వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో హైదరాబాద్ వైద్యుడి పాఠాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమెరికా దేశంలో అక్కడి వైద్యులకు పాఠాలు చెప్పిన ఘనతను హైదరాబాద్‌కు చెందిన వెన్నుపూస వైద్య నిపుణుడు డాక్టర్ సురేష్‌బాబు దక్కించుకున్నారు. ప్రపంచ స్కోలియోసిస్ రీసెర్చ్ సొసైటీలో సురేష్‌బాబు ఘనతకు పురస్కారం కూడా లభించింది.

చిన్నతనంలోనే వెన్నుపూస వంకర్లుపోయిన చిన్నారులకు ఆ వ్యాధిని సరిచేయడంలో సురేష్ ఖ్యాతినార్జించారు. దీనికోసం కొత్త వైద్యాన్నికూడా ఆయన కనుగొన్నారు. సుమారు 15 మంది చిన్నారులకు వైద్యం చేసి వైద్య విధానాన్ని ధృవీకరించారు.

Hyderabad doctor suresh babu takes lessons in USA

వెన్నుపూస వైద్యంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతిభ కనపరచిన వారిలో ముగ్గురిని ఎంపిక చేసి పురస్కారం అందించడమే కాకుండా, అమెరికాలోని ఐదు ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో పాఠాలు చెప్పే అవకాశాలు కూడా రీసెర్చ్ సొసైటీ కల్పిస్తుంది.

ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి అవకాశం పొందిన సురేష్‌బాబు నాలుగు వారాలపాటు న్యూయార్క్, కాలిఫోర్నియా, కొలంబియా, శాండియాగో, శాన్‌ప్రాన్సిస్కో విశ్వవిద్యాలయాల్లో వెన్నుపూస వైద్యంపై వివరించారు. అలాగే అక్కడ అమలుచేస్తున్న విధానాలను కూడా అధ్యయనం చేశారు.

అమెరికాలో 30 వేల డాలర్ల వరకు వెన్నుపూస వైద్యానికి ఖర్చు అవుతుండగా, సురేష్‌బాబు వైద్యం మాత్రం 1500 డాలర్లకే జరుగుతుండడంపై అమెరికాలో ప్రశంసలు లభించాయి.

English summary
The Hyderabad doctor Suresh babu was selected to take lessons in the universties of USA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X