• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

స్కూల్ కెళ్లే పిల్లలే కానీ, స్మార్ట్‌ఫోన్‌లో పోర్న్ చిత్రాలు చూసి.. ఘోరం చేశారు

|

హైదరాబాద్: అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం పిల్లలు, యువతకు ఎంతో ఉపయోగపడుతోంది. అదే విధంగా ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్న కొందరు పిల్లలు.. తల్లిదండ్రుల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో వక్రమార్గంలో అడుగులు వేస్తున్నారు. కంప్యూటర్లు, స్మార్టఫోన్లలో అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ సౌకర్యంతో అశ్లీల, అసభ్య వీడియోలను చూస్తూ చెడుమార్గంలో పయనిస్తున్నారు. విద్యార్థి దశలోనే తప్పడగులు వేస్తూ వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ విచిత్ర, అసహ్యమైన ఘటన చూస్తే పిల్లలు ఏవిధంగా చెడిపోతున్నారనేది తెలుస్తుంది.

వివరాల్లోకి వెళితే.. ఓల్డ్‌మలక్‌పేట ప్రాంతంలోని ఓ బస్తీలో పాఠశాలకు వెళ్లే నలుగురు పిల్లలు(వీరంతా 14-15ఏళ్ల వయస్సు వారే). వారెప్పుడు కలిసే బడికెళ్లేవారు. ఆటలు కూడా కలిసే ఆడేవారు. ఆ బ్యాచ్‌లో పెద్దవాడైన పిల్లాడి చేతికి స్మార్ట్ ఫోన్‌ వచ్చింది. మొదట్లో వీడియోగేమ్స్‌తో ఎంజాయ్‌చేశారు.

ఆ తర్వాత వీరి దృష్టి అశ్లీల చిత్రాలు.. ఫోర్న్‌సైట్స్‌లోకి వెళ్లిపోయింది. కొద్దిరోజులుగా వారి ప్రవర్తనలో ఒక్కసారిగా మార్పు రావటం మొదలైంది. వికృతచేష్టలతో ప్రారంభించి అసహజ లైంగిక చేష్టలకు అలవాటుపడ్డారు. ఈ సమయంలోనే బస్తీకు చెందిన 12 ఏళ్ల బాలుడు పరిచయమయ్యాడు. అతడినీ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అసహజ చర్యకు పాల్పడసాగారు. దీన్ని ఆ నలుగురిలో ఓ బాలుడు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. వీడియో దృశ్యాలను బూచిగా చూపుతూ ఆ బాలుడిని బెదిరించటం ప్రారంభించారు.

Hyderabad: 4 teens sodomise 13-year-old boy for weeks, film it

ఇంట్లో నుంచి డబ్బు తీసుకురావాలంటూ హెచ్చరించేవారు. తీసుకురాకపోతే వీడియోలను సోషల్‌ మీడియాలో ఉంచి అతడి ఫ్రెండ్స్‌కు చూపుతామంటూ బ్లాక్‌ మెయిల్‌ చేసే స్థాయికి చేరారు. ఊహ తెలియని వయసులో తాను చేసిన తప్పేమిటో, ఆ వీడియోలో ఉన్న దృశ్యాలు ఏమిటో తెలియని ఆ పిల్లాడు భయంతో విషయాన్ని తండ్రికి చెప్పాడు.

దీంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన బాలుడి తండ్రి.. వెంటనే చాదర్‌ఘాట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఆ నలుగురి పిల్లల్ని తీసుకొచ్చి ప్రశ్నిస్తే వాస్తవం తెలుస్తుందనే అభిప్రాయాన్ని పోలీసులు వ్యక్తం చేశారు.

కాగా, సినిమా, నెట్‌ ప్రభావంతో మైనర్లు అసహజ, వికృత లైంగిక చేష్టలకు అలవాటుపడుతున్నారని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అనురాధారావు ఆందోళన వ్యక్తంచేశారు. బాధిత బాలుడికి సైకాలజిస్టులతో ఉచితంగా కౌన్సిలింగ్‌, వైద్యం చేయిస్తామని అతడి తండ్రికి హామీ ఇచ్చారు.

English summary
A 13-year-old boy was regularly sodomised and filmed by four teenagers from his neighbourhood at Jamal Colony in Old Malakpet for the last one-and-a-half months. Whenever the victim refused to go with them, his tormentors threatened to upload the videos and pictures on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X