హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'సైబర్' కుచ్చుటోపీతో కుదేలైన కల: ఆ డాక్టర్ ఆశలు ఆవిరి..

మలక్‌పేట ప్రాంతానికి చెందిన వైద్యుడు అమీర్‌.. కెనడాలో ఉద్యోగం చేయాలని చాలా ఏళ్ల నుంచి కలలు కంటున్నాడు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కెనడాలో ఉద్యోగం చేయాలనేది అతని కల. ఇందుకోసం ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ అందిస్తున్న ఒక ఆన్‌లైన్‌ సైట్‌లో వివరాలు నమోదు చేసుకున్నాడు. స్పందించిన సదరు సైట్ నిర్వాహకులు.. కెనడాలోని పలానా ఆసుపత్రిలో ఉద్యోగం ఆఫర్ చేస్తున్నామంటూ నమ్మించారు.

ఇక తన కల నెరవేరిందనుకున్న సదరు వ్యక్తి.. వాళ్లు అడగడమే ఆలస్యం రూ.9.55లక్షలను వాళ్ల ఖాతాల్లో జమచేశాడు. అయితే అమీర్ పంపించిన సర్టిఫికెట్లకు ఇన్సూరెన్స్ నిమిత్తం మరింత డబ్బు పంపించాలని సైబర్ నేరగాళ్లు అడగడంతో.. అతనికి అనుమానం మొదలైంది. ఆరా తీస్తే మోసపోయానని తేలింది.

 మలక్‌పేట అమీర్:

మలక్‌పేట అమీర్:

మలక్‌పేట ప్రాంతానికి చెందిన వైద్యుడు అమీర్‌.. కెనడాలో ఉద్యోగం చేయాలని చాలా ఏళ్ల నుంచి కలలు కంటున్నాడు. తన కలను నిజం చేసుకోవడం కోసం క్రోయిజ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ అనే ఆన్‌లైన్‌ సైట్‌లో రిజిస్టర్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు కెరియర్‌.డీజీహెచ్‌ ఎట్‌ జీమెయిల్‌.కామ్‌ అనే ఐడీ నుంచి ఓ ఈ-మెయిల్‌ వచ్చింది.

ఈమెయిల్‌‌లో ఏముంది?:

ఈమెయిల్‌‌లో ఏముంది?:

డీసీఏ పైపర్ల అనే ఏజెన్సీలో పనిచేసే స్ట్రాంట్లీ అనే వ్యక్తి పేరు మీద ఆ మెయిల్ వచ్చింది. తమ వద్ద కొన్ని ఉద్యోగాలు ఉన్నాయని, బయోడేటా పంపాల్సిందిగా అందులో పేర్కొన్నారు. దీంతో అమీర్ వాళ్లు చెప్పినట్లు చేశాడు. ఆపై మీకున్న అర్హతలకు కెనడాలోని దరమ్‌ ఆస్పత్రిలో ఉద్యోగం వచ్చిందంటూ మరో మెయిల్ పంపించారు. కెరియర్స్ దరమ్ ఎట్ జీమెయిల్.కామ్ ఐడీ నుంచి మెయిల్ రావడంతో.. ఉద్యోగం రావడం నిజమేననుకున్నాడు.

సర్టిఫికెట్లు అడగడంతో:

సర్టిఫికెట్లు అడగడంతో:

కెనడాలో ఉద్యోగం చేయాలంటే.. అక్కడి ప్రభుత్వం ఇష్యూ చేసే కొన్ని సర్టిఫికెట్ అవసరమవుతాయని నమ్మబలికారు. ప్రాసెసింగ్‌ ఫీజ్, వీసా ఫీజ్, ఏజెన్సీ సర్టిఫికేషన్, పోలీస్‌ క్లియరెన్స్‌ డాక్యుమెంట్, కెనడా ఆర్థిక విభాగం నుంచి ఫండ్‌ రిలీజ్‌ ఆర్డర్, కెనడాకు చెందిన జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి యాంటీ మనీలాండరింగ్‌ క్లీన్‌చిట్‌ సర్టిఫికెట్‌.. ఇలా రకరకాల సర్టిఫికెట్స్ కావాలని చెప్పారు. వీటికి గాను భారీ మొత్తంలో ఖర్చు అవుతుందని చెప్పి.. వివిధ బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.9.55లక్షలు జమ చేయించుకున్నారు.

మోసపోయానని తెలుసుకున్నాడు:

మోసపోయానని తెలుసుకున్నాడు:

తన వద్ద నుంచి డబ్బు గుంజి ఓ ఫేక్ మెయిల్ నుంచి జాబ్ వచ్చిందంటూ మెయిల్ చేశారు.విషయం తెలియని అమీర్.. నిజంగానే జాబ్ వచ్చిందని సంతోషించాడు. అయితే ఇంతలోనే.. కెనడాలో అవసరమయ్యే సర్టిఫికెట్లకు ఇన్సూరెన్స్ నిమిత్తం మరింత డబ్బు చెల్లించాలంటూ మరో మెయిల్ వచ్చింది.

బీమా, కొరియర్‌ చార్జీలకు మరో రూ.3.99 లక్షలు డిపాజిట్‌ చేయమని చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన అమీర్.. ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Ameer, A hyderabad doctor cheated by cyber criminals in the name of job. They collected Rs 9lakhs from him
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X