హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘సీఎంగా రజినీ, భవిష్యత్‌లో ప్రధానిగా ఆరాధ్య, కానీ..: ‘19’లో మళ్లీ మోడీ, పాక్‌తో యుద్ధం’

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు, ప్రముఖ బాలీవుడ్ నటులు ఐశ్వర్యరాయ్-అభిషే కూతురు ఆరాధ్యపై నగరానికి చెందిన ఓ జ్యోతిష్కుడు చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అమితాబ్ కుటుంబానికి చెందిన ఆమెకు ప్రధాని అయ్యే అవకాశాలున్నాయని చెప్పారు.

చిన్న మార్పు చేస్తే.. భవిష్యత్ ప్రధాని ఆరాధ్యే..

చిన్న మార్పు చేస్తే.. భవిష్యత్ ప్రధాని ఆరాధ్యే..

ఆరాధ్య బచ్చన్‌కు రాజకీయంగా మంచి భవిష్యత్ ఉందని జ్యోతిష్కుడు జ్ఞానేశ్వర్ తెలిపారు. అంతేగాక, భవిష్యత్‌లో ఆమె దేశ ప్రధాని అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే, ఆరాధ్య ప్రధాని కావాలంటే ఆమె పేరును రోహిణిగా మార్చుకోవాలని సూచించారు.

సీఎంగా రజినీకాంత్

సీఎంగా రజినీకాంత్

ఇది ఇలా ఉంటే, తమిళనాడులో మధ్యంతర ఎన్నికలు వస్తాయని, ఆ ఎన్నికల్లో ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్ ముఖ్యమంత్రిగా ఎన్నికవుతారని జ్ఞానేశ్వర్ తెలిపారు.

భారత్-పాక్ యుద్ధం తప్పదు?

భారత్-పాక్ యుద్ధం తప్పదు?

భారత్-పాకిస్థాన్‌ల భవిష్యతు గురించి కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో ఇరు దేశాల మధ్య యుద్ధం వచ్చే అవకాశం ఉందని జ్ఞానేశ్వర్ చెప్పారు.

2019లో ప్రధానిగా మోడీ

2019లో ప్రధానిగా మోడీ

అంతేకగా, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మరోసారి ఎన్నికవుతారని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. దేశంలో అత్యంత సంపన్నుడైన ముకేష్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీకి 2018 అంతగా కలిసిరాదని, అతని వివాహం 2019లో జరుగుతుందని తెలిపారు.

 నేను చెప్పినట్లే గతంలో జరిగింది: జ్ఞానేశ్వర్

నేను చెప్పినట్లే గతంలో జరిగింది: జ్ఞానేశ్వర్

కాగా, గతంలో తాను చెప్పిననట్లుగానే అన్నీ జరిగాయని జ్ఞానేశ్వర్ తెలిపారు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పానని తెలిపారు. చిరంజీవి, రజనీకాంత్‌లు రాజకీయాల్లోకి వస్తారని తాను చెప్పినట్లే.. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో ఎన్నికల్లో పోటీ చేశారని గుర్తు చేశారు. అలాగే రజనీకాంత్ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. ఇప్పుడు కూడా తాను చెప్పినట్లుగానే జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

English summary
If the forecast’s of a city-based astrologer are anything to go by, then Bollywood legend Amitabh Bachchan’s granddaughter Aaradhya has a big future in politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X