హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వినూత్న నిరసన: మహిళల వేషాధారణలో బతుకమ్మ ఆడిన ఆర్టీసీ కార్మికులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/కరీంనగర్: ఆర్టీసీ సమ్మె చేస్తున్న నేపథ్యంలో హుస్నాబాద్ బస్ డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు వినూత్న రీతిలో ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. అక్టోబర్ 5 నుంచి ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సమ్మె విరమించాలంటూ ఆర్టీసీ కార్మికులపై ఒత్తిడి చేస్తోంది.

ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
హుస్నాబాద్ డిపో ఎదుట మహిళా వేషధారణలో చీరలు కట్టుకొని బతుక్కమ్మ ఆడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసి ని ప్రభుత్వం లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.

Husnabad TSRTCT employees played bathukamma in women dresses

ఈ కార్యక్రమానికి ఆర్టీసీ జేఏసీ నాయకులు మల్లేశం, మహేందర్, రాములు, వీఆర్ఎన్ రెడ్డి, రమేశం, కనకరాజు, చంద్రమౌళి, అఖిలపక్షం నాయకులు కేడం. లింగమూర్తి, అయిలేని మల్లికార్జున రెడ్డి, అక్కు.శ్రీనివాస్, కవ్వ వేణుగోపాల్ రెడ్డి, కోహెడ కొమురయ్య, మైదంశెట్టి వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Husnabad TSRTCT employees played bathukamma in women dresses

ఇది ఇలా ఉండగా, రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచెడ్‌లో తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ తెలంగాణ ఆర్టీసీకి చెందిన ఓ డ్రైవర్ సెల్ టవర్ ఎక్కాడు. ఆ డ్రైవర్‌ను మహేశ్వరం డిపోలో విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్‌గా గుర్తించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే అక్కడ్నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. అతడ్ని కిందికి దించేందుకు అధికారులు, పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

మరోవైపు తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సీఎస్ ఎస్కే జోషీ, డీజీపీ మహేందర్ రెడ్డి, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, రవాణా శాఖ కమిషనర్ సందీప్ కుమార్ తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

English summary
Husnabad TSRTCT employees played bathukamma in women dresses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X