ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాళ్లకు నిజంగా 'హోలీ'నే: భర్తలను బాదేసిన భార్యలు

|
Google Oneindia TeluguNews

ఖమ్మం: హోలీ వచ్చిందంటే అక్కడి మహిళకు ఎంతో ఆనందం. ఎందుకంటే ఈ వేడుక రోజు ఎంచక్కా తమ భర్తల భరతం పట్టొచ్చు. ఇష్టమొచ్చినట్లు బాదొచ్చు. భార్యలు ఎంత కొడుతున్నా.. భర్తలు మాత్రం తప్పించుకుంటూ తిరగాలే తప్ప, వారిని ఏమి అనరాదు. దీంతో రెచ్చిపోయిన సతీమణులు తమ భర్తలను చిరునవ్వులు చిందిస్తూ బాదేశారు. హోలీ రోజున జరుపుకునే సంప్రదాయ వేడుకైన డూండ్‌ వేడుకలో ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం సామ్యతండాలో భార్యాభర్తలు ఉత్సాహంగా జరుపుకున్నారు.

డూండ్ అంటే వెతకడం అని అర్థం. నిరుడు హోలీ నుంచి ఈ హోలీ రోజుకు మధ్య కాలంలో తండాలో ఎవరి కుటుంబంలో మగ పిల్లాడు జన్మిస్తాడో అతన్ని సంప్రదాయబద్దంగా ఈ హోలీ వేడుకల్లో భాగంగా తెల్లవారు 4గంటలకు మహిళలు(గెరినీలు) దాచిపెడతారు. వాడిని కర్రలు చేతబట్టిన పురుషులు(గేర్యాలు) వెతుకు(డూండ్)తారు.

husbands and wives celebrates doond ceremony

పిల్లాడు దొరికిన తర్వాత మహిళలు, పురుషులు కలిసి కామదహనం చేసి రంగులు పూసుకుంటారు. అనంతరం తండాలోని అంతా కలిసి పిండివంటలు చేసుకుని వాటిని పిల్లాడి ఇంటివద్దనున్న స్థూపం వద్ద గంగాళ్లాల్లో పెడతారు. ఆ గంగాళాలను తాడుతో కట్టేసి కర్రలు చేబూని మహిళలు కాపలా ఉంటారు.

అప్పుడు పురుషులు వాటిని దొంగతనం చేయాలి. అలా చేసినప్పుడు పురుషుల ఒళ్లు వాసేలా భార్యలు కొడతారు. తినుబండారాలన్నీ దొంగతనం చేసిన తర్వాత ఎవరైతే వాటిని దొంగిలిస్తారో అతడ్ని తండా ధీరుడిగా గుర్తిస్తారు. ఆ తినుబండారాలు కామదహనం చేసిన ప్రాంతంలో పంచుకుని తిని వెళ్లడంతో పండగ ముగుస్తుంది.

English summary
Husbands and wives celebrates doond ceremony in Khammam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X