వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హుజుర్‌నగర్ ఎన్నిక రెఫరెండం కాదు... కాంగ్రెస్

|
Google Oneindia TeluguNews

హుజుర్‌నగర్ ఉప ఎన్నిక రెఫరెండం కాదని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటి చేసినప్పుడే రెఫరెండంగా స్వీకరించాలని ఆయన చెప్పారు. ఇప్పుడు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీటుపై అని చెప్పారు. మరోవైపు ఉప ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ మార్పులు ఉంటాయని ఆయన తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు అదే కారణమా! అసత్య ప్రచారమంటూ..తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు అదే కారణమా! అసత్య ప్రచారమంటూ..

హుజుర్‌‌నగర్ ఉప ఎన్నికపై హాట్‌హాట్‌గా ప్రచారం కొనసాగుతోంది. నువ్వా నేనా అనే చందంగా అధికార టీఆర్ఎస్,ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల సభ్యులు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దానికి దారి తీస్తోంది. ఉప ఎన్నికలను రిఫరెండంగా భావించాలని రెండు పార్టీల నేతలు భావిస్తున్నారు. అయితే రెఫరెండంపై కాంగ్రెస్ పార్టీలో మాత్రం భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.

Huzurnagar by elections will not be referendum : Damodara rajanarsimha

కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కోసం ఆ పార్టీలో అంతర్గతకుమ్ములాటలు కొనసాగుతున్న నేపథ్యంలోనే భవిష్యత్ నాయకుడిపై అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటీ సంధర్భంలో ఉప ఎన్నికలను రెఫరెండంగా భావించడం వల్ల భవిష్యత్‌లో ఇబ్బందులు తలేత్తే అవకాశాలు ఉన్నట్టు నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే పన్నేండు మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ భవిష్యత్ మసకభారింది.

ఓవైపు అధికార టీఆర్ఎస్ హుజుర్‌నగర్ స్థానానికి కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున రంగంలోకి దింపింది.ఇలాంటీ సంధర్భంలో రెఫరెండంగా బావించడం పార్టీకి చేటుతెస్తుందని కొంతమంది నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

English summary
Huzurnagar by elections will not be referendum siad former dy cm damodra rajanarsimha siad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X