హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దటీజ్ ఇవాంకా!: అమెరికా నుంచి ఉపగ్రహం ద్వారా నిఘా, లోదుస్తుల్లో ఆయుధాలు

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ రానున్న నేపథ్యంలో అందుకోసం ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ రానున్న నేపథ్యంలో అందుకోసం ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. వెస్టిన్ హోటల్, ఫలక్‌నుమా ప్యాలెస్, గోల్కొండ హోటల్ రహదారిలో రోడ్లు, రోడ్డు పరిసరాలు ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తున్నారు.

చదవండి: ఇవాంకా హైదరాబాద్‌లో ఇలా, 500 కెమెరాలు: సదస్సుతో స్టార్టప్‌లకు 'మిలియన్ డాలర్ల్' ఛాన్స్

అలాంటి ఇవాంకా రాక కోసం భద్రతా ఏర్పాట్లు కూడా భారీగానే ఉన్నాయి. అమెరికా నుంచి భద్రతను పర్యవేక్షించనున్నారు. వాషింగ్టన్ నుంచే అమెరికన్ సీక్రెట్ సర్వీసెస్ సిబ్బందికి సూచనలు ఇవ్వనున్నారు. ఇవాంకా వ్యక్తిగత సిబ్బందికి అత్యాధునిక ఫోన్లు, ట్యాబ్‌లు ఉంటాయి.

ఇవాంకా ట్రంప్ భద్రతా పర్యవేక్షణ కోసం ఉపగ్రహ నిఘా

ఇవాంకా ట్రంప్ భద్రతా పర్యవేక్షణ కోసం ఉపగ్రహ నిఘా

ఇవాంకా ట్రంప్‌కు రక్షణ కవచంగా గెరిల్లా బృందం ఉంటుంది. ఆమెకు అదనంగా అయిదు అంచెల రక్షణ ఉంటుంది. ఇవాంకా.. వైట్ హౌస్ సలహాదారు కూడా. ఇవాంకాకు అయిదు అంచెల రక్షణ వలయంతో చేయడంతోపాటు, హైదరాబాద్‌కు వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్లేంత వరకు భద్రతను అమెరికా నుంచే పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం ఉపగ్రహ నిఘాను వినియోగిస్తున్నారు.

ఇవాంకా రక్షణ కోసం 60 మంది ప్రత్యేకంగా

ఇవాంకా రక్షణ కోసం 60 మంది ప్రత్యేకంగా

గతంలో జార్జిబుష్ హైదరాబాద్ వచ్చారు. ఆయన భద్రత కోసం అమెరికన్ సీక్రెట్ సర్వీస్ అధికారులు ఆమెరికా నుంచి ఉపగ్రహం ద్వారా సమీక్షించారు. ఇప్పుడు అందుకు ఎన్నో రెట్ల టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇవాంకా కదలికలను గమనించి నిరంతరం రక్షించేందుకు 60 మంది అధికారులతో మూడు బృందాలు హైదరాబాద్ వచ్చాయి.

గెరిల్లా విద్యలో ఆరితేరి, చేతులే ఆయుధంగా

గెరిల్లా విద్యలో ఆరితేరి, చేతులే ఆయుధంగా

ఇవాంకా భద్రత తొలి అంచె 3 మీటర్ల నుంచి ప్రారంభం అవుతుంది. అనూహ్య సంఘటన జరిగినప్పుడు భద్రతాధికారులు మెరుపు వేగంతో స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకుంటారు. వీరికి చేతులో ఆయుధాలు. గెరిల్లా యుద్ధ విద్యలో నిష్ణాతులు అయి ఉంటారు.

లోదుస్తుల్లో ఆయుధాలు

లోదుస్తుల్లో ఆయుధాలు

రెండో అంచె అయిదు మీటర్ల పరిధిలో ఉంటుంది. దీనిని సీపీటీగా అభివర్ణిస్తారు. ఈ టీంతో పాటు కేంద్ర పారామిలిటరీ బృందం భద్రతను పర్యవేక్షిస్తారు. వీరి లోదుస్తుల్లో ఆయుధాలు ఉంటాయి.

సమావేశం ప్రాంతంలో భద్రతా సిబ్బంది

సమావేశం ప్రాంతంలో భద్రతా సిబ్బంది

సదస్సులు, సమావేశాలు పాల్గొనే ప్రాంతంలో ఈ భద్రతా వలయం ఉంటుంది. వీరు అందరినీ నిశితంగా పరిశీలిస్తారు. గుర్తింపు కార్డులు లేని, చివరి నిముషంలో లోపలికి వెళ్లే వారిని అనుమతించరు. నాలుగో అంచె భద్రతలో ఇవాంకాకు వంద మీటర్ల దూరంలో 15 మంది ఉంటారు. వీరు వేర్వేరు ప్రాంతాల్లో ఉండి వాహనాల రాకపోకలను, అపరిచితులపై దృష్టి పెడతారు. అనుమానాస్పదంగా కనిపిస్తే అదుపులోకి తీసుకుంటారు.

అయిదో అంచెలో ఇలా

అయిదో అంచెలో ఇలా

అమెరికన్‌ సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు అయిదో అంచె భద్రతా వ్యూహాన్ని 500 మీటర్ల దూరం నుంచి అమలు చేస్తారు. అమెరికాలో ఉంటూ ఉపగ్రహం ద్వారా ఇవాంకా చుట్టూ ఉన్న పరిసరాలను గమనించే సిబ్బంది ఎప్పటికప్పుడు ఈ భద్రతా వలయం అధికారులతో మాట్లాడుతుంది. వారు చిత్రీకరించిన దృశ్యాలను ఇక్కడికి పంపుతారు. వాటిని చూసేందుకు వీలుగా ట్యాబ్‌లను వినియోగిస్తారు.

ఇవాంకా వెంట ప్రత్యేక వైద్య బృందం

ఇవాంకా వెంట ప్రత్యేక వైద్య బృందం

ఇక, ఇవాంకా వెంట ప్రత్యేక వైద్య బృందం కూడా వస్తోంది. పర్యటనలో భాగంగా ఆమెకు ఏదైనా అనారోగ్య సమస్య, అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉంటారు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం కూడా వైద్య సేవల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సదస్సు వేదిక వద్ద ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేసి ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులతో కూడిన మూడు బృందాలను అందుబాటులో ఉంచనుంది. కార్డియాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్, అనెస్థీషియన్ సహా నర్సులు, పారామెడికల్ సిబ్బంది ఉంటారు. సదస్సు ప్రాంగణం బయట మూడు అంబులెన్సులు సిద్ధంగా ఉంచుతారు. సమీపంలోని కిమ్స్, నిమ్స్, అపోలో ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

చదవండి: ప్రధాని మోడీ, ఇవాంకా కోసం హైదరాబాద్ ఎలా తయారయిందంటే (ఫోటోలు)

చదవండి: ఇవాంకా హైదరాబాద్ పర్యటన కథనాలు

English summary
Hyderabad Police is making elaborate arrangements for the visit of US President Donald Trump's daughter and advisor Ivanka Trump to the city next week. Ivanka Trump will be heading the US delegation for the GES.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X