వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేటీఆర్ సత్తాకు అగ్ని పరీక్ష .. హుజూర్ నగర్ లో గులాబీ జెండా ఎగిరితే ఆయనే బాద్ షా

|
Google Oneindia TeluguNews

నువ్వా నేనా అన్నట్టు సాగిన హుజూర్ నగర్ ఉప ఎన్నిక తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం భవిష్యత్తు రాజకీయ పరిణామాలకు సంకేతంగా ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో ఓటర్లు ఎవరికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు అన్నదానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సిట్టింగ్ స్థానమైన హుజూర్నగర్ స్థానాన్ని దక్కించుకోవడం కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకం. అలాగే ఇప్పటివరకు గులాబీ పార్టీ విజయకేతనం ఎగురవేయాలని హుజూర్ నగర్ ఓటర్ల చేత జీహుజూర్ అనిపించుకోవడం అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకం.

హుజూర్ నగర్ ఫలితంపై కార్మికుల్లో టెన్షన్ .. ఫలితంతో ముడిపడిన ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు ?హుజూర్ నగర్ ఫలితంపై కార్మికుల్లో టెన్షన్ .. ఫలితంతో ముడిపడిన ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు ?

హుజూర్ నగర్ ఎన్నికల బాధ్యత కేటీఆర్ దే

హుజూర్ నగర్ ఎన్నికల బాధ్యత కేటీఆర్ దే

హుజూర్ నగర్ ఉప ఎన్నిక టిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించడంతో గులాబీ బాస్ కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హుజూర్ నగర్ ఉప ఎన్నికల బాధ్యతను అప్పగించారు. ఎలాగైనా అక్కడ కారు దూసుకుపోయే లా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని తనయుడు కేటీఆర్ కు గులాబీ బాస్ ఆదేశాలు జారీ చేశారు. ఇది కేటీఆర్ సత్తా కు అగ్ని పరీక్షగా మారడంతో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తనదైన శైలిలో వ్యూహాలు రచించారు.

 వ్యూహాత్మకంగా పావులు కదిపిన కేటీఆర్

వ్యూహాత్మకంగా పావులు కదిపిన కేటీఆర్

నియోజకవర్గంలోని అన్ని మండలాల వారీగా సామాజిక సమీకరణాలను, రాజకీయ సమీకరణాలను బేరీజు వేసుకొని ఎక్కడికక్కడ కీలక నాయకులను రంగంలోకి దింపారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ పక్కా వ్యూహంతో ప్రచార పర్వం నిర్వహించారు. ఇక ఊహించని విధంగా వచ్చిన ఆర్టీసీ సమ్మె మంత్రి కేటీఆర్ కు పెద్ద సవాల్ విసిరింది. రాష్ట్రంలో హుజూర్ నగర్ ఎన్నికల సమయంలో మారిన రాజకీయ పరిణామాలు కేటీఆర్ ను కాస్త ఇబ్బంది పెట్టాయి.

ఆర్టీసీ కార్మిక సమ్మె తో కాస్త ఇబ్బంది పడిన కేటీఆర్

ఆర్టీసీ కార్మిక సమ్మె తో కాస్త ఇబ్బంది పడిన కేటీఆర్

హుజూర్ నగర్ నియోజకవర్గంలో కేటీఆర్ రోడ్ షో లను నిర్వహించాలనుకున్నా ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం వల్ల కేటీఆర్ అనుకున్న విధంగా ప్రచారం చేయలేకపోయారు. కానీ చాలా జాగ్రత్తగా మండలాల వారీగా, సామాజిక సమీకరణాల వారీగా లెక్కలు వేసి ఆ ఓటు బ్యాంకును తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. పోల్ మేనేజ్మెంట్ విషయంలో కూడా కేటీఆర్ సక్సెస్ అయ్యారని నిన్న పోలింగ్ తరువాత వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు తేటతెల్లం చేశాయి.

వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ శ్రేణులపై కేటీఆర్ పట్టు

వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ శ్రేణులపై కేటీఆర్ పట్టు


గులాబి బాస్ సీఎం కేసీఆర్ తన తర్వాత గులాబీ పార్టీలో తన కుమారుడికి ప్రాధాన్యత అనే విషయాన్ని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి పార్టీ శ్రేణులకు అర్థమయ్యేలా చెప్పారు. ఇక సీఎం గానూ తన కుమారుడిని పరిచయం చేయాలని భావించిన కెసిఆర్ ముందు పార్టీపై పట్టు సాధించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలక బాధ్యత అప్పగించారు. ఇక టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కేటీఆర్ పార్టీని బలోపేతం చేయడంతో పాటుగా, పార్టీలో అంతర్గత విభేదాల విషయంలోనూ, మంత్రివర్గ విస్తరణ సందర్భంలో సొంత పార్టీ నేతలలో తలెత్తిన వ్యతిరేకత నేపథ్యంలోనూ చాలా కీలకంగా వ్యవహరించారు.

గ్రౌండ్ వర్క్ చేసిన కేటీఆర్ .. విజయంపై ధీమా

గ్రౌండ్ వర్క్ చేసిన కేటీఆర్ .. విజయంపై ధీమా

ఎక్కడికక్కడ సమస్యను పరిష్కరించి పార్టీలో ఇప్పటికే ట్రబుల్ షూటర్ అనిపించుకున్నారు. ఒకప్పుడు హరీష్ రావు పార్టీలో ట్రబుల్ షూటర్ గా వ్యవహరిస్తే, ఇప్పుడు కేటీఆర్ పార్టీ పై తన పట్టును నిలుపుకోవడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో వచ్చిన హుజూర్ నగర్ ఉప ఎన్నిక టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కత్తి మీద సామే అని చెప్పాలి. ఇక అలాంటి ఉప ఎన్నిక విషయంలో వ్యూహాత్మకంగా గ్రౌండ్ వర్క్ చేసిన కేటీఆర్ నిన్న పోలింగ్ తరువాత విజయం టిఆర్ఎస్ పార్టీ అని ట్వీట్ చేసి తన ధీమా వ్యక్తం చేశారు.

కేటీఆర్ సత్తా తేలేది ఈ ఫలితంతోనే

కేటీఆర్ సత్తా తేలేది ఈ ఫలితంతోనే

ఒకవేళ కెటిఆర్ ఊహించినట్లుగా, ఆయన లెక్క తప్పకుండా అదే గనుక జరిగితే గులాబీ బాస్ తర్వాత పార్టీ శ్రేణులు అందరూ ఏకాభిప్రాయంతో అంగీకరించే బాద్ షా కేటీఆర్ అని చెప్పడం నిర్వివాదాంశం. ఈ ఎన్నికల ఫలితంలో కారు పార్టీ అయిన దూసుకుపోతే కేటీఆర్ సత్తా అటు పార్టీ లోనే కాదు, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, రాజకీయ వర్గాలకు విదితమవుతుంది అని గులాబీ బాస్ భావిస్తున్నారు.

English summary
Huzur nagar by-election is very perstigious to TRS Party Working President KTR . After the polling yesterday, KTR, which had strategically done ground work for the winning of trs tweeted that it will be a victory to TRS party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X