హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నటుడు సల్మాన్ ఖాన్‌కు శిక్ష: కృష్ణజింకల గుర్తింపు, హైదరాబాదీ పాత్ర

|
Google Oneindia TeluguNews

Recommended Video

కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష

హైదరాబాద్/ముంబై: కృష్ణ జింకలను వేటాడిన కేసులో నటుడు సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఇరవై ఏళ్ల తర్వాత తాజాగా న్యాయస్థానం అతనిని దోషిగా తేల్చి శిక్ష విధించింది. ఈ కేసులో హైదరాబాదుకు చెందిన డీఎన్ఏ ఫింగర్‌ఫ్రింట్ ఎక్స్‌పర్ట్ సహకారం ఉంది.

కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌ను దోషిగా తేల్చిన కోర్టు, ఐదేళ్ల జైలు శిక్షకృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌ను దోషిగా తేల్చిన కోర్టు, ఐదేళ్ల జైలు శిక్ష

కృష్ణ జింకలను వేటాడిన కేసులో డీఎన్ఏ ఫింగర్ ఫ్రింట్స్ కీలక ఆధారాలు. ఈ కేసులో శాంపిల్స్‌ను హైదరాబాద్ ల్యాబ్‌కు పంపించారు. సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ఫ్రింట్స్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ)లో జరిపిన పరీక్షలు సల్మాన్ ఖాన్‌ను దోషిగా న్యాయస్థానం తేల్చేందుకు సహకరించాయి. ఈ కేసులో కృష్ణజింకలను గుర్తించేందుకు తోడ్పడ్డాయి.

కీలకంగా మారిన ఆ ఎవిడెన్స్

కీలకంగా మారిన ఆ ఎవిడెన్స్

సీడీఎఫ్‌డీ మాజీ ఉద్యోగి జీవీ రావు యొక్క ఎవిడెన్స్ ఈ కేసులో కీలకం అయింది. ఇతను అప్పుడు సీడీఎఫ్‌డీ యొక్క డీఎన్ఏ ఫింగర్ ఫ్రింటింగ్ ల్యాబ్ చీఫ్ స్టాఫ్ సైంటిస్ట్. ఈయన టీం 1999లలో కృష్ణజింకలను గుర్తించేందుకు ప్రత్యేకంగా మార్కర్స్‌ను డెవలప్ చేసింది.

 1998లో ఈ సంఘటన

1998లో ఈ సంఘటన

గురువారం జోధ్‌పూర్ కోర్టు తీర్పు అనంతరం అతను ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ.. 1998 అక్టోబర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుందని, ఆ తర్వాత అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపారని, కృష్ణ జింకకు సంబంధించిన ఎముకలను, స్కిన్‌ను గుర్తించారని, వారు తమ సహాయం కోరారని చెప్పారు.

 అప్పుడు ప్రారంభ దశలో

అప్పుడు ప్రారంభ దశలో

వారు పంపిన ఆధారాలను బట్టి అవి ఏమిటో తాము చెప్పేందుకు ప్రయత్నిస్తామని వారికి చెప్పామని ఆయన చెప్పారు. ఆ సమయంలో వన్యప్రాణి ఫోరెన్సిక్... ముఖ్యంగా డీఎన్ఏ గుర్తింపు ప్రారంభ దశలో ఉందన్నారు. ఆ తర్వాత కొత్తగా డెవలప్ చేసిన మార్కర్స్, మెథాడలజీతో తాము కృష్ణ జింకలను గుర్తించామన్నారు.

 అన్నీ వివరించాం

అన్నీ వివరించాం

2015లో కోర్టుకు సమర్పించామని, తాము ఎలా పరీక్షలు నిర్వహించామో వెల్లడించామని తెలిపారు. క్రాస్ ఎగ్జామినేషన్‌లోను తాను అన్నీ వివరించగలిగానని చెప్పారు. చివరకు సల్మాన్ ఖాన్ విషయంలో కోర్టు తీర్పు విషయంలో సంతృప్తికరంగా ఉందన్నారు.

 పలుకుబడిన వ్యక్తి అయినా వివరించాం

పలుకుబడిన వ్యక్తి అయినా వివరించాం

కాగా, జీవీ రావు హైదరాబాదులోని అల్వాల్‌లో నివసిస్తున్నారు. హైదరాబాద్ జూలో చనిపోయిన శక్తి పులి తదితర కేసులలోను ఇతని పాత్ర ఉంది. నిందితుడు చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి అయినప్పటికీ ఈ తీర్పుతో ఆనందంగా ఉందని చెప్పారు.

English summary
The crucial evidence of a DNA fingerprinting expert from Hyderabad, who conducted wildlife forensic tests on the samples of blackbuck sent to Hyderabad lab, Centre for DNA fingerprinting and Diagnostics(CDFD), has helped the prosecution to nail the actor Salman Khan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X