హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు, కారణమిదే

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయనపై కేసు నమోదైంది. రామమందిర నిర్మాణం విషయమై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎంబిటి అంజదుల్లా ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయనపై కేసు నమోదైంది. రామమందిర నిర్మాణం విషయమై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎంబిటి అంజదుల్లా ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఎంబిటి నాయకుడు అంజదుల్లాఖాన్ ఢబీర్ పురా పోలీసులను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశాడు.శ్రీరామనవవిు సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ప్రజలను రెచ్చగొట్టేవిధంగా పాతబస్తీలో బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ప్రసంగానికి చెందిన సిడిని కూడ ఆయన తన ఫిర్యాదులో పోలీసులకు అందజేశారు.

Hyderabad: BJP MLA booked for hate speech

అయితే ఎంబిటి ఫిర్యాదు మేరకు న్యాయసలహా తీసుకొన్న తర్వాత కేసును నమోదుచేసినట్టుగా ఢబీర్ పురా సిఐ వెంకన్న నాయక్ చెప్పారు.అయితే ఈ కేసును షహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయాలా లేదా అనే విషయాన్ని నిర్ణయిస్తామన్నారాయన.

రాజాసింగ్ వివాదాస్పద ప్రసంగంపై అంజదుల్లాఖాన్ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు రాజాసింగ్ పై చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.అంతేకాదు పోలీసులు ఎందుకు స్పందించడం లేదన్నారు.రాజాసింగ్ చేసిన వివాదాస్పద ప్రకటన అంశాలను ఆయన ప్రస్తావించారు.

English summary
Goshamahal BJP legislator Raja Singh's hate speech against those opposing Ram temple at Ayodhya has triggered strong reaction from Majlis Bachao Tehreek (MBT). "Indian Muslims are not wearing bangles. We will not tolerate your rantings with silence. We warn you Raja Singh," said MBT leader Amjedullah Khan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X