హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

HawkEye app: క్యాబ్ సర్వీసు యాప్ లన్నీ హాక్ ఐతో లింక్: కాదు, కూడదు అంటే..: హైదరాబాద్ సీపీ వార్నింగ్.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద నలుగురు కామాంధుల చేతుల్లో అత్యంత పాశవికంగా అత్యాచారానికి, హత్యకు గురైన వెటర్నరి డాక్టర్ దిశ ఉదంతం అనంతరం.. మహిళల భద్రత కోసం పోలీసులు కొన్ని విప్లవాత్మక చర్యలు తీసుకోవడానికి శ్రీకారం చుట్టారు. క్యాబ్ సర్వీసు ప్రొవైడర్లకు కఠిన ఆదేశాలను జారీ చేశారు. తమ యాప్, వెబ్ అప్లికేషన్లన్నింటినీ హాక్ ఐ యాప్ తో అనుసంధానించుకోవాలని సూచించారు.

మామిడితోపులో సగం కాలిన మహిళ మృతదేహం లభ్యం: అత్యాచారం.. హత్యగా నిర్ధారణ: ఖాళీ మద్యం బాటిల్మామిడితోపులో సగం కాలిన మహిళ మృతదేహం లభ్యం: అత్యాచారం.. హత్యగా నిర్ధారణ: ఖాళీ మద్యం బాటిల్

 క్యాబ్ సర్వీసులపై నిఘా..

క్యాబ్ సర్వీసులపై నిఘా..

వెటర్నరీ డాక్టర్ దిశ హత్యోదంతం అనంతరం జంటనగరాల్లో మహిళల భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రైవేటు క్యాబ్ సర్వీసులను కట్టుదిట్టం చేయనున్నారు. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో ఏర్పాటైన సాఫ్ట్ వేర్ సంస్థల్లో పని చేసే మహిళా ఉద్యోగులు మొదలుకుని అన్ని వర్గాలకు చెందిన వారు కూడా క్యాబ్ సర్వీసులపై ఆధారపడి రాకపోకలను సాగిస్తుండటం సర్వ సాధారణం. పగలు, రాత్రి అనే తేడా లేకుండా మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఆయా సంస్థల్లో పని చేస్తుంటారు.

 క్యాబ్ సర్వీసు ప్రొవైడర్లతో సీపీ అంజనీకుమార్ భేటీ..

క్యాబ్ సర్వీసు ప్రొవైడర్లతో సీపీ అంజనీకుమార్ భేటీ..

హైదరాబాద్ ను కేంద్రంగా చేసుకుని పలు ప్రైవేటు క్యాబ్ సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఇలాంటి క్యాబ్ సంస్థలు సుమారు 15 వరకు ఉన్నాయి. ఆయా క్యాబ్ సర్వీసు ప్రొవైడర్లతో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సమావేశం అయ్యారు. వారికి కొన్ని మార్గదర్శకాలను జారీ చేశారు. మహిళల భద్రతలో రాజీ పడే ప్రసక్తే లేదని, వారికి రక్షణ కల్పించడానికి కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుందని అన్నారు.

యాప్, వెబ్ అప్లికేషన్లను హాక్ ఐతో లింక్

యాప్, వెబ్ అప్లికేషన్లను హాక్ ఐతో లింక్

ఓలా, ఉబేర్ వంటి క్యాబ్ సర్వీసు ప్రొవైడర్లందరూ తమ యాప్, వెబ్ అప్లికేషన్లన్నింటినీ హాక్ ఐతో తప్పనిసరిగా అనుసంధానించుకోవాలని అంజనీకుమార్ ఆదేశించారు. క్యాబ్ లు ఎక్కడెక్కడ తిరుగుతాయి, వాటిని వినియోగించే ప్రయాణికులు వివరాలు, పేర్లు, అడ్రస్, ఫోన్ నంబర్ సహా అన్నింటినీ హాక్ ఐలో పొందుపర్చాల్సి ఉంటుందని అన్నారు. జీపీఎస్ ను అమర్చుకోకుండా కొన్ని సంస్థలు క్యాబ్ సర్వీసులను అందజేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. అలాంటి సంస్థలు జీపీఎస్ వ్యవస్థను తక్షణమే సమకూర్చుకోవాలని సూచించారు.

 డ్రైవర్ల వ్యక్తిగత వివరాలు ఎప్పటికప్పుడు..

డ్రైవర్ల వ్యక్తిగత వివరాలు ఎప్పటికప్పుడు..

క్యాబ్ సంస్థల్లో పని చేసే డ్రైవర్ల వ్యక్తిగత వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని అంజనీకుమార్ ఆదేశించారు. వారి కుటుంబ నేపథ్యంపైనా నిఘా వేయాలని అన్నారు. క్యాబ్ డ్రైవర్ల అలవాట్లు, అభిరుచులు సైతం నేరాలను ప్రోత్సహించేలా ఉంటాయని, అలాంటి వారిపై నిఘా వేయాలని చెప్పారు. మహిళలు రాత్రిపూట రాకపోకలు సాగించే సమయంలో క్యాబ్ డ్రైవర్ల ప్రవర్తనను గుర్తించాలని, ఆ సమయంలో వారి వాహనాలు నిర్దేశిత మార్గంలో కాకుండా దారి మళ్లేలా ఉండే అవకాశాలు ఉంటాయని అన్నారు. అలాంటి సంఘటనలపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

English summary
At a meeting organized at the Hyderabad Police Commissioner office here on Thursday, Anjani Kumar discussed with the cab service providers about the precautions to be taken during the journey to ensure safety of women. He asked them to thoroughly verify credentials of the drivers before enrolling their services.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X