వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హుజూర్‌నగర్‌ ఓట్ల లెక్కింపు ఇలా..: 12 గంటల కల్లా తుది ఫలితం: మెజార్టీ పైనే బెట్టింగ్ లు..!

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం మారి కాసేపట్లో తేలిపోనుంది. ఇప్పటికే కౌంటింగ్ జరిగే సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్‌ వద్దకు పోటీ చేసిన అభ్యర్ధులు.. వారి ఏజెంట్లు చేరుకున్నారు. ప్రధాన పార్టీలు హోరా హోరీగా తలపడిన ఈ ఎన్నికల పైన ఎగ్జిట్ పోల్స్ మాత్రం అన్నీ అధికార పార్టీకే అనుకూలంగా ఉన్నాయి. అయితే, కాంగ్రెస్ నేతలు మాత్రం సైలెంట్ ఓటింగ్ జరిగిందని..తమకు అనుకూలంగా ఉంటుందని విశ్వసిస్తున్నారు. పోలయ్యాయి. మొత్తం 14 టేబుళ్లపై 22 రౌండ్లలో ఈ ఓట్ల లెక్కిపు పూర్తిచేస్తారు. ఒక్కో రౌండ్‌లో సుమారు 9 వేలపై చిలుకు ఓట్లను లెక్కిస్తారు. మధ్నాహ్నం 12 గంటల కల్లా తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఫలితం తెలంగాణ రాజకీయాలు కొత్త టర్న్ కు కారణమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అధికార పార్టీకి అనుకూలంగా ఉంటే కారు జోరు రాష్ట్ర రాజకీయాల్లో మరింత జోరుగా ముందుకెళ్లనుంది. ఫలితం మరోలా ఉంటే రాజకీయాలు వేగంగా మారే అవకాశాలు లేకపోలేదు.

కౌంటింగ్ విధానం ఇలా..

కౌంటింగ్ విధానం ఇలా..

హుజూర్ నగర్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు సర్వం సిద్దం చేసారు. ఇప్పటికే ఏర్పాట్లను స్వయంగా ఎన్నికల పరిశీలకుడు సచీంద్రప్రతాప్‌ సింగ్, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దుగ్యాల అమయ్‌కుమార్‌ పరిశీలించారు. సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్‌లో గురువారం ఉదయం 8 నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. ఈ ఎన్నికలో మొత్తం 28 మంది పోటీ పడ్డారు.

నియోజకవర్గ వ్యాప్తంగా 7 మండలాల్లో 302 పోలింగ్‌ కేంద్రాల్లో 2,00,754 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 14 టేబుళ్లపై 22 రౌండ్లలో ఈ ఓట్ల లెక్కిపు పూర్తిచేస్తారు. ఒక్కో రౌండ్‌లో సుమారు 9 వేలపై చిలుకు ఓట్లను లెక్కిస్తారు. మధ్నహ్నం 12 గంటల కల్లా తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మొహరించారు. ఫలితాలు అధికారికంగా ప్రకటించే వరకూ ఎన్నికల సంఘం నిబంధనలు అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టం చేసారు. ఎగ్జిట్ పోల్స్ అధికార పార్టీకి అనుకూలంగా రావటంతో ఆ పార్టీలో జోష్ కనిపిస్తుండగా.. కాంగ్రెస్ నేతలు మాత్రం సైలెంట్ ఓటింగ్ పైనే ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తున్నారు.

ఆ మండలం ఓట్ల లెక్కంపుతో ప్రారంభం..

ఆ మండలం ఓట్ల లెక్కంపుతో ప్రారంభం..

నియోజకవర్గ పరిధిలోని నేరేడుచర్ల మండలం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమై వరుసగా పాలకీడు, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం, హుజూర్‌నగర్‌ మండలం, పట్టణం, గరిడేపల్లి మండలంలోని లెక్కింపుతో పూర్తవుతుంది. లెక్కింపు అంతా పూర్తయ్యాక వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కిస్తారు. 302 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి వరుసగా 1వ నంబర్‌ నుంచి 302 వరకు అంకెలను ఒక్కో స్లిప్పుపై వేస్తారు. వీటిలో 5 స్లిప్పులు డ్రా తీస్తారు. ఈ డ్రాలో వచ్చిన పోలింగ్‌ కేంద్రం స్లిప్పు ఆధారంగా ఆ పోలింగ్‌ బూత్‌లోని వీవీప్యాట్‌ స్లిప్పులు ఏ పార్టీకి ఎన్ని పడ్డాయో లెక్కిస్తారు. ఈ స్లిప్పులను.. ఇదే పోలింగ్‌ బూత్‌లోని ఈవీఎంలలో ఆయా పార్టీకి పడిన ఓట్లు సమానంగా ఉన్నాయో లేదో సరి చూస్తారు. ఇది పూర్తయ్యాక అభ్యర్థులు ఎవరూ అభ్యంతరం చెప్పకపోతే రిటర్నింగ్‌ అధికారి గెలిచిన అభ్యర్థిని అధికారికంగా ప్రకటిస్తారు. మధ్యా హ్నం 12 గంటల వరకు తుది ఫలితం రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

పార్టీల్లో టెన్షన్..మెజార్టీ పైనే బెట్టింగ్ లు

పార్టీల్లో టెన్షన్..మెజార్టీ పైనే బెట్టింగ్ లు

అధికారులు వెల్లడించాయి. ఇక ఈ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్..కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో ఎవరు విజయం సాధిస్తారన్న దానిపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. ఎక్కువగా మెజార్టీపైనే బెట్టింగ్‌లు పెట్టినట్లు నియోజవకర్గంలో ప్రచారం సాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే మరి కొంత కాలం అధికార పార్టీ స్పీడ్ కు బ్రేకులు వేసే అవకాశం ఉండదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే విధంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పితే..కాంగ్రస్ నేతలకు అంతకు మించిన ఆనందం మరొకొటి ఉండదు. అయితే, అధికార పార్టీ నేతలు మాత్రం ఎగ్జిట్ పోల్స్ కంటే ముందుగానే తమ గెలుపు ఖాయమంటూ ట్వీట్లు చేసారు. ఇదే సమయంలో పోలింగ్ శాతం రికార్డు స్థాయిలో నమోదు కావటంతో..ప్రజల మూడ్ ఏ పార్టీ వైపు ఏ విధంగా ఉందనే ఆసక్తి రాజకీయంగా కనిపిస్తోంది.

English summary
Huzurnagar by poll counting arrangements completed and process start in short while. By 12 noon final result may be announced. counting will be on 14 tables arranged in Suryapet market yard.Exit polls given in favour of TRS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X