హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లిఫ్ట్ అడిగి.. మహిళలకు వేధింపులు: కానిస్టేబుల్ అరెస్ట్, వేటు పడింది

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మహిళను లిఫ్ట్ అడిగి ఆమెను వేధింపులకు గురిచేసిన కేసులో టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ వీరబాబును బంజారాహిల్స్ పోలీసుులు అరెస్ట్ చేశారు. కారులో వెళ్తున్న మహిళలను లిఫ్ట్ అడిగి, వారి ఫోన్ నెంబర్లు సేకరించి వేధింపులకు గురిచేస్తున్నాడని వీరబాబుపై ఫిర్యాదులు వచ్చాయి.

ఐదు రోజుల వ్యవధిలో ఇద్దరు మహిళలు వీరబాబుపై ఫిర్యాదు చేశారు. లిఫ్ట్ అడిగి కారెక్కిన వీరబాబు ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్లు చేయడంతోపాటు అభ్యంతరకర సందేశాలతో వేధించాడని నగరానికి చెందిన ఇద్దరు మహిళలు ఫిర్యాదు చేశారు. సైఫాబాద్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో ఈ ఫిర్యాదులు అందాయి.

 Hyderabad: Cop sent to jail for harassing women

కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు వీరబాబును అరెస్ట్ చేశారు. అతనిపై ఐపీసీ 354, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కాగా, మహిళలను వేధింపులకు గురిచేసిన కానిస్టేబుల్ వీరబాబును సస్పెండ్ చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. అతడ్ని అరెస్ట్ చేసి, జైలుకు తరలించినట్లు సీపీ తెలిపారు. చట్టం ముందు ఎవరూ ఎక్కువ కాదని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

English summary
A 32-year-old police constable of Telangana State Special Police's (TSSP) 12th Battalion was on Sunday arrested by Banjara Hills Police for allegedly harassing a city woman. The constable was placed under suspension, said the CP, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X