హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉప్పల్ నరబలి కేసులో విస్తుగొలిపే నిజాలు: రాజశేఖర్ ఆటకట్టించిన 'సూపర్' టెక్నాలజీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సంచలనం సృష్టించిన ఉప్పల్ చిలుకానగర్‌లో చిన్నారి బలి కేసును పోలీసులు ఛేదించారు. ఇంట్లో గుర్తించిన రక్తపు చుక్క ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. కేసుకు సంబంధించి విస్తుగొలిపే వాస్తవాలను పోలీసులు మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. రాజేశేఖర్‌కు మూఢవిస్వాసాలు ఎక్కువగా ఉన్నాయి.

చదవండి: ఉప్పల్ నరబలి: తల మాత్రమే డాబాపై ఉంచడం వెనుక?, ఆ సలహాతోనే ఇదంతా..

అందువల్ల క్షుద్రపూజలు చేస్తే తన భార్య ఆరోగ్యం బాగుపడుతుందని, నరబలి చేస్తే కష్టాలు తొలగిపోతాయని ఇతరులు చెప్పిన మాటను నమ్మి, భార్యతో కలిసి ఘాతుకానికి పాల్పడ్డాడు. బోయగూడలో ఫుట్‌పాత్‌పై పడుకున్న ఓ శిశువును అపహరించి, హత్య చేసి ప్రతాపసింగారం వద్ద మూసీలో మొండెంను పడేసి, చిన్నారి తలతో దంపతులు ఇంట్లో నగ్నంగా పూజలు చేశారు. అనంతరం శిశువును దాబాపై ఉంచారు. దీంతో విషయం వెలుగు చూసిన విషయం తెలిసిందే.

చదవండి: గర్భిణీ హత్య: ఏజ్ గ్యాప్ వల్ల వివాహేతర సంబంధం, పింకీ ఫ్యామిలీ పరిస్థితి ఇదీ.. కనీసం ఫోటో లేదు

సూపర్ లైట్‌తో కేసు ఛేదన

సూపర్ లైట్‌తో కేసు ఛేదన

ఈ కేసు కోసం పోలీసులు వందకు పైగా ఫోన్ల విశ్లేషణ, వంద వరకు సీసీటీవీ కెమెరాల పరిశీలన, పలువురి నుంచి సాక్ష్యాల సేకరణతో పాటు ఎంతోమందిని విచారించారు. ఈ కేసు దర్యాఫ్తుకు పదిహేను రోజులు తీసుకుంది. పోలీసులు చాలాకష్టపడినా కేసు క్లిష్టతరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ క్లూస్ టీం.. సూపర్ లైట్‌తో విషయం బట్టబయలైంది.

క్లూస్ టీం పరిశీలనలో

క్లూస్ టీం పరిశీలనలో

రాజశేఖర్- శ్రీలత దంపతులు క్షుద్రపూజలు చేసినట్లు పోలీసులు మొదటి నంచి అనుమానిస్తున్నారు. కానీ వారు కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేయడం, వారిని పట్టించే సరైన ఆధారాలు లభించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వారం రోజుల క్రితం క్లూస్ టీం రాజశేఖర్ ఇంటిని క్లూస్ టీం పరిశీలించింది. వారు సూపర్ లైట్‌ను పరిశీలించారు.

మరకలను గుర్తించినప్పటికీ

మరకలను గుర్తించినప్పటికీ

సూపర్ లైట్‌తో గదిలో వెతికే సమయంలో గదిలోని లైట్లన్నీ ఆర్పేసి పరిశీలించాల్సి ఉంటుందట. చీకట్లో అది ఏదైనా రక్తపు మరకలను గుర్తిస్తే నీలం రంగులో కనిపిస్తోందట. గదిలో బండల మధ్య రెండు రక్తపు మరకలను ఇది గుర్తించింది. అయితే ఆ తర్వాత కూడా మరో ట్విస్ట్ చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

సూపర్ లైట్ టెక్నాలజీ

సూపర్ లైట్ టెక్నాలజీ

తాము సమ్మక్క, సారలమ్మ జాతర కోసం కోడిని కోశామని రాజశేఖర్ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆ రక్తపు మరకలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించడంతో అసలు విషయం తేలిపోయింది. కేసులో సూపర్ లైట్ టక్నాలజీ కీలకంగా వ్యవహరించింది. రాజశేఖర్ ఇంట్లో అన్ని అనవాళ్లను రసాయనాలతో శుభ్రం చేసి పోలీసులకు చుక్కలు చూపించాడు.

ఇంకా ఇవి తేలాల్సి ఉంది

ఇంకా ఇవి తేలాల్సి ఉంది

ఇదిలా ఉండగా, ఉప్పల్ నరబలి కేసు విచారణ ఇంకా పూర్తికాలేదు. నిందితులను గుర్తించారు. దీంతో అసలు విషయం కొలిక్కి వచ్చినా.. చనిపోయిన పాప తల్లిదండ్రులు ఎవరు అనేది తేలాల్సి ఉంది. బోయిగూడ నుంచి రాజశేఖర్ చిన్నారిని అపహరించినా ఆ పాప తల్లిదండ్రులు ఇప్పటి వరకు పోలీసులను ఆశ్రయించలేదు. ఫుట్ పాత్‌పై పడుకున్న చిన్నారిని తీసుకు వచ్చినా అది స్పష్టం కావాల్సి ఉంది. రెండేళ్ల క్రితం మేడారం జాతరలో కోయదొర నరబలి గురించి చెబితే ఇన్నాళ్లు రాజశేఖర్ ఆగడం గమనార్హం. రాజశేఖర్ దంపతులను విచారిస్తే క్షుద్రపూజలు చేసిన వారు, ఇంకా ఎవరు ఉన్నారనేది కూడా తేలనుంది.బోయగూడలో అపహరించి తీసుకు వచ్చిన చిన్నారి ఎవరు అనేది తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కేసు కోసం 45 మందిని విచారించారు. 15 రోజుల పాటు పోలీసులు రాత్రింబవళ్లు కష్టపడ్డారు.

English summary
The Hyderabad Police on Thursday arrested a couple for beheading a baby girl as part of a human sacrifice ritual during the 'super blue blood moon' on January 31.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X