వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్కూల్ ఎగ్గొట్టి.. సైబర్ కేఫ్స్ లో పోర్న్ వీక్షణ: పోలీసుల అదుపులో 65మంది

స్కూల్‌కు డుమ్మా కొట్టి సైబర్ కేఫ్స్ లో పోర్న్ సైట్లను వీక్షిస్తున్న 65మంది మైనర్ బాలురను హైదరాబాద్ సౌత్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సైబర్ కేఫ్స్‌లో పోర్న్ సైట్లను వీక్షిస్తున్న 65మంది మైనర్ బాలురను హైదరాబాద్ సౌత్ జోన్ పోలీసులు మంగళవారం నాడు అదుపులోకి తీసుకున్నారు. సౌత్ జోన్ పరిధిలోని 50 సైబర్ కేఫ్ ల మీద దాడులు నిర్వహించిన పోలీసులు 16 కేఫ్‌ల మీద పోలీస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. మరో రెండు కేఫ్ ల మీద సెక్షన్-292 కింద కేసు నమోదు చేసి వారిని రిమాండ్‌కు తరలించారు.

సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ దీనికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు స్కూల్స్ ఎగ్గొట్టి సైబర్ కేఫ్ లో గడుపుతున్నారని ఫిర్యాదు చేస్తున్నారని.. వారి ఫిర్యాదుల మేరకే దాడులు నిర్వహించామని తెలిపారు. స్టడీ మెటీరియల్ కలెక్ట్ చేసుకుంటున్నామని చెబతూ.. పోర్న్ సైట్లను వీక్షిస్తున్నారని పేర్కొన్నారు.

Hyderabad: 65 minors caught watching porn in cyber cafes

సైబర్ కేఫ్‌లకు వెళ్లవద్దని తల్లిదండ్రులు ఎంత చెప్పినా.. వారి పద్దతిలో మార్పు రావడం లేదని, దీంతో విసుగు చెందిన కొంతమంది తల్లిదండ్రులు తమను ఆశ్రయించి ఫిర్యాదు చేశారని డీసీపీ సత్యనారాయణ తెలిపారు. చాలా కేఫ్ లు సైబర్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని చెప్పారు. మంగళవారం నిర్వహించిన దాడుల్లో ఏ ఒక్క సైబర్ కేఫ్ రిజిస్టర్స్ మెయింటెయిన్ చేయట్లేదని గుర్తించినట్టుగా తెలిపారు.

చాలా సైబర్ కేఫ్స్ సీసీటీవీలను కూడా అమర్చుకోలేదని చెప్పుకొచ్చారు. సైబర్ కేఫ్ లతో విద్యార్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితి తలెత్తిందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతుండటంతో ఈ దాడులు నిర్వహించాల్సి వచ్చిందని వివరించారు.

English summary
Sixty five minor boys who were caught red handed watching porn in cyber cafes were picked up by south zone police on Tuesday. Police conducted raids on 50 cyber cafes in the area and registered cases against 16 cafes under the City Police Act and two cases under Section 292 for watching obscene material at cafes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X