వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫొటోల మార్ఫింగ్, అశ్లీల రాతలపై ‘మా’ ఫిర్యాదు.. వెబ్ సైట్లపై కేసు నమోదు

సినీ ప్రముఖుల ఫొటోలను మార్ఫింగ్ చేసి.. అభ్యంతరకర వ్యాఖ్యలతో పోస్ట్ లు పెడుతున్న ప్రవేటు వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్న ‘మా’ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సినీ ప్రముఖుల ఫొటోలను మార్ఫింగ్ చేసి.. అభ్యంతరకర వ్యాఖ్యలతో పోస్ట్ లు పెడుతున్న ప్రవేటు వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు.

తమ ఫొటోలను మార్ఫింగ్ చేసి తమ క్యారెక్టర్ ని దెబ్బ తీయాలని చూస్తున్న వెబ్‌సైట్ల ఫై చర్యలు తీసుకోవాలని 'మా' అసోసియేషన్‌ సభ్యులు పోలీసులను కోరారు. ఉద్దేశపూర్వకంగా కొందరు వారి వెబ్ సైట్లలో అశ్లీల ఫొటోలు పోస్ట్ చేసి, తమకు ఇష్టమొచ్చిన కథనాలను ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

watching-porn

ఈ నేపథ్యంలో కొన్ని అశ్లీల వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానళ్లపై ఐటీ యాక్ట్ 67, 67ఎ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సైబర్ క్రైమ్ ఎస్పీ రామ్మోహన్ వెల్లడించారు. ఈ సందర్భంగా మాడియాతో మాట్లాడుతూ.. ప్రైవేటు వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులు ఈ తరహా పోస్ట్ లు ఎక్కడ్నించి చేసినా పట్టుకుంటామని హెచ్చరించారు.

ఒక్క సినీ ప్రముఖులనే కాదు, ఎవరు ఫిర్యాదు చేసినా నిందితులను వదలమని, సంబంధిత చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఏ దేశం నుంచి ఆపరేట్ చేసినా నిర్వాహకులు తప్పించుకోలేరని, నిర్వాహకులపైనే కాకుండా.. అలాంటి కంటెంట్ అప్ లోడ్ చేసే వారిపైనా చర్యలు తీసుకుంటామని ఎస్పీ రామ్మోహన్ హెచ్చరించారు.

కొన్ని వందల వెబ్ సైట్లపై తమకు ఫిర్యాదులు అందాయని, ఇప్పటి వరకు 20 వెబ్ సైట్లను గుర్తించామని, వ్యక్తిగతంగా ఎవరిని కించపరిచేలా కథనాలు రాసినా, ఫొటోలు ప్రచురించినా, అశ్లీలంగా చూపెట్టినా శిక్షార్హులేనని, ఈ విషయంలో ఎవరు ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

English summary
The cybercrime sleuths of the Crime Investigation Department (CID) have booked a case after the Movie Artists Association (MAA) lodged a complaint stating that some websites were uploading obscene photographs of actresses and carrying offensive content against actors. The case was booked under Sections 67 and 67A of Information Technology Act. MAA president Shivajiraja, General Secretary Naresh and other office-bearers informed CID Cybercrimes Superintendent of Police U. Rammohan that many websites, that usually posted movie-related information, were uploading obscene photographs by morphing images of film actresses. Some websites were tarnishing the reputation of actors, uploading defamatory content against them, they said. Rammohan said the CID has identified over 20 such websites as of now. There could be more websites which were uploading obscene pictures of actresses. “We are in the process of identifying the persons behind uploading the content,” he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X