హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Hyderabad: చెన్నై టూ హైదరాబాద్ షిఫ్ట్, 740 టన్నుల అమోనియం నైట్రేట్, బీరూట్ పేలుళ్ల దెబ్బతో !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ న్యూఢిల్లీ: లెబనాన్ రాజధాని బీరూట్ నగరంలో అత్యంత భారీ పేలుడు జరిగిన తరువాత చెన్నై హార్బర్ లోని గౌడన్ లో అయిదేళ్లుగా మూలుగుతున్న 740 టన్నుల అమోనియం నైట్రేట్ నిల్వలకు మోక్షం వచ్చింది. అయితే చెన్నైలోని అమోనియం నైట్రేట్ ను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. 37 కంటైనర్లలో ఉన్న అమోనియం నైట్రేట్ ను చెన్నై నుంచి హైదరాబాద్ కు సురక్షితంగా తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. బీరూట్ లో జరిగిన పేలుళ్ల లాగా ఎక్కడ చెన్నైలో పేలుళ్లు జరుగుతాయో అని ఆందోళనతో ఉన్న స్థానిక ప్రజలు ప్రస్తుతం ఊపిరిపీల్చుకున్నారు.

Recommended Video

Beirut Effect,740 Tonnes of Ammonium Nitrate Shifted From Chennai To Hyderabad || Oneindia Telugu

love: ఆన్ లైన్ గేమ్, రమ్మి రమ్మంది, లవర్ పొమ్మంది, ఇది ఓ పోలీసు స్టోరి, యూనీఫాంలో ఏం చేశాడంటే?!love: ఆన్ లైన్ గేమ్, రమ్మి రమ్మంది, లవర్ పొమ్మంది, ఇది ఓ పోలీసు స్టోరి, యూనీఫాంలో ఏం చేశాడంటే?!

 2015 నాటి స్టోరి

2015 నాటి స్టోరి

2015లో చెన్నైకి చెందిన శ్రీ అమ్మాన్ అనే సంస్థ దక్షిణ కోరియా నుంచి రూ. 1. 80 కోట్ల విలువైన 740 టన్ను అమోనియం నైట్రేట్ ను చెన్నైకి తెప్పించుకుంది. ఎరువుల తయారీ గ్రేడ్ రసాయనం పేరుతో పేలుడు పదార్థాలకు ఉపయోగించే గ్రేడ్ అమోనియం నైట్రేట్ ను దక్షిణ కోరియా నుంచి దిగుమతి చేసుకుున్నారని, ఆ కంపెనీకి కనీసం లైసెన్స్ కూడా లేదని అప్పట్లో అధికారులు ఆరోపించారు.

 హార్బర్ లో తిష్ట

హార్బర్ లో తిష్ట

2015లో కస్టమ్స్ అధికారులు అమోనియం నైట్రేట్ ను సీజ్ చేసి చెన్నై హార్బర్ లో 37 కంటైనర్లలో ప్రమాదకరమైన రసాయనం అయిన అమోనియం నైట్రేట్ ను నిల్వ చేశారు. అప్పటి నుంచి 740 టన్నుల అమోనియం నైట్రేట్ చెన్నై హార్బర్ లోనే ఉంది. చెన్నై నుంచి అమోనియం నైట్రేట్ ను వేరే ప్రాంతాలకు తరలించడానికి అధికారులు పెద్దగా ఆసక్తి చూపించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారని ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ దినపత్రిక కథనం ప్రచురించింది.

మరో బీరూట్ అవుతుందనే భయం ?

మరో బీరూట్ అవుతుందనే భయం ?

లెబనాన్ దేశ రాజధాని బీరూట్ లో కొనేళ్లపాటు నిల్వ చేసిన అమోనియం నైట్రేట్ కారణంగా భారీ పేలుళ్లు జరిగాయని వెలుగు చూడటంతో చెన్నై ప్రజలు ఆందోళన చెందారు. చెన్నై హార్బర్ లో ఉన్న 740 టన్నుల అమోనియం నైట్రేట్ ఉందని, ఎక్కడ మా ప్రాణాలకు హాని జరుగుతుందో ? చెన్నై ఎక్కడ మరో బీరూట్ అవుతుందో ? అంటూ స్థానిక ప్రజలకు భయం పట్టుకుంది.

 చెన్నై టూ హైదరాబాద్

చెన్నై టూ హైదరాబాద్

చెన్నై హార్బర్ లో ఉన్న అమోనియం నైట్రేట్ ను ప్రత్యే కంటైనర్లలో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీకి తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన రసాయనాలు తయారు చేసే ఓ ప్రైవేట్ కంపెనీ చెన్నై హార్బర్ లో ఉన్న అమోనియం నైట్రేట్ ను కొనుగోలు చేసిందని, ప్రత్యేక కంటైనర్లలో అమోనియం నైట్రేట్ ను సురక్షితంగా తరలిస్తున్నామని అధికారులు అంటున్నారు.

హిస్టరీ రిపీట్ అయితే కష్టం

హిస్టరీ రిపీట్ అయితే కష్టం

ఇటీవల బీరూట్ లో అమోనియం నైట్రేట్ కారణంగా పేలుళ్లు జరిగి భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది. 2015 చైనా రాజధాని బీజింగ్ లోని హార్బర్ లో 800 టన్నుల అమోనియం నైట్రేట్ ఉన్న రాకెట్ పేలిపోయి 173 మంది చైనీయుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 1947 అమెరికాలోని టెక్సాస్ లో హార్బర్ లో ఉన్న 2, 300 టన్నుల అమోనియం నైట్రేట్ కారణంగా పేలుళ్లు జరిగి 581 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. హిస్టరీ రిపీట్ కాకుండా చూడటానికే చెన్నై హార్బర్ లో ఉన్న అమోనియం నైట్రేట్ ను హైదరాబాద్ కు తరలించడానికి సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది.

English summary
Ammonium Nitrate weighing 740 tonnes stored in 37 containers at a container freight station (CFS) in Chennai will be moved to Hyderabad in a phased manner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X