హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘నేను మీ అంజనీకుమార్.. పద్ధతి మార్చుకోండి’: ఉస్మానియాలో గ్యాంగ్‌రేప్‌పై సీపీ ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనపై హైదరాబాద్ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్ సీరియస్‌గా స్పందించారు. అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళను ఒంటరిగా పంపిన పోలీసుల తీరు సరికాదని, పద్ధతి మార్చుకోవాలంటూ సీపీ హితవు పలికారు.

వైద్యం కోసం వెళ్తే మహిళపై గ్యాంగ్‌రేప్ చేసిన ఉస్మానియా ఆస్పత్రి సిబ్బంది <br>వైద్యం కోసం వెళ్తే మహిళపై గ్యాంగ్‌రేప్ చేసిన ఉస్మానియా ఆస్పత్రి సిబ్బంది

ఈ మేరకు అంజనీకుమార్ తన వాయిస్‌ రికార్డింగ్‌ను వాట్సప్‌ ద్వారా పోలీసు అధికారులకు, సిబ్బందికి ఓ సందేశాన్ని పంపారు. 'మిత్రులారా.. నేను అంజనీకుమార్‌.. మీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ మాట్లాడుతున్నాను. నిన్న జరిగిన సంఘటన, మీ అందరూ పేపర్‌లో చూశారు కదా..' అని ప్రశ్నించారు.

Hyderabad CP Whatsapp message to Banjara Hills police station

'ఒక మహిళ ఒంటరిగా బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. కానీ.. మీరు బాధ్యతను మరిచి ఆమెను ఒంటరిగా అర్ధరాత్రి ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రికి పంపించారు. ఆమెపై అక్కడ రేప్‌ జరిగింది. ఆసుపత్రి అవుట్‌పోస్టులో పనిచేస్తున్న హోంగార్డు సైతం ఈ నేరంలో ఉన్నాడు. హైదరాబాద్‌ పోలీసులకు చెడ్డ పేరు వచ్చింది. మీకు నా విన్నపం.. ప్రతి కేసు జాగ్రత్తగా ప్రొఫెషనల్‌ పద్ధతిలో హ్యాండిల్‌ చేయాలి.. మళ్లీ ఇలాంటివి జరగకుండా చూసుకోండి.. జై హింద్‌' అని సున్నితంగా హెచ్చరించారు.

English summary
Hyderabad CP Anjani Kumar sent a Whatsapp message to Banjara Hills police station on gangrape incident held in Osmania Hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X