హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

63 శాతంతో ఉత్తీర్ణతతో 11ఏళ్లకే ఇంటర్ పూర్తి చేసిన అగస్త్య

పదకొండేళ్ల బాలుడు అగస్త జైశ్వాల్ ఇంటర్మీడియేట్ పాసయ్యాడు. ఆదివారం తెలంగాణలో ఇంటర్మీడియేట్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో అగస్త్య 63 శాతంతో ఉత్తీర్ణత సాధించాడు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పదకొండేళ్ల బాలుడు అగస్త జైశ్వాల్ ఇంటర్మీడియేట్ పాసయ్యాడు. ఆదివారం తెలంగాణలో ఇంటర్మీడియేట్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో అగస్త్య 63 శాతంతో ఉత్తీర్ణత సాధించాడు.

సాధారణంగా పదకొండేళ్లు అంటే అయిదో తరగతి లేదా ఆరో తగతి చదువుతుంటారు. కానీ అగస్త్య ఏకంగా ఇంటర్ పూర్తి చేశాడు. తద్వారా తెలంగాణలో అతి చిన్న వయస్సులో ఇంటర్ పూర్తి చేసిన వాడిగా నిలిచాడు.

హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ సెయింట్ మెరీస్ జూనియర్ కాలేజీలో సీఈసీ చదివాడు. ఇతను నిన్నటి ఫలితాల్లో అరవై మూడు శాతంతో ఉత్తీర్ణత సాధించాడు.

Hyderabad: 11-year-old boy clears class XII exam with 63 per cent

తాను బీకాం మరో మూడేళ్లలో పూర్తి చేస్తానని, కానీ తన లక్ష్యం డాక్టర్ అని అగస్త్య చెబుతున్నాడు. బీకాం చదివాక మళ్లీ ఇంటర్ బైపీసీ చదువుతానని, వైద్య ప్రవేశ పరీక్ష రాస్తానని చెబుతున్నాడు.

అగస్త్య ఎనిమిదేళ్లకే 10వ తరగతి పూర్తి చేసి రికార్డ్ సృష్టించాడు. ఇంటర్ మొదటి సంవత్సరంలో అరవై శాతం మార్కులు సాధించాడు. అతని సోదరి నైనా కూడా ఇలాగే రికార్డ్ సృష్టించింది. ఆమె 17 ఏళ్లకే పిహెచ్‌డిలో చేరింది.

English summary
Agastya's father Ashwani Kumar said he passed the intermediate second year examination with 63 per cent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X