• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

''మ్యాచ్ ముగిసింది''... పత్తా లేని మంత్రి శ్రీనివాస్ గౌడ్, అజారుద్దీన్!!

|
Google Oneindia TeluguNews

మణికట్టు మాయాజాలంతో అద్భుతమైన బ్యాట్స్ మెన్ గా పేరుతెచ్చుకున్న మహ్మద్ అజహరుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ''మాయాజాలం'' చేస్తున్నారని క్రికెట్ అభిమానులు ముక్త కంఠంతో ఆరోపిస్తున్నారు. హైద‌రాబాద్ ఉప్ప‌ ల్ స్టేడియంలో ఇండియా వ‌ర్సెస్ ఆస్ట్రేలియా మ‌ధ్య సెకండ్ ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ సంద‌ర్భంగా టికెట్ల అమ్మ‌కానికి సంబంధించి సెప్టెంబరు 22వ తేదీన ఎంత‌టి ర‌గ‌డ జ‌రిగిందో ఎవ‌రూ మ‌ర్చిపోలేదు.

తెల్లవారుజామునుంచే బారులు

తెల్లవారుజామునుంచే బారులు

ఆఫ్ లైన్ లో టికెట్లు రెండువేలకు మించి అమ్మలేదు. అభిమానులు మాత్రం తెల్లవారుజాము నుంచే భారీగా బారులు తీరారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగి 20మంది అభిమానులు, అదుపు చేయడానికి ప్రయత్నించిన 10 మంది పోలీసులు గాయపడ్డారు. ఈ సంఘటనవల్ల హైదరాబాద్ పరువు పోయిందని సీనియర్ క్రికెటర్లతోపాటు ప్రభుత్వం కూడా అభిప్రాయపడిందంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో అర్థం చేసుకోవచ్చు.

టికెట్ల అమ్మకం బాధ్యత బీసీసీఐదేనన్న అజార్!

టికెట్ల అమ్మకం బాధ్యత బీసీసీఐదేనన్న అజార్!


తొక్కిసలాట జరిగినరోజు హడావిడిగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హెచ్ సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ మాట్లాడుతూ.. ''టికెట్ల అమ్మకం తమచేతిలో లేదని, బీసీసీఐదేనని'' నెపం వారిపై తోసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను పంపించింది. ఆయన వెంటనే రవీంద్రభారతిలో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం ముందు హెచ్ సీఏ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి సమావేశం తర్వాత జావకారిపోయారేమిటా? అని అందరూ ముక్కున వేలేసుకున్నారు.

అజార్ ను వేనకేసుకొచ్చిన మంత్రి?

అజార్ ను వేనకేసుకొచ్చిన మంత్రి?

''సరైన సిబ్బంది కూడా లేరంట.. మనం మాత్రం ఏం చేస్తాంలే'' అన్నట్లుగా అజార్ ను వెనకేసుకొచ్చినట్లుగా మాట్లాడారు. మ్యాచ్ జరిగింది. భారత్ ఘనవిజయం సాధించింది. సిరీస్ కైవసం చేసుకుంది. ''మ్యాచ్ ముగిసిన తర్వాత ఎన్ని టికెట్లు అమ్మకానికి ఉంచాం.. ఆన్ లైన్ లో ఎన్ని అమ్మాం? ఆఫ్ లైన్ లో ఎన్ని అమ్మాం?'' తదితర వివరాలన్నీ ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందిస్తామని అజార్ ప్రకటించారు. మ్యాచ్ ముగిసి రెండువారాలవుతున్నప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం తరఫున సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ కానీ, అజారుద్దీన్ కానీ ఏమీ మాట్లాడలేదు. ఏం జరిగిందనే విషయమై వివరాలు లేవు. వారిద్దరూ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు.

రూ.40 కోట్ల కుంభకోణం?

రూ.40 కోట్ల కుంభకోణం?

55వేల కెపాసిటీ ఉన్న ఉప్పల్ స్టేడియంలో క్రికెటర్లకు, స్పాన్సర్లకు పోను 29,500 టికెట్లు అందుబాటులో ఉండాలి. కానీ కేవలం 2వేల టికెట్లు అమ్మి సరిపెట్టారు. మిగతా టికెట్లు ఏమయ్యాయి? అనే విషయం చిదంబర రహస్యంగా మారింది. ఒక్కో టికెట్ ను బ్లాక్ లో ఎంతకు అమ్ముతున్నారో అక్కడికి వెళ్లిన అభిమానులందరికీ గుర్తే. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు గురవారెడ్డి ఆరోపణల ప్రకారం టికెట్ల అమ్మకంలో రూ.40 కోట్ల కుంభకోణం జరిగిందంటున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియాల్సి ఉంది.

English summary
Cricket fans are openly accusing Mohammad Azharuddin, who is known as an amazing batsman with wrist magic, of doing magic'' even as the president of the Hyderabad Cricket Association.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X