హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైద్రాబాద్ వ్యాపారిని రాజస్థాన్ పిలిపించి దోచేశారు,కారణమిదే!..

హైద్రాబాద్ కు చెందిన ఓ వ్యాపారి పై రాజస్థాన్ లో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి రూ.30 వేల నగదును లాక్కెళ్ళారు. బాధితుడి నుండి డెబిట్ కార్డును కూడ తీసుకొన్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైద్రాబాద్ కు చెందిన ఓ వ్యాపారి పై రాజస్థాన్ లో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి రూ.30 వేల నగదును లాక్కెళ్ళారు. బాధితుడి నుండి డెబిట్ కార్డును కూడ తీసుకొన్నారు. సిసిటీవీ కెమెరాలు కొనుగోలు చేస్తామని పిలిపించి బాధితుడి నుండి గుర్తుతెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు.

హైద్రాబాద్ రామ్ నగర్ కు చెందిన అజయ్ నరహరి అనే వ్యక్తి సెక్యూరిటీ సోల్యూషన్స్ పేరుతో సీసీటీవి నడుపతున్నాడు.అయితే ఈ ఇటీవల కాలంలో రాజస్థాన్ నుండి ఓ వ్యక్తి తన స్కూల్ లో సీసీటీవి కెమెరాలు అమర్చాలని కోరారు. ఈ మేరకు తన స్కూల్ ను చూసేందుకు రావాలని కోరారు.

Hyderabad businessman looted in Rajasthan

అయితే ఈ ఫోన్ కాల్ ఆధారంగా అజయ్ నరహరి మార్చి 14వ, తేదిన రాజస్థాన్ కు వెళ్ళాడు. రాజస్ధాన్ లోని అల్వార్ ప్రాంతానికి బస్సులో చేరుకొన్నాడు.

అయితే అక్కడి నుండి ఓ వ్యక్తి తన మోటార్ బైక్ పై ఆయన్ను మారుమూల ప్రాంతానికి తీసుకెళ్ళాడు.అయితే అతను కొందరు తుపాకులు ధరించిన వ్యక్తుల వద్దకు తీసుకెళ్ళాడు. అక్కడికి అజయ్ నరహరి చేరుకోగానే దుండగులు ఆయనను కొట్టారు.

అతని వద్ద ఉన్న రూ30 వేల రూపాయాలను దోచుకొన్నారు. అంతేకాదు అతని నుండి డెబిట్ కార్డును కూడ తీసుకొన్నారు. అయితే ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో అక్కడి నుండి తప్పించుకొన్నట్టుగా బాధితుడు తెలిపారు.

English summary
Businessman Ajay Narahari from Ramnagar, who runs a security solutions firm, got a call from a person who identified himself as the board member of a school in Rajasthan.The caller wanted 850 CCTV cameras to be installed in the school, and he invited to Mr Narahari to do a site survey of the school.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X