ఫేస్బుక్ పరిచయంతో వివాహేతర సంబంధం: నగ్న వీడియోలు పంపి, చివరకు ప్రియుడ్ని చంపింది
హైదరాబాద్: ఓ వివాహిత ఫేస్బుక్ పరిచయం ఆమెతోపాటు ఇద్దరు యువకుల జీవితాలను నాశనం చేసింది. ఫేస్బుక్ పరిచయం యువకుడితో వివాహితకు అక్రమ సంబంధానికి దారితీసింది. అయితే, అతడు మాత్రం ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో అతడు బ్లాక్ చేశాడు. ఈ క్రమంలో ఆ యువకుడ్ని మరో ఇద్దరితో హత్య చేయించింది. చివరకు ఆ ఇద్దరితోపాటు ఆమె కూడా కటకటాలపాలైంది.

ఫేస్బుక్ పరిచయంతో వివాహేతర సంబంధం
వివరాల్లోకి వెళితే.. బాగ్‌అంబర్‌పేట్‌కు చెందిన యశ్మకుమార్..... వృత్తి రీత్యా ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా.... మీర్పేట్ ప్రశాంతిహిల్స్‌కు చెందిన గృహిణి శ్వేతారెడ్డితో నాలుగేళ్ల క్రితం ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వీరి మధ్య వివాహేతర బంధానికి దారితీసింది. వీరిద్దరూ గుట్టుగా తమ అక్రమ సంబంధాన్ని కొనసాగించారు.

యశ్మకుమార్‌కు నగ్న వీడియోలు పంపిన శ్వేతారెడ్డి
ఈ క్రమంలోనే యశ్మకుమార్.... శ్వేతారెడ్డికి ఫోన్ చేసి నగ్నంగా వీడియో కాల్ చేయాలని కోరడంతో... ఆమె ప్రియుడు చెప్పినట్టు చేసింది. నెల రోజులుగా యశ్మ.... శ్వేతకు ఫోన్ చేసి పెళ్లి చేసుకోవాలని.... లేదంటే వీడియోలను, ఫోటోలను బయటపెడతానని బెదిరించాడు.
ఈ సమస్య నుంచి బయటపడాలకున్న శ్వేతారెడ్డి.. యశ్మకుమార్‌ను ఎలాగైనా అంతమొందించాలని కుట్న పన్నింది.

మరో స్నేహితుడితో కలిసి యశ్మకుమార్‌పై శ్వేతారెడ్డి దాడి
ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన మరో స్నేహితుడు ఏపీలోని కృష్టా జిల్లా తిరువురుకు చెందిన కొంగల అశోక్ కు ఫోన్ చేసి పరిస్థితి వివరించింది. యశ్మకుమార్‌ను ఎలాగైన హత్య చేయాలని చెప్పింది. మే 4న నగరానికి వచ్చిన అశోక్.... శ్వేతతో కలిసి యశ్మకుమార్ ఉన్న చోటుకి చేరుకున్నారు. ఇద్దరు కలిసి యశ్మ తలపై సుత్తితో తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి పరారయ్యారు. వీరిద్దరికి మరో వ్యక్తి కూడా సహకరించాడు.

మృతి చెందిన యశ్మకుమార్.. జైలుపాలైన శ్వేతారెడ్డి, మరో ఇద్దరు
కాగా, బాధితుడు యశ్మకుమార్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. శ్వేతారెడ్డి, అశోక్‌తో పాటు వారికి సహకరించిన మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు.