• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మమతా బెనర్జీ పైనే ఈటల భారం-అక్కడే ట్విస్టు : రాజేందర్‌కు బీపీ- కేసీఆర్ హ్యాపీ..!!

By Lekhaka
|

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో..ప్రధానంగా తెలంగాణలో వినిపిస్తున్న పేరు హుజూరాబాద్. అక్కడ ఈటల రాజేందర్ గతంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో పార్టీకి -ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో ఇప్పుడు అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈటల బీజేపీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్దిగా..ఈటల లేకుంటే ఆయన సతీమణి జమున పోటీలో దిగటం ఖాయం. ఇప్పటికే వారిద్దరూ నియోజకవర్గం మొత్తం చుట్టేస్తున్నారు. ఇక, గులాబీ పార్టీ నుంచి రోజుకో పేరు తెర మీదకు వస్తోంది. అదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రోజుకో వరం ప్రకటిస్తున్నారు.

ఉప ఎన్నిక జరిగేదెన్నడు..

ఉప ఎన్నిక జరిగేదెన్నడు..

అయితే, హుజూరాబాద్ కు ఈటల రాజీనామా చేసిన వెంటనే ఆమోదించటం..ఖాళీ గుర్తించటం చకచకా జరిగిపోయాయి. ఆ రోజు నుంచి ఆరు నెలల లోగా ఎన్నిక జరగాల్సి ఉంది. జూన్ 12వ తేదీన ఈటల అధికారికంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. అంటే ఎన్నికల సంఘం ఉప ఎన్నిక ప్రక్రియ డిసెంబర్ 11వ తేదీ లోగా ముగించాల్సి ఉంటుంది. ఇక్కడే అసలు ట్విస్టు ఉంది. అసలు..డిసెంబర్ లోగా ఉప ఎన్నిక జరుగుతుందా అంటే ఏ ఒక్కరూ స్పష్టత ఇవ్వలేని పరిస్థితి. ఇక్కడ మరో లింకు ఉంది.

 మమత పోటీతో..ఈటల ఎన్నిక లింకు..

మమత పోటీతో..ఈటల ఎన్నిక లింకు..


పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించిన మమతా బెనర్జీ తాను పోటీ చేసిన నందిగ్రామ్ నుంచి ఓడిపోయారు. సభలో ప్రాతినిధ్యం లేకపోయినా..ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటంతో దీదీ ఖచ్చితంగా నవంబర్ 5వ తేదీ లోగా చట్ట సభకు ఎన్నిక కావాల్సి ఉంది. ఇందు కోసం ఇప్పటికే భవానీపూర్ ను సిద్దం చేసుకున్నారు. కానీ, దీదీ ఎన్నిక నిర్దిష్ట సమయంలోగా జరుగుతుందా లేదా అనే అనుమానాలకు ఇంకా క్లారిటీ రావటం లేదు. ఇదే సమయంలో కేంద్రంలోని ప్రముఖులు..వైద్య నిపుణులు థర్డ్ వేవ్ హెచ్చరికలు చేస్తున్నారు.

 హైకోర్టు తీర్పు..థర్డ్ వేవ్ హెచ్చరికలు..

హైకోర్టు తీర్పు..థర్డ్ వేవ్ హెచ్చరికలు..

గతంలో చెన్నై హైకోర్టు కరోనా సమయంలో అయిదు రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించటం పైన ఎన్నికల సంఘాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. దీంతో..ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న 17అసెంబ్లీ సీట్లు..రెండు లోక్ సభ సీట్లకు ఎప్పుడు ఉప ఎన్నికలు నిర్వహించేదీ సంకేతాలు కూడా ఇవ్వటం లేదు. దీంతో..పాటే ఏపీలోని కడప జిల్లాలో బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో వస్తున్న ఉప ఎన్నిక కావటం..జగన్ సొంత జల్లా అవ్వటంతో పెద్దగా ఈ ఎన్నిక పైన ఇంకా చర్చ మొదలు కాలేదు.

  Etela Rajender vs CM KCR : TRS లో ఉద్యమ నేతలేరీ ? అభియోగాలు మోపి, పొగ పెట్టి...!! | Oneindia Telugu
  ఈటలకు మోయలేని భారం..కేసీఆర్ హ్యాపీ

  ఈటలకు మోయలేని భారం..కేసీఆర్ హ్యాపీ


  కానీ, హుజూరాబాద్ లో అభ్యర్ధి ఎవరో అర్దం కాని రీతిలో కేసీఆర్ పావులు కదుపుతున్నారు. దీంతో..ఈటల మరింత తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. ఇలా..ఎన్నిక ఎప్పుడే స్పష్టత లేకుండా ఎన్నికల ప్రచారం చేయటం..కార్యకర్తలను నిలుపుకోవటం.. ప్రచార ఖర్చు ... ఇవన్నీ కలిసి ఈటల కు రాజకీయంగానే కాదు..ఆర్దికంగా మోయలేని భారంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ అధికారంలో ఉన్న పార్టీ కావటంతో పెద్దగా వారికి ఈ సమస్య ఉండదు.

  ఇక, కాంగ్రెస్ షెడ్యూల్ వచ్చిన తరువాతనే బరిలోకి దిగాలనే ఆలోచనలో ఉంది. దీంతో..ఇప్పుడు ఈటల సైతం మమత బెనర్జీ వైపే ఆసక్తిగా చూస్తున్నారు. ఆ ఎన్నికతో పాటుగానే తన ఎన్నిక జరుగుతుందనే నమ్మకం ఈటలది. కాగా, ఇవన్నీ కలిసి ఈటల భారీగా నష్టపోతారనేది కేసీఆర్ ధీమా. దీంతో..అసలు ఈ ఎన్నిక ఎప్పుడు జరుగుతుందనే చర్చ ఆసక్తి కరంగా మారుతోంది.

  English summary
  Eatela Rajender started election campaign in Huzurabad for by poll. But, EC not ready to conduct poll as shortly as expected. Huzurabad election is connected to Mamata Banerjees elections.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X