హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

68రోజుల ఉపవాసంతో మృతి: ఆధారల్లేవంటూ.. ఆరాధన కేసు మూసివేత!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరాధన సముదారియా (13) కేసులో ఆధారాలు లభించలేదంటూ పోలీసులు కేసును మూసేశారు. ఈ కేసులో ఎంత దర్యాప్తు చేసినా ఆధారాలు లభించలేదని, కాబట్టి కేసును మూసివేస్తున్నామంటూ సికింద్రాబ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరాధన సముదారియా (13) కేసులో ఆధారాలు లభించలేదంటూ పోలీసులు కేసును మూసేశారు. ఈ కేసులో ఎంత దర్యాప్తు చేసినా ఆధారాలు లభించలేదని, కాబట్టి కేసును మూసివేస్తున్నామంటూ సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు బాలల హక్కుల సంఘానికి నోటీసు ద్వారా తెలిపారు.

గత అక్టోబరులో 68 రోజుల పాటు ఉపవాసం చేసిన బాలిక ఆరాధన(13) మృతి చెందింది.
బాలిక మృతిపై స్పందించిన బాలల హక్కుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు పది నెలలపాటు విచారించినా ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు.

Hyderabad cops drop case of death of fasting 13 year old, citing lack of evidence

కాగా, నిర్బంధ కఠిన ఉపవాస దీక్షతో ప్రాణాలు కోల్పోయిన ఆరాధన మరణానికి కారకులైన మతగురువులు, ఆమె తల్లిదండ్రులపై పోలీసులు చర్యలు తీసుకోకుండా కేసును మూసివేస్తున్నారని, కోర్టుకు వెళ్లి నిందితులకు శిక్ష పడేలా చేస్తామని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు పేర్కొన్నారు.

పోలీసులు ఫిర్యాదుదారులను కానీ, స్థానికులను కానీ విచారించకుండా కేవలం ఇది మతాచారాలకు సంబంధించినదనే అభిప్రాయంతో ఉన్నారని ఆరోపించారు. ఉపవాస దీక్షపై బాలిక కుటుంబ సభ్యులు ఓ హిందీ దినపత్రికలో ప్రకటననూ ఇచ్చారని ఇంతకంటే పోలీసులకు ఆధారాలేమి కావాలని ఆయన ప్రశ్నించారు. తూతూ మంత్రంగా విచారణ చేపట్టారన్నారు.

సుదీర్ఘంగా ఉపవాసం ఉండడం వల్లే బాలిక మృతి చెందిందని స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ తమకు ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని పోలీసులు చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సంఘం అధ్యక్షురాలు అనురాధారావు పేర్కొన్నారు. పోలీసుల వైఖరిపై త్వరలో కోర్టును ఆశ్రయిస్తామని ఆమె పేర్కొన్నారు.

English summary
Six months after 13 year old girl Aradhana had died after allegedly observing fast for 68 days, the Market police here dropped the case stating that “there was no proper evidence” in connection with the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X