హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ 'నలుగురి'పై ప్రశ్నలతో రవితేజ ఉక్కిరిబిక్కిరి, 'కిక్' ఎఫెక్ట్: శాంపిల్స్‌కు నో

డ్రగ్ కేసులో సినీ నటుడు రవితేజ విచారణ శుక్రవారం సాయంత్రం ఏడున్నర గంటలకు ముగిసింది. ఉదయం పదిన్నర గంటల నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు సాగింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రగ్ కేసులో సినీ నటుడు రవితేజ విచారణ శుక్రవారం సాయంత్రం ఏడున్నర గంటలకు ముగిసింది. ఉదయం పదిన్నర గంటల నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు సాగింది.

చదవండి: రవితేజ అలా ఇరుక్కున్నాడా: ఎన్నో ప్రశ్నలు-మరెన్నో అనుమానాలు, ఏది నిజం!?

విచారణలో రవితేజ చాలా విషయాలు వెల్లడించారని తెలుస్తోంది. కెల్విన్, జిషాన్ అలీలతో పరిచయాలపై సిట్ రవితేజను ఉక్కిరిబిక్కిరి చేసినట్లుగా తెలుస్తోంది. విచారణలో కీలక విషయాలు రాబట్టారని తెలుస్తోంది.

ఆ నలుగురిపై ప్రశ్నలు

ఆ నలుగురిపై ప్రశ్నలు

కెల్విన్, జిషాన్, పూరీ జగన్నాథ్, చార్మీల గురించి రవితేజను అధికారులు విచారించారని తెలుస్తోంది. కెల్విన్‌తో పరిచయం, జిషాన్ చెప్పిన విషయాలను ముందు పెట్టి విచారించారని తెలుస్తోంది. అలాగే, పూరీ, చార్మీలతో పాటు మీరంతా డ్రగ్స్‌కు బానిస అయ్యారా అని ప్రశ్నించారని తెలుస్తోంది.

పూరీతో ఐదు సినిమాలు.. కిక్ సినిమా సమయంలో..

పూరీతో ఐదు సినిమాలు.. కిక్ సినిమా సమయంలో..

పూరీ జగన్నాథ్‌తో రవితేజ ఐదు సినిమాలు చేశారని, ఈ సినిమాల షూటింగ్ అనంతరం ఎక్కడకు వెళ్లేవారని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కిక్ సినిమా సమయంలో విదేశాల్లో ఉన్నారని, ఆ సమయంలో మీకు డ్రగ్ అలవాటు అయిందా అని ప్రశ్నించారని తెలుస్తోంది.

కెల్విన్ తెలుసని చెప్పాడని సమాచారం..

కెల్విన్ తెలుసని చెప్పాడని సమాచారం..

తనకు కెల్విన్‌తో పరిచయం ఉందని విచారణలో రవితేజ చెప్పాడని తెలుస్తోంది. అయితే డ్రగ్ రాకెట్ గురించి సమాచారం తెలియదని చెప్పాడని సమాచారం. కెల్విన్‌తో సెల్ఫీల నేపథ్యంలో పరిచయం ఉందని చెప్పాడని సమాచారం.

ఉదయం ఇలా, మధ్యాహ్నం ఇలా, భరత్ గురించి

ఉదయం ఇలా, మధ్యాహ్నం ఇలా, భరత్ గురించి

రవితేజను ఉదయం నుంచి మధ్యాహ్నం లంచ్ వరకు వ్యక్తిగత విషయాలు అడిగినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కేసుకు సంబంధించిన వివరాలు ఆరా తీశారని తెలుస్తోంది. సోదరుడు భరత్ ఏడేళ్ల క్రితం పట్టుబడినప్పటి నుంచి.. ఇప్పటి వరకు జరిగిన పలు వివరాలు ఆరా తీశారని తెలుస్తోంది.

శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరణ

శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరణ

నటుడు రవితేజ విచారణ అనంతరం శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరించారని తెలుస్తోంది. వెంట్రుకలు, గోళ్లు వంటి శాంపిల్స్ అడిగారు. కానీ సిట్ అధికారులకు ఆయన నో చెప్పారని తెలుస్తోంది.

English summary
The interrogation of Tollywood star Ravi Teja by the Special Investigation Team (SIT) in the Hyderabad drug case completed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X