.. అలాగే పదవీ విరమణ చేసినా పెన్షన్ కూడా మంజూరు కాకపోవడంతో ఆ పని కూడా ఉండేది.

ఈ పనులు చక్కబెట్టేందుకే ఎనిమిది నెలల క్రితం స్వగ్రామానికి వెళ్లాడు. గతంలోనూ అలాగే చేశాడు.

భార్యకు కిటికీల ద్వారా భోజన ఏర్పాట్లు

భార్యకు కిటికీల ద్వారా భోజన ఏర్పాట్లు

అలా బయటకు వెళ్లినప్పుడు గంగాధర్ తన ఇంటి యజమాని ద్వారా భార్యకు భోజన ఏర్పాట్లు చేయించేవాడు. దీంతో వారు కిటికీలోంచి బేబీకి భోజనం అందించేవారు. ఇదే వివాదానికి దారితీసింది. ఈ విషయం ఆనోటా ఈనోటా బయటకు పొక్కి పత్రికల్లో రావడంతో ఏదో జరిగిపోయిందన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

వెంటనే స్పందించిన హైదరాబాద్ జిల్లా దివ్యాంగుల సంక్షేమ, సీనియర్ సిటిజన్స్ కమిటీ సహాయ సంచాలకులు పుష్పలత బేబీని కలిసి విచారించారు. ఆమెకు వైద్య పరీక్షలు చేయించి ఘటకేసర్ లోని కరుణ రథం వృద్ధాశ్రమంలో ఉంచారు. అనంతరం భర్త ఆచూకీ కోసం బేగంబజార్ ఠానాలో ఫిర్యాదు చేశారు.

 భర్త ఆచూకీ కోసం గాలింపు

భర్త ఆచూకీ కోసం గాలింపు

భార్యను 8 నెలలుగా ఒంటరిగా వదిలిపెట్టి గంగాధర్ ఎక్కడికి వెళ్లాడో వెతకడం మొదలుపెట్టారు పోలీసులు. ఏపీ పోలీసుల సాయం కూడా కోరారు. చివరికి ఏపీ పోలీసులు గంగాధర్ కృష్ణా జిల్లా అవనిగడ్డలో గంగాధర్ ఉన్నట్లు అక్కడి అధికారుల నుంచి సమాచారం ఇచ్చారు. దీంతో స్థానిక అధికారులు అతన్ని రప్పించి భార్యను ఉంచిన కరుణ రథం వృద్ధాశ్రమానికి తీసుకువెళ్లారు. విచారణలో తాను ఎక్కడికి వెళ్తున్నది, ఎందుకు వెళ్తున్నది గంగాధర్ వివరించారు. వివరాలన్నీ విన్న అధికారులు వాటిపై విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు.

అయితే పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఇప్పటికే జిల్లా లీగల్ సెల్ అథారిటీ ఈ అంశం పై విచారణ నిర్వహిస్తుండడంతో నాంపల్లిలోని క్రిమినల్ కోర్టులో గంగాధర్ ను హాజరుపరిచారు.

English summary
Telangana police finally traced the suspicious husband missing case in hyderabad. Police found that husband locked his wife in a room for last 8 months and roaming between AP and TS. Nearby people supplying food for his wife through windows.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X